Liposuction treatment

Liposuction treatment.gif

Posted: 06/21/2012 03:23 PM IST
Liposuction treatment

Liposuction_treatment

Liposuction-treatmentఈకాలంలో అందరూ కుతూహలపడి, అందరూ సందేహాలు పెంచుకున్న వైద్యప్రక్రియ లైపోసక్షన్. పొట్ట తగ్గాలని, పిరుదులు తగ్గాలని, నడుము సన్నబడాలని ఎవరికి ఉండదు. వ్యాయామానికి తీరికలేని ఈరోజుల్లో ‘లైపోసక్షన్’ ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఫలితాన్ని ఇస్తున్న ఈ పక్రియ గురించి తెలుసుకుందాం.

లైపోసక్షన్‌ను లైపోప్లాస్టీ (ఫ్యాట్ మోడలింగ్) అని కూడా అంటారు. కొందరు సంక్షిప్తంగా ‘లైపో’ అంటుంటారు. ఇది మనల్ని అందంగా, ఆకర్షణీయంగా మలచుకునేందుకు చేసే ఒక తరహా ఆపరేషన్.

ఎవరి నుంచి కొవ్వు తొలగించవచ్చు...?

పద్ధెనిమిదేళ్లు దాటి సాధారణ ఆరోగ్యం బాగున్నవారు మిగతా శరీర భాగాలతో పోలిస్తే కొన్ని అవయవాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకొని, ఎంత వ్యాయామం చేసినా ఆ భాగాల నుంచి కొవ్వు కరిగే పరిస్థితి లేనివారు. ఇలా ఆహార నియమాలు పాటించడం ద్వారానే కొవ్వు కరిగే పరిస్థితి లేకపోతే... ఆ కొవ్వును ‘డైట్ రెసిస్టెంట్ ఫ్యాట్’ అంటారు కొవ్వు మాత్రం ఎక్కువగా ఉండి, అక్కడ చర్మం దళసరిగా కాకుండా మామూలుగానే ఉండాలి. (ఎందుకంటే లైపోసక్షన్‌లో కొవ్వును మాత్రమే తొలగించడం సాధ్యమవుతుంది. చర్మాన్ని తొలగించరు). హైబీపీ, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత వంటివి ఉన్నవారైతే... తమ వ్యాధిని నియంత్రణలో ఉంచుకున్న తర్వాతే లైపోకు వెళ్లాల్సి ఉంటుంది వృద్ధుల్లో చర్మం తన బిగుతుగా ఉండే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోతుంది. పెద్దవయసు వారిలో చర్మం పటుత్వం తక్కువ కాబట్టి లైపో తర్వాత ఆ భాగంలో చర్మం వేలాడుతున్నట్లుగా కనిపించవచ్చు.

అందుబాటులోకి వచ్చిందిలా...

Liposuction-treatment1ఇన్‌పేషెంట్‌గా ఉన్న రోగులకు రక్తంగాని, సెలైన్‌గాని ఎక్కించడానికి వీలుగా మణికట్టు దగ్గర ఒక సూది అమర్చి ఉంచుతారు. దాన్ని ‘కాన్యులా’ అంటారు. ఇలాంటి ఒక కాన్యులా అమర్చి కొవ్వును బయటకు పీల్చే ప్రక్రియను డాక్టర్ వ్యస్ గెరార్డ్ ఇల్లావుజ్ అనే ఫ్రెంచ్ సర్జన్ మొదటిసారిగా 1982లో ప్రయత్నించాడు. తన ప్రయత్నం చాలామేరకు సఫలమైందని గుర్తించాడు. 1990లో అల్ట్రాసోనిక్ తరంగాల సహాయంతో కొవ్వును ద్రవరూపంలోకి మార్చి బయటకు పీల్చేసే ప్రక్రియ సత్ఫలితాలను ఇచ్చింది. ఆ తర్వాత్తర్వాత గతంలో ఉన్న సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఒక లేజర్ మొన ఉండే దాన్ని శరీరంలోకి పంపించగల పరికరం (ప్రోబ్) సహాయంతో లోపల ఉన్న కొవ్వును తొలగించే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఈ ముఫ్ఫై ఏళ్లలో తక్కువ రక్తస్రావం, తక్కువ ఇబ్బందులు, తక్కువ దుష్ర్పభావాలు, తక్కువ రిస్క్ ఉండే అధునాతన ప్రక్రియలు అందబాటులోకి వచ్చాయి. అంతేకాదు... మన శరీరంలోనే ఒక చోటినుంచి తొలగించిన కొవ్వును... అవసరమైన మరోచోటికి పంపే ప్రక్రియలూ అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియనే ‘ఆటోలాగస్ ఫ్యాట్ ట్రాన్స్‌ఫర్’ గా అభివర్ణించవచ్చు.

