Most beautiful city in the world shanghai

China Shanghai travel information on Shanghai tours, maps, tourist attractions, holiday hotels, weather, pictures, dining, shopping, nightlife as well as travel tips

China Shanghai travel information on Shanghai tours, maps, tourist attractions, holiday hotels, weather, pictures, dining, shopping, nightlife as well as travel tips

Most Beautiful City in the World.GIF

Posted: 02/29/2012 04:48 PM IST
Most beautiful city in the world shanghai

Most_Beautiful_City_in_the_World

Most_Beautiful_Cityపురాతన సంప్రదాయ చైనాకు... అభివృద్ధి చెందిన పారిశ్రామిక చైనాకు సంధానకర్త... చైనాకు ‘పట్టు’నిచ్చిన ఈ నగరం... తూర్పు- పశ్చిమాల మధ్య వాణిజ్య వారధి...  ఎత్తై ఆధునిక కట్టడాల జాబితాలో తరచు కనిపించే నగరం... షాంఘై నగర విశేషాలు...

షాంఘై అంటే సముద్ర ఉపరితలం అని అర్థం. 11వ శతాబ్దంలో సంగ్ వంశ పాలకుల కాలంలో ఈ పదం వచ్చింది. పురాతనకాలంలో షాంఘై పేరు ‘షెన్’. షెన్‌చెంగ్(షెన్‌సిటీ) అనీ పిలిచేవారు. ఇప్పటికీ నగరంలో స్పోర్ట్స్ టీమ్‌లు, న్యూస్‌పేపర్లు షెన్‌చెంగ్ పేరునే ఉదహరిస్తున్నాయి. క్రీ.శ ఎనిమిదవ శతాబ్దంలో టాంగ్ వంశం హుయేటింగ్ రాజ్యాన్ని స్థాపించినప్పుడు దీనిని హుయేటింగ్ అని పిలిచారు క్రీ.శ 960- 1279 మధ్య ఈ ప్రదేశం అంచెలంచెలుగా ఎదిగింది.

పర్యాటక ఆకర్షణలు :

హువాంగ్‌పు నది నగరానికి మధ్యగా ప్రవహిస్తోంది. దీంతో నగరం తూర్పు, పశ్చిమ భాగాలుగా విభజితమవుతోంది. ఇందులో బోట్‌షికార్ చేస్తే దాదాపుగా షాంఘై మొత్తం చూసినట్లే. యుయువాన్ గార్డెన్... నగరంలో ప్రాచీనమైన, పెద్ద ఉద్యానవనం ఇది. మింగ్, గ్జింగ్ వంశాల నిర్మాణశైలికి, అభిరుచికి ప్రతిబింబం.

జేడ్ బుద్ధ టెంపుల్... ప్రసిద్ధ బౌద్ధ ఆలయం. ఇందులోని శ్వేతవర్ణపు బుద్ధుడి విగ్రహాన్ని 19వ శతాబ్దంలో బర్మా నుంచి తెప్పించారు. ఇందులోని బుద్ధునితోపాటు జాతకకథల్లోని అంశాల ఆధారంగా అనేక శిల్పాలు కన్నులవిందు చేస్తాయి. ప్రాచీన చైనా కళలకు నిలయం మ్యూజియాలు. వీటిలో కంచు, పింగాణి కళాకృతులు, ప్రపంచప్రసిద్ధ చిత్రలేఖనాలు, ప్రఖ్యాత గ్రంథాల చేతిరాత ప్రతులు ఉంటాయి. హాన్ వంశస్తులు వాడిన కంచు అద్దం ఇందులో ప్రధాన ఆకర్షణ. ఐదువేల ఏళ్లనాటి నాగరకతకు దర్పణాలైన కళాఖండాలు ఉన్నాయి. షాంఘై ఈజ్ ద గ్రేట్ ఆర్కిటెక్చరస్ సిటీ. మనకు కమర్షియల్ క్యాపిటల్ ముంబయి లాగా చైనాకు ఆర్థిక కార్యకలాపాల కేంద్రం. నగరంలో విశాలమైన రోడ్లు, ఎత్తై భవనాలు అత్యాధునికంగా ఉంటాయి. చైనా సంప్రదాయపు కట్టడాలు, ఆధునిక భవనాల కలబోత షాంఘై. ఇక్కడ ప్రధాన రహదారుల్లో మోడరన్ కన్‌స్ట్రక్షన్స్, చిన్న రోడ్లలో పాత కట్టడాలు ఉంటాయి. పాత నిర్మాణాలు అంటే చైనా సంప్రదాయ వాస్తుశైలి కాదు, యూరోపియన్‌శైలి.

నగరంలో నాసిరకపు నిర్మాణం ఒక్కటీ కనిపించదు. ప్రతి పనినీ కన్‌స్ట్రక్టివ్‌గా నిర్వహిస్తారనే చెప్పాలి. ఉదాహరణకు హైవేల నిర్మాణమే. నగరంలో హైవేలను దీర్ఘకాల ప్రయోజనాలను ఆశించి నిర్మించారు. ఆరు లైన్ల హైవే అయితే ఏకంగా 63 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవే మీదకు ఎక్కడానికి, దిగడానికి ప్రతి జంక్షన్‌లోనూ కనెక్టింగ్ పాథ్‌లు ఉంటాయి. ఇంత పెద్ద నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేశారు. అలాగని నాణ్యత పరంగా ఎక్కడా రాజీపడినట్లు కనిపించదు. ఇంజనీర్లు సూచించిన ప్రమాణాలను యథాతథంగా పాటిస్తారు. అందుకే వాటి జీవితకాలం ఎక్కువ, తరచూ మరమ్మతులు రావు. నగర కూడళ్లలో ఐదారు బ్రిడ్జిలు క్రిస్‌క్రాస్‌గా ఉంటాయి. ఒకదానిని ఒకటి తాకవు, ఒకదాని పైన మరొకటి ఉంటాయి. ఇక్కడ బ్రిడ్జిల నిర్మాణానికి అడ్డుగా వచ్చిన చెట్లు, కొండల వంటి వేటినీ కూల్చలేదు. వాటిని అలాగే ఉంచి బ్రిడ్జి ఎత్తును పెంచారు, ఇలా కొన్ని చోట్ల 100 అడుగుల ఎత్తు కూడా ఉంటుంది. షాంఘై నగరం అందాన్ని చూడాలంటే ఈ బ్రిడ్జిల మీద ప్రయాణించాల్సిందే. షాంఘైలో భవనాల పై అంతస్తులను లైట్లతో అలంకరిస్తారు. బ్రిడ్జిల మీద ప్రయాణించేటప్పుడు ఇవి దగ్గరగా కనిపిస్తూ చాలా అందంగా ఉంటాయి. ఆధునికత పరంగా షాంఘై, బీజింగ్ వంటి చైనా నగరాలన్నీ అమెరికన్ సిటీస్‌కు ఈక్వల్‌గా ఉంటాయి.నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి విస్తృతమైన రోడ్ల నిర్మాణం ఉన్నప్పటికీ పీక్ అవర్స్‌లో జామ్‌లు తప్పవు. షాంఘైలో ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ బాగుంటుంది. బస్ సర్వీసుల నిర్వహణ నుంచి మెట్రోరైళ్ల వరకు సక్రమంగా నడుస్తుంటాయి. ట్యాక్సీలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

మనకు ఆసక్తిగా అనిపించేది ఏమిటంటే ఇక్కడ ట్యాక్సీలన్నీ బెంజ్‌కార్లే. పాదచారులను క్షేమంగా రోడ్డు దాటించడానికి ట్రాఫిక్ అసిస్టెంట్లు ఉంటారు. ఇక్కడ చాలా మందికి సైక్లింగ్ హాబీ. రోడ్డు మీద సైక్లిస్టులకు సెపరేట్ లైన్లు ఉంటాయి. ఎవివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేల మీద సైకిల్, మోటర్‌బైక్ వంటి ఏ టూవీలర్‌నూ అనుమతించరు.

పని చేసే మేయర్!

నగరానికి పాలనాధిపతి మేయర్. ఇక్కడ మేయర్ అయ్యే వ్యక్తికి పాలనానుభవం ముఖ్యం. ముందు చిన్న పట్టణానికి నామినేట్ చేసి, సమర్థత, నైపుణ్యం ఆధారంగా... చిన్న నగరానికి మేయర్‌గా నామినేట్ చేస్తారు. ఇలా అనుభవం, సమర్థత ఆధారంగా పెద్ద నగరబాధ్యతను అప్పగిస్తారు.మేయర్ కేవలం శాసనాధికారిగానే కాక కార్యనిర్వహణాధికారిగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ పార్టీ సెక్రటరీ పాత్ర కూడా కీలకం. మేయర్, నగరానికి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీల సమన్వయంతో నిర్ణయాలు, పనులు జరుగుతాయి. విదేశీ పారిశ్రామిక వేత్తలకు సాదర స్వాగతం లభిస్తుంది. ‘మీకు పరిశ్రమకు అవసరమైన అనుమతులు, ఇతర సౌకర్యాలను నెల రోజుల్లో ఇప్పిస్తానని, సంశయించకుండా పరిశ్రమ పెట్టమని’ ఇండస్ట్రియలిస్టులకు భరోసా ఇస్తారు మేయర్.

అన్ని అనుమతులకూ... ‘సింగిల్ విండో’

ఇక్కడ పరిశ్రమల అనుమతికి సింగిల్‌విండో విధానం ఉంది. మన దగ్గర ఉన్న సింగిల్ విండో పేరుకే ఏకగవాక్షం, సవాలక్ష లొసుగులతో వంద కన్నాలు ఉంటాయి. పైగా వ్యవసాయ రుణాలకే పరిమితమై పని చేస్తోంది. ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ, డ్యామ్, ఇండస్ట్రీలు... అదీ వంద కోట్ల ప్రాజెక్టులకు కూడా సింగిల్ విండో ద్వారానే అనుమతులు లభిస్తాయి. ఇక్కడ ఈ సిస్టమ్ అన్ని డిపార్టుమెంట్‌లనూ ఒకే వేదిక మీదకు తెచ్చి, విస్తృతమైన సేవలను అందిస్తోంది. దాంతో ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఇండియాలో వంద కోట్లరూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన పరిశ్రమకు ఇక్కడ 50 కోట్ల రూపాయలు సరిపోతాయి.అలాగే ఇక్కడ జస్టేషనల్ పీరియడ్ తక్కువ. అంటే పెట్టుబడిపెట్టిన తర్వాత ఉత్పత్తి కోసం ఎక్కువ కాలం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. మన దగ్గరతో పోలిస్తే సగం సమయంలోనే ఉత్పత్తి వస్తుంది. దాంతో ఆదాయం 400 టైమ్స్ ఎక్కువ. చైనా ప్రోడక్ట్స్ తక్కువ ధరకు లభించడానికి, పారిశ్రామికరంగంలో ఆ దేశం అంతటి అభివృద్ధి చెందడానికి కారణం అదే.

షాంఘై జీవనం!Most_Beautiful_City1

నగరంలో బౌద్ధులు ఎక్కువ. బ్రిటిష్ జీవనశైలి కూడా కనిపిస్తుంది. చైనా వాసుల్లో ముఖ్యంగా గ్రామాల్లో మనకు ఉన్నట్లే మూఢనమ్మకాలు బాగా ఎక్కువ. మనం ఇంటి ముందు గుమ్మడికాయలు, నిమ్మకాయలు వేలాడదీసినట్లు చైనా గ్రామాల్లో కూడా ఏవో కట్టి ఉంటారు.అయితే... నగరవాసుల్లో ఈ ఛాయలు కనిపించవు. ఇక్కడ ఎవరికీ సొంత ఆస్తులు ఉండవు, అన్నీ ప్రభుత్వానివే. ఇక్కడ ఉద్యోగావకాశాలకు కొదవ లేదు కానీ ఉద్యోగ భద్రత ఉండదు. ఎవరినైనా, ఏ నిమిషంలోనైనా ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. అలాగని ఉద్యోగుల్లో నిరాశనిస్పృహలు కనిపించవు, అందరూ బాధ్యతగా పని చేస్తారు. అకౌంటబిలిటీ కనిపిస్తుంది. పీపుల్స్ స్వ్కేర్‌లో జరిగే పెరేడ్‌లకు ఏదో మొక్కుబడిగా కాకుండా పౌరులుగా బాధ్యత అన్నట్లు హాజరవుతారు.

కమ్యూనిస్టు దేశం కాబట్టి విలాసాలు ఉండవు అనుకుంటాం కానీ, షాంఘైలో పబ్ కల్చర్ బాగా ఎక్కువ. ప్రధాన వినోద సాధనం అదే అనిపిస్తుంది. నైట్‌లైఫ్ ముంబయిలో ఉన్నట్లే ఉంటుంది. షాంఘైలో మన ఆహారం దొరకడం కష్టమే. చైనా ఫుడ్ పేరుతో మన దగ్గర దొరికే పదార్థాలేవీ ఇక్కడ కనిపించవు. ఇక్కడి వాళ్లు అన్నాన్ని కూడా స్టిక్స్‌ తోనే తింటారు. మనం చేత్తో తిన్నా ప్లేట్‌లో కొన్ని మెతుకులు మిగులుతాయేమో కానీ, వీళ్లు స్టిక్స్‌తో ఒక్కమెతుకు కూడా లేకుండా నీట్‌గా తింటారు. స్టిక్‌ను వాడడం చాలా ఆర్టిస్టిక్‌గా ఉంటుంది. వాళ్లు తింటుంటే ఇంకా చూడాలనిపిస్తుంటుంది.

వరల్డ్ ఫేమస్ సెజ్!

నగరంలో సెజ్‌లు ఎక్కువ. పుడాంగ్ సెజ్ ప్రపంచ ప్రసిద్ధమైనది. ఇక్కడ సెజ్‌ల ద్వారా వచ్చే ఎకానమీని రూరల్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగిస్తారు. దేశంలో రియల్ సోషలిజం తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. నిత్యావసర వస్తువుల కోసం మెట్రో, హైపర్‌మార్కెట్, ఆర్‌టి మార్ట్, లోటస్, హులియన్ వంటి బహుళజాతి కంపెనీల అవుట్‌లెట్‌లు విస్తారంగా ఉన్నాయి. షాంఘై పెద్ద ఫ్యాషన్ సెంటర్. ‘షాపింగ్ ప్యారడైజ్, పారిస్ ఆఫ్ ద ఈస్ట్’ అని వాడుక. నగరంలో షాపింగ్ సెంటర్లను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. నాన్‌జింగ్ రోడ్ ఆరు కిలోమీటర్ల దూరం విస్తరించిన షాపింగ్ సెంటర్. ఇందులో 600లకు పైగా దుకాణాలు ఉంటాయి. శతాబ్దాల క్రితం నుంచి ఇది పాపులర్ షాపింగ్‌జోన్. ఒకప్పుడు ఇది మాత్రమే ప్రత్యేకమైనది, ఇప్పుడు దీనితో పోటీపడుతున్న వ్యాపార కేంద్రాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు హువాయ్‌హై రోజ్ వంటివి అన్నమాట. మిడిల్ టిబెట్‌రోడ్ ఒకటి. షాంఘై ఈస్ట్ చైనా సీ తీరాన ఉంది. సముద్రతీరం తోపాటు నదీప్రవాహాల మధ్య ఉండడంతో వాటర్ ప్రాబ్లమ్ లేదు. నగరంలో గ్రీనరీ కూడా ఎక్కువే. ఇక్కడ ప్రధాన నది యాంగ్‌ట్జ్. దీని పాయ హువాంగ్‌పు నది నగరం మధ్య ప్రవహిస్తోంది. నగరంలోని నదులు తూర్పుగా ప్రవహించి ఈస్ట్ చైనాసీలో కలుస్తాయి. ప్రపంచంలో జల రవాణాలో రద్దీగా ఉండే పోర్టు ఇది.

Most_Beautiful_City2షాంఘై ఆర్కిటెక్చురల్, ఇండస్ట్రియల్ సిటీనే కాదు చారిత్రక ప్రాధాన్యం ఉన్న నగరం కూడ. షాంఘై తీరంలో ఒకప్పుడు చేపల వేట, దుస్తుల తయారీయే ప్రధాన వృత్తులు. మనం చీనాంబరాలుగా పిలిచే సున్నితమైన పట్టు వస్త్రాల కేంద్రం ఈ నగరం. చైనా విదేశీవాణిజ్యానికి ద్వారాలు తెరవడంతో షాంఘై తీరం రూపురేకలు మారిపోయాయి. 1842లో నాన్‌కింగ్ ఒప్పందం ద్వారా చైనా షాంఘైలో విదేశీ సెటిల్‌మెంట్లను అనుమతించింది. ఇతర దేశాలతో రాకపోకలు ఎక్కువయ్యాయి. బ్రిటిష్, ఫ్రెంచ్, అమెరికా, జర్మన్, రష్యాదేశీయులు సులభంగా రాగలిగారు. నగరంలో యూరోపియన్ శైలికి ఈ వలసలే కారణం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dr birendra dutt
Bhavani islandvijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles