కాంగ్రెస్ నేతలతో మీటింగ్... ఆపై కనిపించకుండా పోయాడు | Konathala Disappear after meet Congress leaders

Konathala ramakrishna is in a dilemma

Konathala Ramakrishna, Konathala Dilemma, YSRCP, Konathala Ramakrishna Congress, Konathala Ramakrishna Party, Konathala Ramakrishna Political, Konathala Dilemma

Konathala Ramakrishna is in a dilemma as to which party he should join. He has recently come back from Delhi after meeting a couple of senior Congress leaders.Personally, Konathala is said to be of the opinion that YSRCP is gaining in public confidence regularly whereas the TDP is losing credibility with each passing day.

డైలామాలో కొణతాల.. కాంగ్రెస్ లోకి కన్ఫర్మ్?

Posted: 02/11/2017 11:33 AM IST
Konathala ramakrishna is in a dilemma

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి గాలి ఎప్పుడు ఎటు మళ్లుతుందో, ఎవరి నాలుకలు ఎప్పుడు ఎవరి మీద విమర్శలు గక్కుతాయో తెలీని పరిస్థితి నెలకొంది. ఓవైపు ఏపీ రాజకీయాల్లో వలసల పర్వం కొనసాగుతుంటే కీలక నేతలు తమ రాజకీయ భవిష్యత్తు ఎందులో బావుంటుందనే అంజనం వేసి, ఆపై ఓ మాంచి ముహుర్తం చూసుకుని అనుచరులతో సహా ముక్కుమ్మడిగా జంప్ అయిపోతున్నారు.

ఆ వరుసలో ఇప్పుడు సీనియర్ పొలిటీషియన్ కొణతాల రామకృష్ణ కూడా ఉన్నాడు. వైసీపీ వీడి చాలా కాలమే అయినప్పటికీ ఇంతవరకు ఏ పార్టీలో చేరాలన్న దానిపై తటపటాయిస్తూనే వస్తున్నాడు. ఇంతకు ముందు అధికార పక్షంలోకి చేరతాడనే చెప్పుకున్నప్పటికీ, చివరి నిమిషంలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో మంతనాలు జరపటం ఆసక్తికరంగా మారింది. ఇందు కోసం హస్తినకు వెళ్లి మరీ రాయబారం నడిపిన కొణతాల అధికార పక్షం కాకుండా అసలు సమీప భవిష్యత్తు కనిపించని కాంగ్రెస్ ను ఎందుకు ఎంచుకున్నాడన్న ప్రశ్న కూడా ఒకానోక టైంలో ఉద్భవించింది.

Konathala Dilemma

అయితే ఇంతకు ముందు వైసీపీ ప్రజల్లో విశ్వాసం పెంచుకోలేకపోతుందని చెప్పిన ఆయన, ఇప్పుడు టీడీపీకి రాను రాను ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందన్న ఒపీనియన్ ను వచ్చాడంట. నిజానికి మిగతావాళ్లలాగానే జగన్ నుంచి సరైన మర్యాద అందకపోవటం మూలంగానే కొణతాల పార్టీ నుంచి బయటకు వచ్చాడన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు టీడీపీలో కూడా సముచిత స్థానం దక్కకపోతే తన రెండింటికి చెడ్డ రేవడిలా తయారవుతుంది. కాంగ్ లో ఉంటే కనీసం భవిష్యత్తులో అయినా ఏదో ఒక సీటు దక్కకపోతుందా అన్న ఆలోచనతో ఈ డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Konathala Ramakrishna  Congress  

Other Articles