Can Kishan Reddy make his presence felt in TN politics? అరవ రాజకీయాలలో కిషన్ రెడ్డి ఉనికి చాటగలరా.?

Can kishan reddy make his presence felt in tamil nadu politics

kishan Reddy, BJP TN Assembly election Incharge, Stalin, Sasikala return, AIADMK, AMMK, Kamal Hassan, sasikala aiadmk, jayalalithaa, VK Sasikala, TN Assembly election, AIADMK, AMMK, DMK, TTV Dhinakaran, tamil nadu elections, tamil nadu assembly elections, Tamil Nadu, Politics

Tamil Nadu is actively going forward for another Assmebly election with the parties including DMK, AIADMK and popular actor Kamal Hassan’s new party. Meanwhile, how BJP senior leader Kishan Reddy will make a way for himself in state politics as incharge of the party?

అరవ రాజకీయాలలో కిషన్ రెడ్డి ఉనికి చాటగలరా.?

Posted: 02/03/2021 08:54 PM IST
Can kishan reddy make his presence felt in tamil nadu politics

మరో నాలుగు మాసాల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో అక్కడ కూడా బలంగా పావులు కదపాలని గత నాలుగేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిన బీజేపి నాయకత్వం.. ఎన్నికల బాధ్యతను మాత్రం తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్ రెడ్డికి అప్పగించింది. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి జె.జయలలిత అనారోగ్యం కారణంగా మరణించిన నేపథ్యంలో అప్పటి అన్నాడీఎంకే పార్టీ మూడు ముక్కలుగా చీలిపోయింది. దీంతో అక్కడి పరిస్థితులను అన్నింటిని నిషితంగా గమనించిన కేంద్రం.. వారందరి మధ్య రాజీ కుదర్చి ఒకటి చేసింది.

ఎంత కేంద్రం ఒప్పందంతో ఐక్యంగా వున్నా.. ఇప్పటికీ అన్నాడీఎంకేలోని ముఖ్యమంత్రి ఎడపాటి పళనీస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరుసెల్వం వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా కోల్డ్ వార్ కొనసాగుతూనే వుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ కూడా తన సోంత పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగుతున్నారు. కాగా తాను ఎన్నికల సమరంగనంలోకి దిగుతున్నానని ప్రకటించిన తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్.. అనారోగ్యం బారిన పడిన తరువాత ఒక్కసారిగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. తాను రాజకీయాల్లోకి రానని తేల్చిచెప్పారు.

ఇక తమిళనాడులో ప్రతిపక్ష హోదాలో వున్న స్థాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ కూడా ఎన్నికల సమరంలో తమ పార్టీకి పూర్వవైభవం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. డీఎంకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కరుణానిధి మరణానికి ఓట్లతో సీట్లతో నివాళి ఇచ్చి.. ఆయన ఎప్పటికీ తమిళ ప్రజల హృదయాలలో నిలిచివుంటారన్న విషయాన్ని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు చూపాలని డీఎంకే పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక అన్నాడీఎంకే పార్టీ నేతలు అధికారం కోసం ఎలా దిగజారారో కూడా ప్రజలందనే చూశారని ఎండగడుతూ ప్రజల్లో బలం పెంపోదించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇక అక్రమాస్థుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి వికే శశికళ.. కూడా త్వరలోనే తమిళనాడులో అడుగుపెట్టనున్నారు. అమె అడుగుపెట్టిన తరువాత రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అమె కూడా తన మార్కును కొనసాగిస్తారా.? అందుకు ఎలా పావులు కదుపుతారు.? ఎలాంటి వ్యూహాలను రచిస్తారు అన్న ఉత్కంఠ అరవ రాజకీయాలలో కొనసాగుతోంది. మరీ ఇంతటి రాజకీయ సంక్లిష్టమైన పరిస్థితుల్లో బీజేపిని గాడిన పెట్టేందుకు.. కిషన్ రెడ్డి సహా బీజేపి ప్రముఖులు రచిస్తున్న వ్యూహాలు ఏమిటి. పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాకపోయినా.. కనీసం ఉనికి చాటుకునే ప్రయత్నాలలోనైనా విజయం సాధిస్తారా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles