కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్‌కు చెందిన ఇంజినీరింగ్ సిబ్బందితో పాటు, పైలెట్లు, వివిధ శాఖలకుచెందిన ఉద్యోగులు వేతనాలు చెల్లించనందుకు లేబర్‌కోర్డుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఏప్రిల్ నెల ముగిసిపోయినా తమకు వేతనాలు అందలేదని వారు వాపోతున్నారు. గత నాలుగు నెలల నుంచి (జనవరి - ఏప్రిల్) వరకు వేతనాల బకాయిలు పేరుకుపోయాయని. యాజమాన్యం చొరవ తీసుకుని తమకు వేతనాలు ఎప్పుడు చెల్లిస్తామన్న వివరాలు చెప్పకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని... పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని ఎయిర్‌లైన్ సిబ్బంది చెబుతున్నారు. పైలెట్లు లేబర్‌కోర్డు జోక్యం చేసుకోవాలని కోరుతోంది.తమకు రావాల్సిన బకాయిలు త్వరగా చెల్లించాలని వారు లేబర్‌కోర్టును ఆశ్రయించాలనుకుంటున్నారు.
త్వరలోనే కింగ్‌ఫిషర్‌కు చెందిన వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులను కూడగట్టుకుని భవిష్యత్ కార్యాచరణకు చేపట్టాల్సిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. గత నెలలోనే ఒక శాఖకు చెందిన ఉద్యోగులు వారిలో పైలెట్లు, ఇంజినీర్లు ఏప్రిల్ 20వ తేదీలోగా తమ వేతనాలు చెల్లించకపోతే తాము ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. చివరి నిమిషంలో కింగ్‌ఫిషర్ చైర్మన్ విజయ్‌మాల్యా జోక్యం చేసుకుని ఒక వారంలోపే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎయిర్‌లైన్‌కు చెందిన 200 మంది ఇంజినీర్లకు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వేతనాలు చెల్లించలేదని ఉద్యోగులు చెబుతున్నారు. విజయ్‌మాల్యా హామీ ఇచ్చినా డిసెంబర్ నెల జీతాలు చెల్లించలేదని వారు వాపోతున్నారు. ఎయిర్‌లైన్ సుమారు రూ.7,057.08 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. అంతర్జాతీయ సర్వీసులను పూర్తిగా రద్దు చేసింది. దేశీయ విమాన సర్వీసుల్లో చాలా మటుకు కోత విధించింది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more