ICICI board divided over Chanda Kochhar's future రాజీనామా యోచనలో ఐసిఐసిఐ సీఈవో చందాకొచర్

Icici may mull road ahead for ceo chanda kochhar

Deepak Kochhar, Chanda Kochhar, ICICI bank, videocon, Vebugopal Dhoot, LIC, CBI, board of ICICI Bank, Banking sector

The board of ICICI Bank, which expressed full faith in CEO Chanda Kochhar, is divided over whether to ask her to step down as government agencies investigate allegations of impropriety over loans made to Videocon group, people with knowledge of the matter said.

రాజీనామా యోచనలో ఐసిఐసిఐ సీఈవో చందాకొచర్

Posted: 04/09/2018 03:42 PM IST
Icici may mull road ahead for ceo chanda kochhar

ఐసిఐసిఐ బ్యాంకు సీఈవో చందాకొచ్చర్ తన పదవికి రాజీనామా చేయనున్నారా.? ఇప్పుడిదే బ్యాంకింగ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మహిళగా ఓ ప్రైవేటు బ్యాంకు చైర్మన్ పగ్గాలను చేపట్టిన ఆయన తనపై వచ్చిన అరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారా.? అన్న చర్చ తీవ్రంగా సాగుతుంది. అమె సీఈవో పదవికి అరోపణలు ఎసరు పెట్టనున్నాయని తెలుసుకున్న అమె.. పదవి నుంచి బ్యాంకు తప్పించడం కంటే.. తనకుతానుగానే పదవి నుంచి తప్పుకునేందుకు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించనున్నారని సమాచారం.

వీడియోకాన్ గ్రూపు సంస్థలకు రూ.3,250 కోట్ల రుణం మంజూరు వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ వ చ్చిన ఆరోపణలు నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో పదవి నుంచి అమె తప్పుకునేందుకు యోచిస్తున్నారన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. కాగా చందా కొచర్ పదవీ కాలం వచ్చే ఏడాది (2019) మార్చి వరకు ఉంది. అయితే వీడియోకాన్ గ్రూపుకు రుణం విషయంలో వస్తున్న అరోపణలు నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారని సమాచారం. వీడియోకాన్ సంస్థ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ నుంచి చందాకొచర్ భర్త దీపక్ కొచర్ ఏర్పాటు చేసిన కంపెనీలోకి రూ.60 కోట్లకు పైగా నిధులు సమకూర్చినట్టు ఆరోపణలు రావడం అవి కాస్తా తీవ్రదుమారం రేపడంతో అమె రాజీనామా యోచనలో వున్నారని సమాచారం. ఇప్పటికే దీనిపై సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది.

దీంతో చందా కొచర్ తన పదవికి రాజీనామా చేయాలని ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు నుంచి ఒత్తిడి పెరుగుతోంది. రుణం మంజూరులో చందాకొచర్ ప్రమేయం ఏదీ లేదంటూ ఇటీవలే బ్యాంకు బోర్డు ఆమెకు మద్దతుగా నిలిచిన విషయం విదితమే. అయితే, బోర్డులో కొందరు ఆమె తప్పుకుంటే బావుంటుందని కోరుతుంటే, మరికొందరు ఆమె కొనసాగాలని ఆశిస్తున్నట్టు సమాాచారం వినిపిస్తోంది. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఐసీఐసీఐ బ్యాంకును ప్రైవేటు రంగంలో నంబర్ 2 బ్యాంకుగా నిలబెట్టడంలో చందాకొచర్ పాత్ర ఎంతో విలువైనది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles