Atms can advertise financial products

ATMs can advertise financial products

ATMs can advertise financial products

ఇక ఏటీఎం ల్లో కూడా ప్రకటనలు

Posted: 01/03/2014 03:51 PM IST
Atms can advertise financial products

ప్రజలకు ఎల్ల వేళల డబ్బును అందుబాటులోకి ఉంచేందుకు బ్యాంకులు ఏటీఎం మిషన్లను పెట్టింది కానీ వాటి నిర్వహణ, రక్షణ మాత్రం మరచింది. దీంతో ఏటీఎం ల్లో దొంగ తనాలు, ఏటీఎం సెంటర్లలో ప్రజల పై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల బెంగుళూరులో ఓ మహిళ పై దాడి జరిగిన నేపథ్యంలో ఏటీఎం ల వద్ద భద్రత కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తే, రక్షణ కల్పించలేమని, వాటి నిర్వహణ వ్యయాన్ని మేం మోయలేమని చేతులెత్తేసింది.

ఆ మధ్య రాత్రి వేళల్లో ఏటీఎం సెంటర్లను మూసి వేయాలని నిర్ణయం తీసుకుంటూ ఆర్ బీఐకి ఓ లేఖ రాశారు. కానీ భధ్రత తప్పని సరి అని భావించిన బ్యాంకులు వాటి నిర్వహణ కోసం అయ్యే వ్యయాలను ఎలా రాబట్టుకోవాలనే దాని పై ద్రుష్టి సారించింది. ఇందులో భాగంగా ఏటీఎంలలో కూడా ప్రకటనలు ఉంచడం, విత్‌డ్రాయల్ చార్జీలు పెంచడం వంటి అంశాలను పరిశీలిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీటన్నింటిలో నిఘా కెమెరాలు (లోపల, బైట), సమీప పోలీస్ స్టేషన్‌ని అప్రమత్తం చేసేలా అలారమ్‌లు మొదలైనవి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

అలాగే సుశిక్షితులైన సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలి. ఇంత భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడమన్నది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే, బ్యాంకులు ఇందుకు నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. బీమా, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు మొదలైన వాటి ప్రకటనలను ఏటీఎంలలో ప్రదర్శించడం ద్వారా కొంత మేర ఆదాయం సమకూర్చుకోవచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి.

ఇక ఉచిత లావాదేవీల సంఖ్యను కూడా తగ్గించాలని యోచిస్తున్నాయి. సొంత బ్యాంకు ఏటీఎంలలో సైతం ఉచిత లావాదేవీలను ఐదుకు పరిమితం చేయడంపైనా బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. అయితే ప్రజల పై భారాన్ని మోపి ఏటీఎం సెంటర్లలో భధ్రతను పెంచాలనే ఆలోచన పై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles