Printing of Rs 2000 note stops, currency still valid రూ. 2000 నోట్ల ముద్రణ నిలిపేసిన అర్బీఐ..

Rbi said to scale down printing of rs 2000 note to minimum

RBI stops 2000 note, 2000 note printing RBI, 2000 note stopped, demonetisation 2000 notes, Demonetisation, Rs 2000 note, currency, India, denomination, tax evasion

The Reserve Bank of India (RBI) has stopped printing Rs 2000 notes launched during the demonetisation days in November 2016.

చలామణిలో వున్నా.. రూ. 2000 నోట్ల ముద్రణ నిలిపేసిన అర్బీఐ..

Posted: 01/04/2019 03:42 PM IST
Rbi said to scale down printing of rs 2000 note to minimum

త్వరలో రూ.2000 నోటు కాలగర్భంలో కలిసిపోనుందా.? అంటే అవునన్న సంకేతాలే కనబడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 2016 నవంబర్ 10న దేశప్రజలను పలకరించి అతిపెద్ద దేశీయ కరెన్సీ రూ.2000 నోటు రాకతోనే ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. అప్పటి వరకు వున్న రూ.1000 నోటుకే చిల్లర లభించడం కష్టంగా వున్న క్రమంలో రూ.2000 నోటు వచ్చి చిల్లర సమస్యను మరింత పెంచింది.

అయితే పెద్ద నోట్లతో అవినీతి, అక్రమాలు, నల్లధనం, ఇలా అనేక సమస్యలు వున్నాయని చెప్పిన కేంద్రం.. వెయ్యి నోటు స్థానంలో రూ.2000 నోటుకు ఎందుకు తీసుకువచ్చిందో దేశప్రజలకు ఇప్పటికీ అర్థంకానీ ప్రశ్నగానే మిగిలింది. ఈ నోటు ప్రవేశపెట్టిన నేపథ్యంలో విమర్శలకు కూడా తావిచ్చింది కేంద్రం. అయితే తనపై నిందలు పడకుండా డొంకతిరుగుడు సమాధానాలతో సర్థి చెప్పి సరిపెట్టుకుని కాలం వెల్లదీసింది.

తాజాగా మాజీ కేంద్ర ఎన్నికల కమీషనర్ ఓం ప్రకాష్ రావత్.. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా కేంద్రానికి చురకలు అంటించేవిలా వున్నాయి. దేశంలో నోట్ల రద్దు ప్రభావం పెద్దగా లేదని.. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో పెద్దసంఖ్యలో పట్టుబడిన కొట్ల రూపాయల మొత్తం అంతా నల్లధనమేనని,  రాజకీయ పెద్దలు, ప్రముఖులు అందరూ ముందుగానే తమ ధనాన్ని మార్చుకున్నారని ఆయన పెదవి విరిచిన విషయం తెలిసిందే.

ఇక నోట్ల రద్దు తరువాత కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆదాయపన్ను శాఖ అధికారుల దాడుల్లో కూడా పెద్ద ఎత్తున్న కట్టల కొద్ది కొత్త నోట్లు, బంగారం పట్టుబుడతుంది. ఇక సీబిఐ దాడుల్లో, ఈడీ దాడుల్లో కూడా ఇది షరామామూలేగానే మారింది. ఇక ఆయా రాష్ట్రాల పరిధిలోని ఏసీబీ అధికారుల దాడుల్లోనూ అనేక మంది అక్రమార్కుల ఇళ్లలో కొత్త నోట్ల కట్టలు బయడపడుతున్నాయి. ఈ క్రమంలో నోట్ల రద్దు వల్ల దేశ ప్రజలపై పడిన భారం.. దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు అనుభవించిన వేధన, ఎదుర్కోన్న ఇబ్బందులకు ఏం లాభం చేకూరిందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

ఈ ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వాన్ని అలోచింపజేస్తున్నాయా..? లేక తాము తెచ్చుకున్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ కూడా తన పదవీ కాలం ముగియకుండానే రాజీనామా చేసి వెళ్లిపోయిన క్రమంలో విమర్శలపాలవుతున్న తమను తాము కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ.. ఇప్పటి పెద్ద నోట్ల ప్రభావం ఎలా వుంటుందన్న విషయంలో కళ్లు తెరిచారు. తాజాగా, మళ్లీ నల్లధనం, పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్కు రూ.2000నోటు ఆయుధంగా మారినట్టు కేంద్రం భావించింది. దీంతో ఆఘమేఘాల మీద పెద్ద నోటు ముద్రణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

అయితే చలామణిలో ఉన్న నగదులో 37% కరెన్సీ రూ.2000 నోట్ల రూపంలోనే ఉన్న నేపథ్యంలో క్రమంగా పెద్ద నోటును కాలగర్భంలో కలపాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సంకేతాలు అందుతున్నాయి. ఉన్నపళంగా రూ.2000 నోటును రద్దుచేస్తే ఎన్నికల ముందు తీవ్ర వ్యతిరేకత, విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం పొంచి ఉండటంతో తొలుత ముద్రణను నిలిపివేసి ఆ తర్వాత క్రమంగా చలామణిని తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 2000 note  Reserve Bank India  Printing  currency  India  denomination  tax evasion  

Other Articles