history and prominence of guntur satrasala mallaiah temple కాకులు వాలని పుణ్యక్షేత్రం.. ఓంకారం ప్రతిధ్వనించే ధామం.. సత్రశాల

History and prominence of guntur satrasala mallaiah temple

guntur satrasala mallaiah temple, satrasala mallaiah temple, mallaiah temple, River Krishna, crows, bramharshi vishwamitra, shiva lingam, historical place, omkaram, guntur, shiva ratri, karthika masam

Andhra Pradesh before formation of Telangana state was also known as Trilinga kshtera (Land of three great shivalingas - Srisailam, Draksharamam and Kaleshwaram). It is rich with the temples of Lord shiva across the state. Here it the history and prominence of guntur satrasala mallaiah temple, where one can notice crows never comming to this place.

కాకులు వాలని పురాతనక్షేత్రం.. ఓంకారం ప్రతిధ్వనించే పుణ్యధామం.. సత్రశాల

Posted: 03/04/2019 06:36 PM IST
History and prominence of guntur satrasala mallaiah temple

చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో కాదు సత్రశాల మల్లిఖార్జన స్వామి దేవాలయం. ఈ అత్యంత ప్రవిత్రమైన ప్రాంతంలో యోగరుషి బ్రహర్షి విశ్వామిత్రులు యాగం చేశారు. అయితే ఆయన యాగం చేసే క్రమంలో కాకులు ఈ ప్రాంతంలో వాలి శబ్దం చేసాయట. దీంతో తన యాగానికి భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో విశ్వామిత్రులు ఆగ్రహించి.. ఈ ప్రాంతంలో కాకులు వాలితే వెంటనే చనిపోవుగాక అంటూ బ్రహర్షి శపించారట. ఇది పురాణకథలో పేర్కోనబడివుంది.

దీంతో ఈ సత్రశాల దేవాలయంలో కాకులు వాలవని భక్తులు నమ్మకం. భక్తులు ఆరాధించే మల్లికార్జునుడు స్వయం భూలింగం. ఇక ఈ దేవాలయంలో నిత్యం ఓంకార ధ్వని ప్రతిధ్వనిస్తుంది. శ్రీరాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షి, అన్నమాచార్యులు పూజించి తరించిన క్షేత్రం. విశ్వామిత్రుడు బ్రహర్షి కావాలనే కాంక్షతో ఈ ప్రాంగణంలో సత్రయాగం చేయడం వల్ల ఈ ప్రదేశానికి సత్రశాలగా పేరు పెట్టినట్లు పూర్వీకులు చెపుతారు. ఆలయ ప్రాంగణంలో శివ, శైవ క్షేత్ర భేదాలు లేకుండా వెలిశాయి.

భ్రమరాంబ, మల్లయ్య, కుమార, వెంకటేశ్వరస్వామి, కాశీ అన్నపూర్ణ, విశ్వేశ్వరుడు, కాలభైరవుడు, చీకటి మల్లయ్య, ఆంజనేయుడు, అమరలింగేశ్వరుడు, సంతాన మల్లయ్య, చెన్నకేశవుడు, ఉత్తరేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించి ఉన్నాయి. అయితే ఎక్కడా లేని విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడికి కూడా ఆలయం నిర్మించి వుండటం విశేషం. అతిపెద్ద ఏకాశిల నందీశ్వరుని విగ్రహం సత్రశాలలో నెలకొల్పారు. శివరాత్రి పర్వదినంతో పాటు కార్వీకమాసంలో భక్తులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తారు. సత్రశాలకు వచ్చే యాత్రికులకు సకల సౌకర్యాలను ఆలయ కమిటీ కల్పించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles