Rbi slashes repo rate

RBI slashes Repo Rate.png

Posted: 01/30/2013 09:50 PM IST
Rbi slashes repo rate

repo-rateకార్పొరేట్ రంగం, స్టాక్ మార్కెట్ల ఉత్కంఠకు ఎట్టకేలకు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తెరదించింది. మంగళవారం చేపట్టిన మూడో త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలకమైన రెపో రేటును పావు శాతం తగ్గించి, 7.75 శాతానికి చేర్చడం ద్వారా 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ నుంచి ఊరట కల్పించింది. అదేవిధంగా నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)లోనూ పావు శాతం కోత విధింపుతో 4 శాతానికి తగ్గించింది. దీంతో బ్యాంకులకు రూ.18,000 కోట్ల అదనపు నిధులు అందుబాటులోకి రానున్నాయి. కాగా, రెపో కోత తక్షణం అమల్లోకి రానున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. సీఆర్‌ఆర్ తగ్గింపు మాత్రం ఫిబ్రవరి 9 నుంచి అమలవుతుందని తెలిపింది. కాగా, రెపో తగ్గింపుతో దీంతో ముడిపడిఉన్న రివర్స్ రెపో, మార్జినల్ స్టాండిగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్), బ్యాంక్ రేట్ల లో కూడా పావు శాతం చొప్పున కోత పడినట్లయింది. తగ్గింపు తర్వాత రివర్స్ రెపో 6.75 శాతానికి, బ్యాంక్ రేటు 8.75 శాతానికి చేరాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lic cuts stake in 27 nifty firms
Andhra bank shares slump  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles