The life of buddha chronicles on ivory which is sketched by delhi resident

life of buddha, ivory art, buddha ivory art, delhi ivory art, gautam buddha life history, gautam buddha news, elephant ivory, gautam buddha elephant ivory

the life of buddha chronicles on ivory which is sketched by delhi resident

బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతం

Posted: 12/02/2014 01:21 PM IST
The life of buddha chronicles on ivory which is sketched by delhi resident

మానవ నిర్మితమైన అద్భుతమైన కళాఖండాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సృష్టించబడ్డాయి. ప్రస్తుతమన్నీ చాలావరకు సాంకేతిక పరికరాల ద్వారా రూపుదిద్దుకుంటున్నాయి కానీ.. దశాబ్దాలకాలాల క్రితం కొంతమంది కళాకారులు తమ చేతులద్వారా ఎన్నో అద్భుతనిర్మాణాలను సృష్టించారు. అటువంటివాటిల్లో ఈ ‘‘ఏనుగుదంతం’’ కూడా ఒకటి! ప్రస్తుతానికి న్యూఢిల్లీ నేషనల్ మ్యూజియంలోని అలంకరణ కళల గాలరీలో ప్రదర్శించబడుతున్న దీని పేరు ‘‘బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతపు కళాకృతి’’!

buddha-chronicles-1

ఏనుగుదంతపు విశేషాలు :

20వ శతాబ్ది తొలినాళ్లలో ఈ ఏనుగుదంతాన్ని ఢిల్లీ ప్రాంతానికి చెందిన ఓ కళాకారుడు తయారుచేసినట్లు చారిత్రకారులు భావిస్తున్నారు. బుద్ధుని జీవిత గాథలను ఒకే ఏనుగుదంతంపై అంతర్భాగాలతో చెక్కిన అద్వితీయమైన కళాఖండమిది. ఈ ఏనుగుదంతంపై బుద్ధుని జీవితానికి సంబంధించిన 43 ఘట్టాలను చెక్కారు. వాటిలో మొదటి 25 బుద్ధుని జీవితంలో జననం నుంచి జ్ఞానోదయం వరకూ జరిగిన ఘట్టాలు కాగా... మిగిలిన 18 జ్ఞానోదయం నుంచి మహాపరినిర్వాణం వరకూ కలిగినవి.

ఈ దంతపు కళాకృతిలో మరికొన్ని కొత్త ఘట్టాలను కూడా చెక్కబడి వున్నాయి. అందులో భాగంగా.. సిద్ధార్థుడు పక్షి కోసం పోరాడడం, జంతుజాలాన్ని చంపడంపై అతని వ్యతిరేకత, మరణాన్ని గురించి గుర్తించడం వంటివి వాటిలో కొన్ని. అలాగే ఆ దంతంపైకి వెళ్ళేకొద్దీ దాని మందం తగ్గిపోతుంటుంది కాబట్టి.. పైన ఉన్న అరల చుట్టుకొలత తగ్గించి, వృత్తం నుంచి అరలను వేరే ఆకారానికి మార్చి వాటిలో భూమిస్పర్శ ముద్ర, అభయముద్ర, ధర్మచక్రప్రవతన ముద్ర వంటి సుప్రసిద్ధమైన ముద్రలతో ఉన్న బుద్ధుణ్ణి చెక్కారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gautam buddha  elephant ivory  telugu news  

Other Articles