Microsoft announces windows 10 skips version 9

microsoft, windows 10, windows 9, personal computers

microsoft announces windows 10, skips version 9

విండోస్ 10ను అవిష్కరించిన మైక్రోసాఫ్ట్

Posted: 10/01/2014 12:25 PM IST
Microsoft announces windows 10 skips version 9

మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ యాజమాన్యం దసరా కానుకను అందించింది. ప్రపంచవ్యాప్తంగా వున్న తన వినియోగదారులను ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. ముందుగా ప్రకటించడంతో.. విండోస్ 9 ను విడుదల చేస్తుందని అంతా అనుకున్నారు. అందరి అంచనాలను తలదన్నెలా.. విండోస్ 9 వర్షన్ బదుుల విండోస్ 10 ను అవిష్కరించింది. తీవ్ర విమర్శలను ఎదుర్కోన్న విండోస్ 8 స్థానంలో.. దాన్ని మరింత అప్గ్రేడ్ చేసి.. విండోస్ 9ను విడుదల చేస్తుందని అంతా ఎదురుచూస్తున్న తరుణంలో అనూహ్యంగా మైక్రోసాఫ్ట్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

టాబ్లెట్లు, ఫోన్లు, సాధారణ కంప్యూటర్లు.. అన్నింటికీ ఇది ఉపయోగపడుతుందని.. అందరి అంచనాలకు తగినట్లుగానే దీనిని రూపొందించామని యాజమాన్యం పేర్కొంది.విండోస్ 10 ఇప్పటివరకు తాము విడుదల చేసిన వాటిలో అత్యుత్తమం అవుతుందని మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ టెర్రీ మయర్సన్ అన్నారు. రెండేళ్ల క్రితం విడుదలైన విండోస్ 8ను కేవలం 20 శాతం సంస్థలు మాత్రమే ఉపయోగిస్తున్నాయని సాంకేతిక అంశాల పరిశోధన సంస్థ ఫారెస్టర్ తెలిపింది. చాలామంది పీసీ యూజర్లు ఈ ఇంటర్ఫేస్ను ఏమాత్రం ఇష్టపడలేదని.. ఇంతకాలం ఉన్న స్టార్ట్ బటన్ పాపప్ మెనూ లేకపోవడం వాళ్లకు లోటుగా కనిపించిందని తెలిపింది.

ఎక్స్బాక్స్ నుంచి పీసీ వరకు, ఫోన్ల నుంచి టాబ్లెట్ల వరకు, చిన్న చిన్న గాడ్జెట్లకు కూడా విండోస్ 10 సరిగ్గా సరిపోతుందని మయర్సన్ అంటున్నారు. యాపిల్ సంస్థ ఐఫోన్, ఐప్యాడ్లను విడుదల చేయడం, మరోవైపు గూగుల్ ఆండ్రాయిడ్ ఉత్పత్తులను విడుదల చేయడంతో విండోస్ పెద్దగా ఆదరణ పొందకపోవడం మైక్రోసాఫ్ట్ను కలవరపరుస్తోంది. దీనికి తోడు విండోస్ ఎక్స్పీ తర్వాత వచ్చిన ఉత్పత్తులేవీ పెద్దగా జనంలోకి వెళ్లలేదు. పదేళ్ల క్రితం పర్సనల్ కంప్యూటర్ల రంగంలో రారాజుగా ఉన్న విండోస్.. ఇప్పుడు కేవలం 14 శాతానికి మాత్రమే పరిమితమైందని గార్ట్నర్ సంస్థ తెలిపింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : microsoft  windows 10  windows 9  personal computers  

Other Articles