Will gold prices come down

prices, gold, come down, diwali, dhantheras, 15 percent, growth in sales, Gold price, international market, All India Gems Jewellery Trade Federation

prices of gold may come down after diwali and dhantheras

ఊరిస్తున్న బంగారం ధర.. దిగివస్తుందా..?

Posted: 10/15/2014 06:16 PM IST
Will gold prices come down

మార్కెట్లో బంగారం ధర ఊరిస్తోంది. మరింత దిగివస్తుందేమో అనుకుంటూ కొనేందుకు ప్రజలు ధైర్యం చేయడం లేదు. తాము కొన్న తరువాత పుత్తడి ధర తగ్గితే తమ చేతిలోని పసిడికి వన్నే తగ్గినట్లే నని బావిస్తూ, డోలాయమానంలో కొట్టమిట్టాడుతున్నారు. గత కొంతకాలంగా బంగారం ధర తగ్గుతూ రావడంతో పుత్తడి కొనేందుకు వినియోగదారులు ఉత్సాహం కనబరుస్తున్నా.. మరింత తగ్గుందేమో నన్న అలోచన కూడా వారిలో  కలుగుతోంది.  అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధర  మరికాస్త తగ్గుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీపావళి నాటికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.25 వేలకు చేరొచ్చని అంచనా వేస్తున్నాయి.

ఈసారి దీపావళికి  బంగారు అభరణాల  అమ్మకం ఊపుమీద జరుగుతుందని  వర్తకులు ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. క్యాడ్ కట్టడిలో భాగంగా ప్రభుత్వ నిబంధనలతో కొన్ని నెలలుగా భారత్‌లో బంగారు ఆభరణాల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ ఏడాది ఆభరణాల విపణిలో ధంతేరాస్, దీపావళి పండుగలు కొత్త వెలుగులు జిమ్ముతాయని వ్యాపారులు విశ్వాసంగా ఉన్నారు. వచ్చే పెళ్లిళ్ల సీజన్ కోసం ముందస్తుగా కస్టమర్లు బంగారుకడ్డీలను కొని దాచుకుంటున్నారని వ్యాపారులు తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లో 2014 జూలై 10న 10 గ్రాముల బంగారం ధర రూ.25,800 నమోదైంది. అప్పటి నుంచి క్రమేపీ ధర కిందకు వస్తూనే ఉంది. దీంతో ఆభరణాలకు బదులు పుత్తడి కడ్డీలకు డిమాండ్ పెరిగిందని బులియన్ వర్తకులు అంటున్నారు. జూలై నుంచే ఈ ట్రెండ్ పెరుగుతోందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే కడ్డీల అమ్మకాల్లో వృద్ధి 50 శాతం నమోదైంది. ధర తక్కువ కావడం వల్లే కడ్డీల అమ్మకాలు పెరిగాయి. పెళ్లి సమయానికి కడ్డీలను మార్చుకొని మళ్లీ ఆభరణాలను చేయించుకునే వారు కడ్డీలను కోనుగోలు చేస్తున్నారు. సాధారణ కస్టమర్లు మాత్రం ఆభరణాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని, ధన్‌తేరాస్, దీపావళికల్లా ఈ మార్కెట్ పుంజుకుంటుందని వర్తకులు ఆశాభావంగా వున్నారు.

ధన్‌తేరాస్, దీపావళి రోజుల్లో కొనే బంగారం మరో ఏడాది వచ్చే సరికి రెట్టంపు అవుతుందన్న నమ్మకం వున్న ప్రజలు ఈ రోజుల్లో బంగారం కోనుగోలు చేసుందుకు ఇష్టపడతారు. దీంతో ప్రజల అవసరాలకు అనుగూనంగా విభిన్న డిజైన్ల, మోడళ్లలో ఆభరణాలను సిద్దం చేసే పనిలో వర్తకులున్నారు. గతం కన్నా మెండుగా అమ్మకాలు జరుగుతాయన్న అంచానాలతో ముడి బంగారానికి డిమాండ్ పెరగింది. దీంతో 10 రోజుల్లో బంగారం దర స్వల్పంగా పెరిగింది. అయితే పండుగల సీజన్‌కు 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.25 వేలకు వచ్చే అవకాశముందని అంచనా.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles