kasaragod multi-linguistic cultured district of 7 languages సప్త బాషా సంగమస్వరాలు పలికే కాసరగొడ్‌ జిల్లా

Kerala s kasaragod northernmost district with various cultures and seven languages

malabar mail, kasaragod, Kerala, multi-linguistic culture, 7 languages, linguistic diversity, diversity in culture, Rituals and folk arts. Kannada, Tulu, Konkani, Marati, Urdu, Beary, Malayalam, Theyyam, Yakshagana, Poorakkali, Kolkali, Mappilappattu, Kerala, Tourinsm, Facts

Border District Kasaragod of Kerala is home to forts, rivers, beaches, various cultures and ‘seven languages. In this northernmost district of the State you can come across speakers of Kannada, Tulu, Konkani, Marati, Urdu and Beary, besides Malayalam. The linguistic diversity in the district reflects the diversity in culture and history. Rituals and folk arts Theyyam, Yakshagana, Poorakkali, Kolkali and Mappilappattu showcase the rich and varied cultural heritage.

సప్త బాషా సంగమస్వరాలు పలికే ప్రకృతి సొంత రాష్ట్ర జిల్లా

Posted: 01/21/2020 08:31 PM IST
Kerala s kasaragod northernmost district with various cultures and seven languages

సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు అరుదు. ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగిన జిల్లాల్లో ఇలాంటి వారు మనకు తారసపడతారు. కానీ ఏకంగా ఐదు బాషలు వచ్చిన వారు వుంటారా.? మాట్లాడే వారిన చూశారా అంటే చాలా అరుదనే చెప్పవచ్చు. కనీసం ఒక్క జిల్లాలో మొత్తంగా ఐదు బాషలు మాట్లేడే వారుంటారా.? అంటే అది కూడా అరుదే. కానీ ప్రకృతి సొంత రాష్ట్రంగా బాసిల్లుతున్న కేరళలో.. ఉత్తర కేరళ ప్రాంతంలోని కాసరగొడ్‌లో మాత్రం ఏకంగా ఏడు భాషల్లో పరిచయం ఉండటం గమనార్హం.

కర్ణాటక మంగళూరుకు దిగువన కేరళలో ఉత్తరభాగంలో కాసర్‌గొడ్‌ ఉంటుంది. మళయాళం, కన్నడం, తులు, మరాఠీ, కొంకణి,ఉర్దూ, బ్యారీ.. తదితర భాషలను మాట్లాడుతారు. పాలనాపరంగా మలయాళంను ఉపయోగించినా కర్ణాటకను ఆనుకొని ఉండటంతో కన్నడం ప్రభావం అధికంగా ఉంటుంది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడుపిలతో పాటు కాసర్‌గొడ్‌లను తులునాడుగా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతంలోని తీరభూముల్లో తులు భాష మాట్లాడతారు.  దాదాపు 30 లక్షల మంది ఈ భాషను మాట్లాడుతారని అంచనా. బ్యారీ ముస్లింలు బ్యారీ భాషను వినియోగిస్తారు.

భిన్న సంస్కృతులు

కేరళలో ఈ ప్రాంతం విభిన్నమైన సంస్కృతిని కలిగివుంటుంది. కేరళ ఉత్తర భాగంలో తెయ్యం సంగీతరూపకం కాగా ఇక్కడ యక్షగానం ఎక్కువగా ప్రదర్శితమవుతుంటుంది.  రాష్ట్రాల పునర్‌విభజన తరువాత ఇక్కడి పలు ప్రాంతాలను కర్ణాటకకు ఇవ్వాలని మహాజన్‌ కమిటీ సూచించింది.  1984లో మలబార్‌ జిల్లాలోని కాసర్‌గొడ్‌ తాలుకాను జిల్లాగా ఏర్పాటుచేశారు. ఈ ఏడు భాషల్లోనూ సాహిత్య సమావేశాలు జరుగుతుండటం విశేషం. జిల్లామీదుగా పశ్చిమ కనుమలు వెళుతాయి. రాణిపురం సమీపంలోని పర్వతాలు ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటాయి.  తీరంలోని బెకల్‌ కోట చారిత్రక కట్టడం. ప్రసిద్దమైన అనంతపుర సరస్సు ఆలయం ఇక్కడే ఉంది. ఈ సరస్సులో ఒక మొసలి శ్రీ అనంతపద్మనాభునికి సేవచేయడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles