Bhavani islandvijayawada

Bhavani Island Resort, Vijayawada, Andhra Pradesh, India, hotels, hotel, photos, resorts, resort, reservation, hotel reviews, maps, hotel deals,Bhavani Island, Vijayawada, Vijayawada tourist places, Vijayawada places to see, Vijayawada places to visit, Island places in India, Vijayawada india, Andhra Pradesh

Bhavani Island - Vijayawada Island places.A beautiful estuary Island in the Krishna river, one of the largest islands on the river, Bhavani Island extends more than 130.

Bhavani Island_Vijayawada.GIF

Posted: 02/23/2012 12:56 PM IST
Bhavani islandvijayawada

Bhavani_Island_Vijayawada

కృష్ణమ్మ ఒరవడిలో ప్రకృతి పుట్టినిల్లు... భవానీద్వీపం

Bhavani-Island_Vijayawadaకాలం నిరంకుశం - నిరాటంకం. దానిని ఆపగల శక్తి మానవ మాత్రులకు అసాధ్యం. పాతొక రోత - కొత్త ఒక వింత. నేటి పాత రేపటికి కొత్త. మావనజాతి సుదీర్ఘ పయనంలో నాగరిక - అనాగరిక జీవిత పయనంలో మార్పు సహజం - సమంజసం ప్రపంచమంతటా కొనసాగుతున్న ఈ ‘మార్పు’ ప్రకృతి ఒడిలో పురుడుపోసుకున్న అందాల భవానీద్వీపంలోనూ ప్రత్యక్షమవుతోంది. 1989లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు హయాంలో... కృష్ణా జిల్లా విజయవాడ నగర ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న దుర్గమ్మ పాదాల చెంత... గలగలా పారుతున్న పరమపవిత్ర కృష్ణానది మధ్య భాగాన ప్రశాంత వాతావరణంలో పక్షులు కిలకిలారావాలతో అలారారుతున్న ఈ ప్రకృతి నందనవనం నూతన మార్పులతో సామాన్య ప్రజల కలల సౌధంగా రూపుదిద్దుకుంది.

తింటే గారెలే తినాలి... వింటే భారతమే వినాలన్నది పాత సామెత. కొంటే భవానీ ద్వీపాన్నే కొనాలి... అనేది నేటి సామెత. కృష్ణా జిల్లాలో విజయవాడ నగరం ఎంతో చారిత్రాత్మకంగా ప్రసిద్దిపొందింది. పక్కనే కృష్ణమ్మ గల గలలు మధ్యన సుమారు 130 ఎకరాల విస్తీర్ణంలో భవానీద్వీపంగా నామకరణ కావింపబడిన ఈ ద్వీపంలో నాలుగు జిల్లాలకు చెందిన ధనిక, పేద, సామాన్య మానవుల ఆహ్లాదకర వాతావరణం నడుమ సేద తీరుతుంటారు. పున్నమి హోటల్‌ నుంచి కేవలం 40 రూపాయలతో బోటుపై రాకపోకల సౌకర్యం కల్పించింది పర్యాటకాభివృద్ధి శాఖ.దీంతో ఏడాది పొడవునా ఆఫీసు పనులతో సతమతమయ్యే ఉద్యోగులు, అధికారులు, ఇంటి పనులతో నిత్యం సతమతమయ్యే గృహిణులు, కళాశాలలకు చెందిన యువతీ, యువకులు, ప్రేమికులు, చిన్నారులు అందరూ తమ రోజువారీ పనులకు సంబంధించిన ఒత్తిడుల నుంచి ఊపిరిపీల్చుకునేందుకు ఉన్న ఏకైక మార్గం భవానీద్వీపమే. సెలవు దినాల్లోనూ, ఎండాకాలంలో సాయంత్రం వేళల్లో కృష్ణమ్మ చెంతన గడపాలని, నిత్య జీవితానికి దూరంగా వెళ్ళిపోవాలని ఎవరు కోరుకోరు చెప్పండి. అలాంటి వారందరికీ ఆనందం, ఉల్లాసాన్ని అతి తక్కువ ఖర్చుతో అందిస్తోంది భవానీద్వీపం.

లక్షల్లో ఆదాయం...

ఈ ద్వీపంలో 2004 నుండి అమ్రపాలి కాన్ఫరెన్స్‌ హాలుతో సహా 28 కాటేజీలు, హరిత బరంపురం రెస్టారెంట్‌, బార్‌ ఇతర సౌకర్యాలున్నాయి. ప్రతిరోజూ సుమారు 500 మంది పర్యాటకులు ఇక్కడకు వచ్చి వెళుతుంటారు. గత మూడేళ్లుగా భవానీద్వీపంపై పర్యాటకాభివృద్ధి శాఖకు వస్తోన్న ఆదాయాన్ని పరిశీలిస్తే 2009-10లో సుమారు ఐదారు నెలలు వరద కాలంగా పర్యాటకులను లోనికి అనుమతించకపోయినప్పటికీ సుమారు రూ.90 లక్షల ఆదాయం లభించింది. 2010-11 సంవత్సరానికి రూ.1.10 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.1.20 లక్షల ఆదాయం లభించింది. 2011-12లో లక్ష్యాన్ని రూ.1.56 కోట్లుగా నిర్ణయిస్తే ఇప్పటికే సుమారు రూ.42.48 లక్షల ఆదాయం రావడం గమనార్హం.

రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌...

భవానీ ద్వీపం అందాల మాట అటుంచితే... ప్రస్తుతం ఈ అందాల ద్వీపం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఈ ద్వీపాన్నిaptdc ప్రయివేటుపరం చేయడమే. ఇంతటి ప్రకృతి సోయగాలున్న భవానీద్వీపం ఆలనా పాలనా పట్టించుకోని టూరిజం శాఖాధికారులు ప్రైవేటుపరం చేసేందుకు సమాయత్తం అయిన అధికార పార్టీకి మాత్రం వంతపాడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భవానీద్వీపంలో అడుగడుగునా అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. 2008లో కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా ద్వీపంలో భారీఎత్తున వేసిన ఇసుక మేటలను ఇప్పటికే తొలగించకపోవడం, మరమ్మత్తులకు నోచుకోని విద్యుత్‌ దీపాలు, శిధిలావస్థకు చేరిన పిల్లల ఆట వస్తువులకు రిపేరు చేయించక వదిలివేయడం బాధాకరం. పర్యాటకుల ఆనందం కోసం ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఓపెన్‌ థియేటర్‌ నిర్మాణం ప్రారంభదశలోనే మూతపడింది. పర్యాటక ప్రాంతంగా భవానీద్వీపాన్ని ప్రారంభించిన సమయంలో కృష్ణానదిలో షికారు కోసం అందుబాటులో ఉంచిన 12 బోట్లలో నేటికి నాలుగు మాత్రమే పర్యాటకులకు ఆనందాన్ని పంచుతున్నాయి. నాయకులు మాత్రం భవానీ ద్వీపం నష్టాల్లో ఉందని సాకు చెబుతూ... ప్రైవేటుపరం చేయడం బాధాకరం. నాలుగు జిల్లాల ప్రజలకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచడం కోసం ఏర్పాటుచేసిన భవానీద్వీపాన్ని ప్రైవేటుపరం చేయడం పై పర్యాటకులు ఈసడించు కుంటున్నారు. అయితే ద్వీపాన్ని సొంతం చేసుకుని సినిమా షూటింగ్‌లు నిర్వహించడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా పలు మార్పు, చేర్పులు చేస్తామని ఈ ద్వీపాన్ని లీజుకు పొందిన కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ద్వీపాన్ని ప్రైవేటు పరం చేయడం భావ్యం కాదని, కాకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్రజల సొమ్మును అప్పనంగా మేస్తున్న ఈ రాజకీయ నాయకులు ఈ దీపాన్ని ప్రైవేటు పరం చేయకుండా చేస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Most beautiful city in the world shanghai
Hanging gardens of babylon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles