BC Leader R. Krishnaiah to join congress కాంగ్రెస్ లోకి ఆర్ కృష్ణయ్య

Bc leader r krishnaiah to join congress

R. Krishnaiah, Congress, K.JanaReddy, Backward Classes, BC communities, BC Leaders, Congress manifesto, BC Bill, Parliament, Assembly tickets, Telangana, Politics

BC leader and former TDP MLA R. Krishnaiah along with other BC leaders met Congress senior leader K. Jana Reddy at his residence in Hyderabad and discussed various issues that the BC community faced in the state.

బీసిల ఓట్ల కోసం కాంగ్రెస్ పాచిక..కాంగ్రెస్ లోకి ఆర్ కృష్ణయ్య

Posted: 10/20/2018 05:02 PM IST
Bc leader r krishnaiah to join congress

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు అందివచ్చిన ప్రతీ ఒక్కరినీ తమ పక్షాన చేర్చుకుంటున్న కాంగ్రెస్.. తాజాగా బీసీ ఓట్లను కొల్లగొట్టేందకు కూడా కొత్త పాచికను వేసిందని సమాచారం. కులాలు, మతాల వారీగా అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను విడదీసివారికి తాయిలాలు ప్రకటిస్తున్న క్రమంలో.. అధికార పార్టీ కలలను చెరిపేస్తూ.. అందుకు భిన్నమైన ప్రణాళికను సిద్దం చేసిన కాంగ్రెస్.. ఏకంగా రాష్ట్ర బీసీ నేత, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్యను తమ పార్టీలోకి చేర్చుకోనుంది.

రమారమి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ తెరవెనుక చకచకా జరిగినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవితోపాటు తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే మంచి ప్రాధాన్యం ఉన్న మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున సీఎం అభ్యర్థిగా కృష్ణయ్య బరిలోకి దిగారు. అయితే ఆయన మాత్రం ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందినా.. పార్టీ మాత్రం తెలంగాణలో ఆశించిన స్థానాలను సాధించలేకపోయింది.

దీంతో టీడీపీ శాసనసభాపక్ష నేతగా రేవంత్ రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఎల్ రమణను నియమించడంతో ఆయన పార్టీ నుంచి దూరం జరిగారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఎల్బీనగర్ స్థానం నుంచే పోటీ చేయాలని కృష్ణయ్య భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కృష్ణయ్యను పార్టీలోకి ఆహ్వానించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాలు ఇప్పటికే చర్చలు జరిపినట్టు చెబుతున్నారు.

ఈ సారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగినా.. దిగకపోయినా ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి.. సత్కారించాలని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీంతో పాటు పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు మంత్రి పదవిని కూడా ఇస్తామని గట్టి హామీని కూడా ఇచ్చిందని సమాచారం. ఈ ఎన్నికల్లో సెటిలర్లతోపాటు బీసీ ఓటు బ్యాంకుపైనా దృష్టి సారించిన కాంగ్రెస్.. కృష్ణయ్యను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా లబ్ధి పొందాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఆఫర్‌పై కృష్ణయ్య స్పందిస్తూ బీసీ సంఘాలతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే కృష్ణయ్య కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమనే తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : R. Krishnaiah  Congress  BC Leader  BC Bill  Assembly tickets  Telangana  Politics  

Other Articles