మంత్రివర్గ మార్పులు చేర్పులు చమురుశాఖ మంత్రి జైపాల్‌రెడ్డిని తప్పించి ఆ బాధ్యతను వీరప్పమొయిలీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఆయన రాకతో ఇప్పటి వరకు చమురు రంగంలో నిలబడిపోయిన ఫైళ్లకు మోక్షం లభిస్తుందని చమురు రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. ఇదే గనుల జరిగితే రిలయన్స్ ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది. దీంతో పాటు భారత దేశానికి చెందిన చమురు సహజ వాయువు రంగానికి కూడా మేలు జరగుతుంది. ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీకి చమురు మంత్రిత్వశాఖకు మధ్య పెద్ద ఎత్తున యుద్ధం లాంటిదే జరిగిందనే చెప్పవచ్చు. వీరప్పమొయిలీ రాకతో అవ సద్దుముణగవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.
కేజీ 6 బ్లాకులో రిలయన్స్‌ను చమురు తవ్వకాలకు అనుమతించే అవకాశం ఉంది. రిలయన్స్‌కు చమురు మంత్రిత్వశాఖకు మధ్య ఉన్న కీలక అంశాలపై భేదాభిప్రాయాలు తొలగిపోవచ్చు. ఇరువురి మధ్య ఉన్న ఆడిటింగ్ సమస్య ఒక కొలిక్కి రావచ్చు... కంపెనీలో కేజీ డీ6లో అదనపు గ్యాస్ ఉత్పత్తికి రిల్ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తులో రిలయన్స్ ఇండస్ట్రీ షేరులో కదలికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సోమవారం నాడు స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే రిలయన్స్ షేరు పెరుగుతూ వచ్చింది. సెప్టెంబర్ 17వ తేదీన రిలయన్స్ రూ.881.60 వద్ద ముగిసింది. ఇటీవల కొన్ని రోజుల ముందు కూడా రిల్ 10 శాతం క్షీణించి రూ.760 స్థాయికి పడిపోయింది. వీరప్పమొయిలీ చమురుశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రిలయన్స్‌కు లబ్ధి చేకూరుతుందని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో రిలయన్స్ షేరు రూ.905 స్థాయికి ఎగబాకవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more