Airtel to offer free facebook access

Airtel free Facebook offer,Facebook access in airtel, Indian languages, airtel prepaid customers, Hindi, Bengali, Gujarati, Marathi, Punjabi, Tamil, Telugu, Kannada,Malayalam.

Indian mobile operator Airtel will offer Facebook access in nine regional Indian languages.

ఎయిర్ టెల్ వినియోగ దారులకు ఫ్రీ ఫేస్ బుక్

Posted: 12/28/2013 04:29 PM IST
Airtel to offer free facebook access

ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు వాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరగడం, ఎక్కువ మంది మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ ని వినియోగిస్తుండటంతో టెలికం కంపెనీలు వినియోగ దారులను ఆకర్షించడానికి ఉచిత సేవల్ని అందించడానికి సిద్దం అవుతున్నాయి.

అందులో భాగంగానే ప్రముఖ టెలికం కంపెనీ అయిన ఎయిర్ టెల్ ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకునే ఫీచర్‌ను కల్పిస్తుంది.  ప్రి పెయిడ్ వినియోగదారులు తొమ్మిది భారతీయ భాషల్లో ఫేస్‌బుక్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చని ఆ కంపెనీ తెలిపింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళ భాషల్లో ఫేస్‌బుక్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఎయిర్ టెల్ ప్రవేశ పెట్టిన ఈ ఆఫర్ పరిమిత కాలమే అని, నెలకు 30 ఎంపీ పరిమితి వరకు వాడు కోవచ్చని తెలిపింది.

ఈ కొత్త ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌టెల్ వినియోగదారులు ఫొటోలను అప్‌లోడింగ్, స్టేటస్‌లను ఆప్‌డేట్ చేసుకునే వీలుంటుందని, మెసేజ్‌లు, కామెంట్లు కూడా పోస్ట్ చేసుకోవచ్చిన తెలిపింది. దీనికి కస్టమర్లు ఎలాంటి డేటా చార్జీలు చెల్లించనవసరం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles