BJP MP Subramanian Swamy Self goal at FICCI కందకు లేని దురద కత్తికెందుకు స్వామీ

Bjp mp subramanian swamy self goal at ficci

Arun Jaitley, Subramanian Swamy, chidambaram, PM modi, Amit Shah, demonitisation, black money, raghuram rajan, RBI Governor, Economics, income tax, sonia gandhi, abdul kalam, Rajiv Gandhi, Prime minister, politics

Rajya Sabha MP Subramanian Swamy claimed that Ms.Sonia Gandhi and former Finance Minister P. Chidambaram would be in trouble within two months. He also claimed that he was responsible for ensuring that Sonia Gandhi did not become the PM.

కందకు లేని దురద కత్తికెందుకు స్వామీ

Posted: 10/29/2018 01:31 PM IST
Bjp mp subramanian swamy self goal at ficci

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి.. నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నానే వ్యక్తిగా, పలు కీలక అంశాలపై న్యాయస్థానాలకు వెళ్లి న్యాయ పోరాటం చేసే వ్యక్తిగా భారతీయ ప్రజలకు సుపరిచితమే. మరీ ముఖ్యంగా దక్షణాదిలో తానే మేధావినన్న అభిప్రాయం కూడా తనలో వుందని పలువురు విమర్శకులు వ్యాఖ్యానిస్తుంటారు. ఆయనకు అర్థిక రంగపై పూర్తిగా పట్టువుంది అన్నట్లుగా బీజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే, బీజేపి ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చి ఇవ్వగానే ఆయన తనదైన వైఖరిని అవలంభించారు.

వ్యవస్థ పరంగా దేశంలోని అర్బీఐని ఆయన తొలి టార్గెట్ గా ఎంచుకున్నారు. అప్పటి అర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవికాలం పొడగింపు నేపథ్యంలో హై డ్రామా మధ్య కొనసాగిన ఉత్కంఠకు సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో తెరదించారు. బీజేపి అధికారంలోకి రాగానే అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అర్థిక విధానాలు దేశానికి శాపంగా పరిణమించాయి ఆయన వెంటపడి మరీ పదవి నుంచి తప్పించేలా చేశారు. ప్రపంచ దేశాలు రాజన్ అర్థిక విధానాలు బాగున్నాయని కితాబిస్తున్న తరుణంలో కూడా సుబ్రహ్మణ్యస్వామి ఆయనను టార్గెట్ చేశారు.

అయన పదవికాలాన్ని పోగడించేందుకు వ్యూహాత్మకంగా అడ్డుంకులు వేశారు. చివరకు రఘురామ్ రాజనే తనకు అర్భీఐ పదవి పొడగింపు అవసరం లేదని ప్రకటించుకునేలా చేశారు. అయితే ఈ తతంగం నడిచే సుమారు మూడు నాలుగు నెలల కాలం ప్రధాని నరేంద్రమోడీ మాత్రం తాజాగా రాఫెల్ డీల్ వ్యవహరంలో, ఇంధన ధరల పెరుగుదలలో, రూపాయి మారకం విలువ గణనీయంగా తగ్గడంలో అనుసరించినట్లు వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు.

ఇక తాజాగా సుబ్రహ్మణ్యస్వామి అటు అరుణ్ జైట్లీని కూడా టార్గెట్ చేశారు. రాజన్ స్థానంలో వచ్చిన ఊర్జిత్ పటేల్ ను ఆయన తప్పుబట్టకుండా.. అర్బీఐ విధానాలు కాదు అసలు దేశ అర్థిక విధానంలో ఇబ్బందులు తలెత్తడానికి కారణం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అని ఆయన విమర్శలు గుప్పించి సెల్ప్ గోల్ చేశారు. అర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి అసలు అర్థిక శాస్త్రం గురించి అసలు అవగాహనే లేదు అని సుబ్రహ్మణ్య స్వామి ఖారాఖండిగా చెప్పేశారు.

నోట్ల రద్దు, నల్లధనం విషయంలో ఆయన తగు జాగ్రత్త చర్యలు తీసుకుని వుంటే.. అర్థిక పరిస్థితి చాలా బాగుండేదని నోట్ల రద్దు వ్యవహారం, నల్లధనం, జీఎస్టీ, ఆధార్ సహా పలు అంశాల్లో జరిగిపోయిన తప్పిదాలను అర్థికమంత్రిపై వేసేందుకు యత్నించారు. నోట్ల రద్దు వ్యవహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తాను స్వయంగా లిఖితపూర్వకంగా ప్రధాని నరేంద్రమోడీకి అందిస్తే.. ఆయన దానిని అర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందజేశారని, అయితే నల్లధనంపై యాభైశాతం పన్ను విధించడంతో నల్లధనం కలిగిన వ్యక్తులు దానిని ప్రభుత్వానికి అందించేందుకు కూడా ముందుకు రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, జయలలిత వంటి మహిళా నేతలతో మీకు శత్రుత్వం ఎందుకన్న ప్రశ్నకు స్వామి బదులిస్తూ సమాధానాన్ని దాటవేత ధోరణిలో బదులిచ్చారు. వారితో ఎందుకు వైరం అన్న సమాధానాన్ని ఇవ్వని స్వామి.. మాయావతి, మమతా బెనర్జీ తనకు మంచి స్నేహితులని పేర్కొన్నారు. ఇక అంతటితో ఆగని స్వామి.. రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి సోనియాను పెళ్లాడి తప్పుచేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిజానికి రాజీవ్ చనిపోయే నాటికి ఆ దంపతుల మధ్య అంత సామరస్యపూరిత వాతావరణం లేదన్నారు. సోనియాగాంధీ ప్రధాని కాకుండా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90 శాతం అడ్డుకున్నారని, తానో పది శాతం కృషి చేశానని అన్నారు. ఆ విషయం తెలిసే కలాం రెండోసారి రాష్ట్రపతి కాకుండా సోనియా అడ్డుకున్నారన్నారు. బీజేపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సమాధానాలపై సమావేశం అనంతంరం ఫిక్కీ సభ్యులు ఆయన వ్యాఖ్యలపై చెవులు కొరుక్కున్నారు.

అబ్దుల్ కలాం అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ప్రధాని కాకుండా 90 శాతం అడ్డుకున్నారన్న వార్తలు విషయం పక్కనబెడితే.. రఘురామ్ రాజన్ ను అర్భీఐకి మరో పర్యాయం గవర్నర్ కాకుండా అడ్డుకున్నది మాత్రం సుబ్రహ్మణ్య స్వామేనని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రాజీవ్ గాంధీ సోనియా గాంధీల విహాహం విషయంలో వారికి లేని దురద మీకెందుకన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రాజీవ్ సోనియాగాంధీల వివాహం విషయాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చి.. అమె వీదేశీయురాలన్న విషయాన్ని మరోసారి రాద్దంతాం చేసి రాజకీయ లబ్దిని పోందేందుకు ప్రయత్నాలు జరుగుతన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాజీవ్ గాందీ చనిపోయే సమయానికి వారి సంసారంలో సామరస్యపూరిత వాతావరణం కూడా లేదని సుబ్రహ్మణ్యస్వామి ఎలా చెబుతారన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక ఇప్పడు బీజేపిలో ప్రధానమంత్రి అభ్యర్థుల రేసులో మోడీకి పోటీగా వున్నారన్న ఒకే అంశంతో అరుణ్ జైట్లీపై కూడా బురదజల్లుతున్నారని పలువురు స్వామిని విమర్శిస్తున్నారు. ఇక న్యాయస్థానాలు ఏం పని చేయాలో.. ఏం చేయకూడదో కూడా చట్టసభల్లోని వ్యక్తులు ముందుగానే చెప్పడమేంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subramanian Swamy  chidambaram  PM modi  sonia gandhi  abdul kalam  Rajiv Gandhi  politics  

Other Articles