ఆపరేషన్‌కు ముందే కొన్ని జాగ్రత్తలు...

కొవ్వు తొలగింపు ఆపరేషన్ చేయించాలనుకున్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఉదాహరణకు లైపో ప్రక్రియకు కనీసం రెండు వారాల ముందు నుంచి పొగతాగకుండా ఉండటం చాలా మంచిది. పొగలోని నికోటిన్ రక్తప్రసరణ సంబంధమైన ప్రతిబంధకాలను ఏర్పరచవచ్చు. పొగతాగడం మానేయడం ద్వారా ఆ ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. మిగతా సర్జరీల్లోలాగే లైపో లోనూ శరీరంలో మరే ఇతర భాగాల్లో ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం రెండు వారాల ముందు నుంచి రక్తాన్ని పలచబార్చే మందులేవీ వాడకుండా ఉండటం అవసరం.

లైపోసక్షన్ అవసరమైన ప్రదేశాలు

సాధారణంగామన శరీరంలో లైపోసక్షన్ ప్రక్రియతో కొవ్వు తొలగించాల్సిన ప్రదేశాలివి... పొట్ట, పిరుదుల పైభాగం, తొడల ముందు భాగం, నడుము, వీపు, మోకాళ్ల కింది భాగం, భుజాలు, గదమ కింద, పురుషుల రొమ్ముల్లో కొవ్వు పేరుకుని ఎత్తుగా కనిపించే చోట (గైనకోమాజియా).

ఎంత కొవ్వు తొలగిస్తారు...

ఒకరి శరీరం నుంచి ఒక సిట్టింగ్‌లో సురక్షితంగా ఎంత కొవ్వు తొలగించాలన్న విషయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని వైద్య నిపుణులు, రోగి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒకేసారి మరీ ఎక్కువ కొవ్వు తొలగించినా అది కొన్ని సార్లు ప్రతికూలంగా పరిణమించవచ్చు. ఎందుకంటే కొవ్వు మరీ ఎక్కువగా తొలగించిన చోట గుంతలా సొట్ట కనిపించవచ్చు.

దుష్ర్పభావాలు (సైడ్ ఎఫెక్ట్స్)...

Liposuction-treatment2ఇవి వైద్యపరంగా పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సినవి కాకపోయినా రోగికి మాత్రం అసౌకర్యం కల్పించవచ్చు. అవి... గాటు గాయంగా మారి కొద్దికాలం నొప్పితో బాధించవచ్చు. ఒకటి రెండు నెలల పాటు కొవ్వు తీసిన చోట వాపు ఉండవచ్చు. రోగికి నిర్వహించే ప్రక్రియను బట్టి మచ్చ ఏర్పడుతుంది. ఇది సాధారణంగా కొన్ని వారాల్లో తగ్గిపోవచ్చు. లైపో వల్ల వచ్చే నొప్పి తాత్కాలికమే. నొప్పి నివారణ మందులతో దీన్ని నివారించవచ్చు. కనీసం మూడు రోజుల పాటు ఎటూ కదలలేని పరిస్థితి వల్ల అసౌకర్యంగా ఉండవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Information about houston
Malawada duryodhana temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles