దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్వీసులు అందని గ్రామీణ ప్రాంతాలలో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో 1000 ఏటీఎం సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి కపిల్ సిబల్ లోక్‌సభకు తెలిపారు. దేశ వ్యాప్తంగా 1.54 లక్షల పోస్టాఫీస్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఎక్కు వ శాతం గ్రామీణ ప్రాంతాలలో కలవు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సర్వీసులను అందించాలనే ఉద్దేశంతో పోస్టాఫీస్ ఏటీఎం సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పోస్టాఫీస్‌ల కార్యకలాపాలను కంప్యూటరీకరించడం ద్వారా మార్చి 31 నాటికి 24,969 పోస్టాఫీస్‌లను అంతర్జాలంలో అనుసంధానం చేశారు. ఆర్బీఐ సూచలన మేరకు పోస్టాఫీస్‌లలో ఏటీఎం సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు, భవిష్యత్తులో బ్యాంకింగ్ సర్వీసులు అందించడానికి మరో మూడు వేల ఏటీఎంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో పోస్టాఫీస్ ఒక చిన్న సైజు బ్యాంక్‌లాగా మారబోతుందని, అతి తక్కువ ఖర్చుతో వినియోగదారుడికి బ్యాంకింగ్ సేవలు అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు పోస్టాఫీస్‌లలో గ్రామీణ ప్రాంతాలలో లభించే ఉత్పత్తులను కూడా విక్రయిస్తున్నారు. ఇప్పటికే పోస్టాఫీస్‌ల ద్వారా దేశ వ్యాప్తంగా 8 కోట్ల మందికి ఆధార్ కార్డులు అందచేసినట్లు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more