Prodyut Bora and sivaji sensational comments on BJP బీజేపిపై వారు చేసిన అరోపణలు నిజమేనా.?

Prodyut bora and sivaji sensational comments on bjp true

Actor Sivaji, operation dravida, operation garuda, BJP IT Cell Founder, Prodyut Bora, power, democracy, BJP, allegations, Andhra pradesh, ruling, TDP, YSRCP, no confidence motion, prime minister, PM Modi, Amit shah, chandrababu, YS jagan, Pawan Kalyan, JanaSena, andhra pradesh, politics

Actor Sivaji Explodes Sensational News on BJP, in a another case BJP IT Cell founder Prodyut Bora made sensational comments on PM Modi and BJP Chief Amit Shah after submitting resignation to the posts. Sivaji alleges bjp doing Operation garuda in andhra pradesh, utilizing the differences between the parties and trying to come into power.

బీజేపిపై వారు చేసిన అరోపణలు నిజమేనా.?

Posted: 03/23/2018 10:13 AM IST
Prodyut bora and sivaji sensational comments on bjp true

నాలుగేళ్లకు ముందు దేశప్రజల్లో వినిపించిన, కనిపించిన మోడీ సమ్మెహనాస్త్రాలు.. కనుమరుగువుతున్నాయా.? బీజేపిలో గురువులను పక్కనబెట్టి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టి.. యావత్ దేశానికి తామే రాజు.. తామే మంత్రి అన్న రీతిలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరిస్తున్నారా..? తనకు అడ్డుగా వున్న నేతలను పక్కకు జరిపేందుకు ఎంతటికైనా సై అంటున్నారా..? వీరి చర్యలు నిజంగా దేశ ప్రజాస్వామ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయా.?

ఉత్తర్ ప్రదేశ్ లో స్వయంగా ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి తమ లోక్ సభ స్థానాలను గెలిపించుకోలేక పోవడంతోనే బీజేపిపై దేశవ్యాప్తంగా వున్న అసంతృప్తి బయటపడుతుందా.? యోగీకి కుంచుకోటగా వున్న నియోజకవర్గంలో ఎస్పీ బ్రహ్మాండమైన మెజారిటీతో విజయాన్ని అందుకోవడం పాలకపక్షంపై ఏడాదిలోపు వచ్చిన వ్యతిరేకతే కారణమా..? మోడీ మానియాతో మళ్లీ అధికారంలోకి వస్తామన్న అధికార పక్షం ధీమాకు బీటాలు వారుతున్నాయా.?

దేశం, జాతీయతా అంటే ముందుంటామని ప్రకటనలు చేస్తున్న బీజేపి.. కాశ్మీర్ లో నిత్యం రావణకాష్టంలా ఉగ్రవాదులు దేశపౌరులపై, భద్రతాదళాలపై తూటాల వర్షం కురిపిస్తున్నా.. అక్కడ వేర్పాటువాదులు నిత్యం అగ్గిని రాజేస్తున్నా.. దానిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ మిత్రపక్షానికి మద్దతును కొనసాగిస్తూ.. జాతీయవాద వాదనను తలెకెత్తుకోవడం కూడా దేశప్రజలను నివ్వెరపరుస్తుందా..? అసలు బీజేపికి అధికారమే పరమావధా.? అధికారంలోకి రావడం, అధికారంలో కొనసాగడం మాత్రమే లక్ష్యమా.?

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రస్ సహా యూపీఏ పార్టీలకు చెందిన నేతలు అరోపించినట్లు.. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ద్వయానికి పార్టీ కన్నా వారి వ్యక్తిగత పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోవడమే ఇష్టమా..? గతంలో వున్న బీజేపి పార్టీగా ఎదిగిందని, అయితే ప్రస్తుతం వున్న పార్టీ మాత్రం కేవలం వ్యక్తులుగా మాత్రమే ఎదుగుతుందన్న విమర్శల్లో నిజముందా.? ఎన్నికలకు ముందు మాజీ కేంద్రమంత్రి చిదంబరం అరోపించినట్లే ఇప్పుడు అంతా జరుగుతుందా.? ఇకపై దేశవ్యాప్తంగా బీజేపి అంటే మోడీ, మోడీ అంటే బీజేపి అనే పరిస్థితి వచ్చిందా.?

బీజేపి పార్టీ ఐటీ సెల్ వ్యవస్థాపకుడిగా సుమారుగా 14 ఏళ్లుగా సేవలందించిన ప్రోద్యుత్ బోరాతో పాటు అధికారం కోసం బీజేపి పార్టీ చేసిన అపరేషన్లను నిర్వహిస్తూ.. వేల కోట్ల రూపాయలను తృణప్రాయంగా ఖర్చుచేస్తుందన్న తెలుగు సినీహీరో శివాజీ అరోపణలు వింటుంటే.. ఔనా ఇది నిజమేనా..? అన్న సందేహాం ఉత్పన్నం కాకతప్పదు. ఇక దీనికి తోడు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశ రైతాంగాన్ని అదుకోవాలని, అత్మహత్యలకు పాల్పడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని ఇవ్వాలని అదేశాలు ఇచ్చినా.. ఇప్పటికే పలు బీజేపి పాలిత రాష్ట్రాల్లో పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదన్న విమర్శలూ వున్నాయి.  

అయితే ఏకంగా సీనియర్ బీజేపీ నేత ఐటీ సెల్ విభాగానికి సేవలందించిన ప్రోద్యుత్ బోరా తాను బీజేపి పార్టీలో చేరిన నాటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా వ్యత్యాసముందని, పరిస్థితుల్లో పూర్తిగా మార్పాలు వచ్చాయని అరోపించారు. బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఆయన రాసిన లేఖలో అయన ఈ వివరాలను పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాల ద్వయం పార్టీ పేరుకు అప్రతిష్టను మూటగడుతున్నారని, ఖ్యాతి గడించిన పార్టీకి లక్ష్యాలను మార్చేస్తున్నారని అరోపించారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అధికారంలో కొనసాగడమే తమ పరమావధిగా ఈ ద్వయం అలోచనలు మారిపోయాయని అరోపించారు. అయితే అధికారంలో కొనసాగడమే బీజేపి అగ్రనేతల ఎజెండా అయినప్పుడు హామీలను నెరవేర్చడంతో పాటు రైతాంగాన్ని అదుకోవడంతోనే ఇది సాద్యమవుతుందన్ని వారికి తెలియదా... అసలు వీరు ప్రధాని, షాలపై చేస్తున్న అరోపణల్లో నిజమెంత అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో శివాజీ కూడా పరోక్షంగా జాతీయ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా తామే అధికారంలో వుండేలా ఎక్కడికక్కడ అపరేషన్ చేపడుతున్నారని, ఒక్కో ప్రాంతానికి ఒక్కో అపరేషన్ పేరును పెడుతూ.. అందులో మళ్లీ ఉప అపరేషన్ లను కూడా చేపడుతున్నారని అరోపించారు. ఇందుకు వేల కోట్ల రూపాయలను కూడా వెచ్చిస్తున్నారని.. అయితే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందన్న విషయాలు తనకు తెలియవన్నారు. దక్షిణభారత దేశంపై ఇప్పడు ఈ జాతీయ పార్టీ కన్ను పడిందని, కేరళ, తమిళనాడు ఎన్నికల నాటి నుంచే ఈ ప్రాంతాలపై అపరేషన్ ద్రవిడ సాగుతుందని అరోపించారు.

ఈ ద్రవిడ అపరేషన్ లో భాగంగా గరుడ పేరుతో జరిగే అపరేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కొనసాగుతుందని శివాజీ కూడా అరోపణలు చేయడంతో.. బీజేపి పెద్దల అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది దేశప్రజలకు అర్థంకాకుండా పోతుంది. అయితే అవినీతి పాల్పడే పార్టీలకు అధికారం లభించినా.. లేక తామే నిత్యం అధికారంలో వుండాలన్న యావతో కూడిన పార్టీలకు అధికారం లభించినా.. ఈ రెండు కూడా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా బాసిల్లుతున్న మన దేశానికి శ్రేయస్కరం కాదన్న భావన మాత్రం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles