god's own state witness hurling of bombs దేవుడి సోంత రాష్ట్రంలో బాంబుల మోత..!

Sabarimala row 20 arrested for hurling bombs at homes of cpm leaders

AN SHamseer, BJP, CK Vishak, CPM, CPM leaders house bombed, Kannur, Kerala, Kerala violence, P Sasi, Sabarimala, Sabarimala row, Thalassery, V Muralidharan, RSS, BJP conspiracy, crude bombs, crime

The Kerala police arrested 20 people in connection with an attack on Communist Party of India (Marxist) (CPM) MLA AN Shamseer's residence in Kannur

దేవుడి సోంత రాష్ట్రంలో బాంబుల మోత..!

Posted: 01/05/2019 07:21 PM IST
Sabarimala row 20 arrested for hurling bombs at homes of cpm leaders

దేవుడి సొంత రాష్ట్రంగా.. ప్రశాంతమైన ప్రకృతికి అలవాలైన రాష్ట్రం కేరళ. అఖండభారతావనిలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రం. అలాంటి సస్యశామల అన్న పదానికి నిర్వచనంలా వున్న రాష్ట్రంలో ప్రస్తుతం బాంబు విస్పోటనాలు చోటుచేసుకుంటున్నాయి. వివేకవంతులున్న రాష్ట్రంలో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడంలో పలువురు పనుతున్న కుట్రలు పైచేయి సాధించాయా.? అంటే ఔననే చెప్పకతప్పదు.

ప్రకృతి రమణీయతకు ఆలవాలంగా వున్న రాష్ట్రంలో నాటు బాంబుల విస్పోటనాలు భీతావాహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. భిన్నమతాలు, భిన్న సంస్కృతులు వున్న మలయాళీయలను నిట్టనిలువునా చీల్చుతున్నాయి. ఇన్నాళ్లు సామరస్యంగా వున్న ప్రజలు.. అందరి ఆచారవ్యవహారాలను గౌరవిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటారు. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో ఒక్కసారిగా ప్రశాతంగా వున్న కేరళ అట్టుడిపోయింది.

శబరిమలతో పాటు ఆ పవిత్ర ఆలయం నెలకొన్న పుత్తనతిట్ట జిల్లా సహా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకారులు తెలిపిన అందోళనకారులు ఆగ్రహానికి గురికావడంలో తప్పలేదు. అయితే ఏకంగా నాటు బాంబులతో విరుచుకుపడి విధ్వంసాలకు పాల్పడే చరిత్ర మాత్రం మళయాలీయులకు లేదు. అలాంటి కనీవిని ఎరుగని రీతిలో కేరళ బంద్ నేపథ్యంలో నాటు బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరిని టార్గెట్ చేశారు. కమ్యూనిస్టు భావజాలాన్ని, లేక సుప్రీంకోర్టు అదేశాలనా.? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. శాంతియుతంగా నిరసన తెలుసుతున్న అందోళనకారులను కూడా టార్గెట్ చేస్తున్నారా.? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

హిందూ సంస్థలు చేపట్టిన ఆందోళనతో రాష్ట్రం రణరంగంగా కనిపిస్తోంది. పలు చోట్ల అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కన్నూర్‌ జిల్లా ఇరిత్తి ప్రాంతంలో సీపీఎంకు చెందిన కార్యకర్తపై శుక్రవారం అర్ధరాత్రి కొందరు ఆందోళన కారులు దాడిచేసి అతన్ని కత్తితో గాయపరిచారు. ఎమ్మెల్యే ఎ.ఎన్‌.షంషీర్‌ ఇంటిపై కూడా దాడి జరిగింది. తస్సెరీ ప్రాంతంలో బీజేపీ ఎంపీ వి.మురళీధరన్‌ నివాసంపై ఆందోళనకారులు బాంబులు విసిరారు.

నాటు బాంబులు తయారు చేసినవారెవ్వరూ..? సంపూర్ణ అక్షరాస్యత కల్గిన రాష్ట్రం దేశానికి ఇచ్చే సందేశమిదేనా.. అసలు కేరళ ఎందుకిలా రగిలిపోతుంది. ఇప్పటికే కేరళకు చెందిన పలువురు ముస్లిం యువకులు ఐసిస్ లో చేరేందుకు దేశ సరిహద్దులు దాటి వెళ్లిపోవడమే అందోళన కల్గిస్తున్న క్రమంలో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు మళయాలీయులనే కాకుండా యావత్ దేశ ప్రజలను మరింత అవేదనకు, అందోళనకు గురిచేస్తున్నాయి. తమ తీర్పుతో దేశంలోని ఒక రాష్ట్రం రావణకాష్టంలా రగలిపోతున్న ఈ పరిస్థితుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం చోరవ చూపాల్సిన అవసరం ఎంతైనావుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sabarimala  Ayyappa Temple  V Muralidharan  RSS  BJP  CPM  crude bombs  crime  

Other Articles