Google busy working on project x

Google X', smartphone, application, project, world, Australia

google busy working on project X, soon may step into courier services

బట్వాడా రంగంలోకి గూగుల్.. ప్రయోగం విజయవంతం..

Posted: 10/02/2014 03:51 PM IST
Google busy working on project x

యావత్ ప్రపంచాన్ని తన  ఆవిష్కరణల ద్వారా ఆశ్చర్యపరిచే గూగుల్ సంస్థ మరో విభిన్నమైన అవిష్కరణకు సిద్దం అవుతోంది. ఈ మధ్య కాలంలో ఆనరాయడ్ వన్ ను అవిష్కరించిన ఈ సంస్థ.. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, అప్లికేషన్‌ల కొనుగోలు ఒప్పందాల్లో బిజీగా వుంది. ఆ మధ్య కాలంలో గూగుల్ గ్లాస్‌ప్రాజెక్ట్ గురించి ప్రకటించడం తప్ప పెద్దగా హడావుడి చేసింది లేదు. మారుమూల గ్రామాలకు బెలూన్ సౌజన్యంతో ఇంటర్ నెట్ ను అందించాలనుకున్నా.. అవి ఇంకా అవిష్కృతం కాలేదు. ప్లే స్టోర్ మీదే ఎక్కువ ఏకాగ్రత నిలిపినట్టు అనిపిస్తున్నా... గూగుల్ గత రెండేళ్లుగా రహస్యంగా ఒక ప్రాజెక్టును చేపట్టింది. దాని పేరే ‘గూగుల్ ఎక్స్’!

గూగుల్ ‘ఎక్స్’ ఏమిటి? ఏమా కథా అనే విషయమై పూర్తి సమాచారం అందించేందకు ఆ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఈ ప్రాజక్టు సంబంధించి.. ఇటీవలే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రూరల్‌లోని ఒక ప్రాంతం. అక్కడి కొండల గుట్టల నడుమ ఉండే ఒక రైతు ఇంటికి చెర్రీరైప్ చాక్లెట్లను డెలివరీ చేయడం ద్వారా గూగుల్ ఎక్స్ ప్రాజెక్టు ప్రయోగం తొలి ధశ సక్సెస్ అయ్యిందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. గూగుల్ సంస్థ చెర్రీరైప్ చాక్లట్లను మారుమూల గ్రామంలో డెలివరీ చేయడమేంటి..? ప్రయోగం తొలిధవ విజయవంతం కావడమేంటనేగా మీ డౌట్..

ప్రపంచ భవితపై తాను సృష్టించిన కొత్త ప్రయోగం చూపడానికి గూగుల్ వేసిన మరో అడుగు ఇది. మానవ రహిత విమానాల ద్వారా సరుకులను బట్వాడ చేసే ప్రయోగమే ఇది. సిరియా, అఫ్టనిస్థాన్ లలో ద్రోణులను వినియోగించి శత్రువులను మట్టికరిపిస్తున్న అమెరికాను ఆదర్శంగా తీసుకున్న గూగుల్.. ఇప్పుడు అదే పద్దతిలో నిర్ధేశిత లక్ష్యాలకు చేరకుని వారికి కావాలసిన సరుకులను బట్వాడా.. రవాణా చే్స్తుందన్న మాట. ఈ ధశలో తొలి ప్రయోగంగా తాము రూపొందించిన ద్రోణి సాయంతో మారుమూల ప్రాంతంలోని ఒక ఇంటికి చాక్లెట్లను డెలివరీ చేసింది. మరి కొన్ని సంవత్సరాల్లో ప్రపంచంలోని డెలివరీ తీరునే మార్చేస్తామనే విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

దీని ద్వారా వాహనాల రద్దీ తగ్గుతుందని ఇక సరుకుల డెలివరీ కోసం ప్రత్యేకంగా మనుషుల అవసరం లేదని... పనులు మానుకొని షాపుల వరకూ వెళ్లాల్సిన అవసరం కూడా లేదని చెబుతోంది. అంతేకాదండోయ్.. బట్వాడాకు ఇచ్చిన సరుకులు కేవలం గంటల వ్యవధిలోనే ఇళ్లకు చేరుకుంటుందని కూడా సంస్థ వర్గాలు తెలిపాయి. ఆర్డర్ చేసిన వస్తువులను తీసుకొని అడ్రస్ పట్టుకొని ఒక బుల్లి విమానం మీ ఇంటి వద్ద ల్యాండ్ అవుతుంది... గూగుల్ ద్రోణులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే జరిగేది ఇదేనంటున్నాయి సంస్థ వర్గాలు. వర్షాలు పడినా, నిప్పులను తలపించే విధంగా భానుడి తాపం వున్నా, మంచు కురిసినా ఎలాంటి వాతావరణానైనా తట్టుకుని మీ సరుకులు ఇళ్లకు చేరుకుంటాయి. షాపుల వద్ద నుంచి ఫుడ్‌కోర్టుల వద్ద రెడీగా ఉన్న డ్రోన్స్ సరుకును తీసుకొని టేకాఫ్ అవుతాయి. ఆర్డర్ చేసిన వారి దగ్గర ల్యాండ్ అవుతాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 30 ద్రోణులు  పని చేయిస్తున్నారు.

చూడటానికి విమానంలా కనిపించినా.. హెలీకాప్టర్ ఫీచర్స్‌తో ఉండే ఒక హైబ్రీడ్ వాహనమే ఈ ద్రోణి. నిట్టనిలువుగా టేకాఫ్ అవుతుంది. పక్షిలాగా మలుపు తిరుగుతుంది. సిమెంటు నిర్మాణాలపై కూడా ల్యాండ్ అవుతుంది. అవసరాన్ని బట్టి వీటి క్యారేజ్‌లు ఏర్పాటు చేస్తారు. సురక్షణ, వేగాలే ప్రత్యేకతగా డెలివరీ సిస్టమ్‌లో సరికొత్త మార్పుగా ఆవిష్కృతం అవుతున్నాయి గూగుల్ ద్రోణులు. అంతర్గతమైన ప్రోగ్రామింగ్, గగనతలంలో విహరించేటప్పుడు భూతలంలోని స్టేషన్ నుంచి ఆపరేట్ చేయడం ద్వారా ఇవి నిర్దేశించిన గమ్యాన్ని చేరతాయి. వస్తువులను డెలివరీ చేస్తాయి. నికోలస్‌ రోయ్ గూగుల్ ‘ఎక్స్’ ప్రాజెక్ట్ హెడ్‌గా ఉన్నారు.

తాము ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నామని.. అందుబాటులోకి వస్తే మంచి ఫలితాలు ఉండబోతున్నాయని నికోలస్ రాయ్ చెప్పారు. సరుకుల బట్వాడాలో ద్రోణులు పూర్తి స్థాయిలో విజయవంతం అయితే మానవజీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపగలవన్నారు. ఈ డ్రోన్స్. ఇప్పుడు ఏయే వస్తువుల విషయంలో ‘డెలివరీ’ అనేది ప్రత్యేకమైన అంశం అవుతోందని భావిస్తున్నట్లు చెప్పారు... వివిధ వస్తువులు ఎలా ఇళ్లకు చేరుతున్నాయి.. వాటికోసం ఎన్ని వనరులను ఉపయోగిస్తున్నారో అధ్యయనం చేసిన తరువాత పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తాయని నికోలస్ రాయ్ అశాభావం వ్యక్తం చేశారు..

ఇటీవలే బ్రెజిల్‌లో జరిగిన ఫిఫా (ఫుట్ బాల్) వరల్డ్ కప్ మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియంలలో ద్రోణులు విహరించాయి. వాటికి అమర్చిన కెమెరాల ఫుటేజీనే మనం లైవ్‌లో చూశామంటే నమ్మగలరా..? కానీ ఇదే నిజం. ఇప్పటికే గూగుల్‌ గ్లాసెస్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇప్పుడు డ్రోన్స్ కూడా అంతే ఆసక్తిని రేపుతున్నాయి. వాణిజ్య పరంగా... సౌకర్యంగా ఉపయోగపడతాయనే అభిప్రాయాలు... గూగుల్‌పై సహజంగానే ఉండే భారీ అంచనాలు... ఈ ద్రోణులపై ఆసక్తిని మరింత అధికం చేస్తున్నాయి. త్వరలోనే వీటి విహారం అని గూగుల్ కూడా హామీ ఇస్తోంది కాబట్టి.. లెట్ వెయిట్ అండ్ సీ..!
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Google X'  smartphone  application  project  world  Australia  

Other Articles