Sri raja rajeswari temple history special story vemulawada

sri raja rajeswari temple, sri raja rajeswari temple news, sri raja rajeswari temple history, sri raja rajeswari temple story, sri raja rajeswari temple wikipedia, sri raja rajeswari temple legend of land, sri raja rajeswari temple land story, sri raja rajeswari temple history in telugu, lord shiva temples, goddess parvathi temples, telugu hindu news, hindu traditions

sri raja rajeswari temple history special story vemulawada

చాళుక్యులు ఎంతో విశేషంగా నిర్మించిన రాజరాజేశ్వరస్వామి క్షేత్రం

Posted: 12/03/2014 03:03 PM IST
Sri raja rajeswari temple history special story vemulawada

ప్రాచీనకాలానికి సంబంధించిన సంస్కృతీ-సంప్రదాయాలు, ఆచారాలు, కళలు ఉట్టిపడేలా ఇప్పటికీ దేశంలో కొన్ని నిర్మాణాలు వున్నాయి. అటువంటి కట్టడాల్లో వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం కూడా ఎంతో విశేషమైనది. పశ్చిమ చాళుక్యులు ఎంతో వైభవంగా నిర్మించిన ఈ క్షేత్రం.. పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది. కరీంనగర్‌కు 36 కి.మీ. దూరంలో వుండే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వేలాది భక్తులు దేశనలుమూలల నుంచి తరలివస్తుంటారు. ఈ దేవాలయంలో శివుడు పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై లింగరూపంలో వెలిశాడు.

స్థలపురాణం :

భాస్కర, హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ ఆలయం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోవడం కోసం దేశాటన చేశాడు. ఆ సందర్భంగా ఆయన వేములవాడ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికింది. ఆ లింగాన్ని కొలను సమీపంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించగా.. శివుడు ప్రత్యక్షమై అతడిని బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడని పురాణగాథ. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టం.

ఇతర విశేషాలు :

1. ఆలయంలో కొలువైవున్న శ్రీ రాజరాజేశ్వరస్వామి మూలవిరాట్టుకు కుడివైపు శ్రీ రాజరాజేశ్వరీదేవి, ఎడమవైపు శ్రీ లక్ష్మీ సహితసిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి.

2. పురాతత్వ ఆధారాల ప్రకారం.. ఈ దేవాలయాన్ని పశ్చిమ చాళుక్యులు నిర్మించారని తెలుస్తోంది. ఆనాడు ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు ‘రాజాదిత్య’ అనే బిరుదు ఉండేది. అతని పరిపాలనకాలంలోనే నిర్మితమైన ఈ ఆలయానికి అతని బిరుదు పేరిట ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు.

3. ఇక ఆలయ విషయానికొస్తే.. శివరాత్రి రోజున వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అప్పుడు దేవాలయాన్ని మూడు లక్షలకుపైగా భక్తులు సేవించుకుంటారు. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రివేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.

4. దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ళ నాటి మసీదు ఉన్నది. ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు.. ఈ గుళ్ళో ఉంటూ, స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యర్ధం ఈ మసీదు నిర్మించారట.

5. దేవాలయంపై ఉన్న కొన్ని శిల్పాలు జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. అందుకే.. శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు తదితరులవారు కూడా ఈ ఆలయాన్ని సంద్శించుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles