జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మం వెన‌క చిన్నమ్మ? మోదీపై కోపంతోనే... | Jallikattu Protesters gives shock to Sasikla Natarajan.

Sasikala natarajan behind jallikattu protest

AIADMK Chief, Sasikala Natarajan, Jallikattu Protest, Sasikala Jallikattu Chaos, Sasikala behind Chennai Chaos, Sasikala Jallikattu, AIADMK Chief Jallikattu, Jallikattu Chaos, Sasikala Natarajan Jallikattu, Jallikattu Protests, Jallikattu Sasikala, Sasikala Jallikattu Clash, Sasikala Food Protesters,

AIADMK Chief Sasikala Natarajan behind Jallikattu Protest and Chaos. And also supply food to protetsters. In last moments Protesters gives shock to her.

చిన్నమ్మకు భలే ట్విస్ట్ ఇచ్చారు

Posted: 01/25/2017 11:49 AM IST
Sasikala natarajan behind jallikattu protest

తానోకటి తలిస్తే.. దైవం ఒకటి తలుస్తుందని ఊరికనే అనలేదు. జ‌ల్లిక‌ట్టు వ్యవహారంలో అన్నాడీఎంకే చీఫ్ శ‌శిక‌ళకు కూడా సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదుయ్యిందని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి అసలు ఈ ఉద్య‌మంకు అసలు కారణం చిన్నమ్మేనంటూ వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తొలుత చిన్న‌గా ప్రారంభమైన విద్యార్థుల ఉద్య‌మం క్ర‌మంగా పుంజుకోవ‌డానికి కూడా శశి సపోర్ట్ ఫుల్ గా ఉందనేది వారి వాదన.

నిజానికి ప్రస్తుతం ఉన్న పన్నీర్ సెల్వం స్వచ్ఛందంగా తప్పుకుంటేనే ఆవిడ సీఎం కాగలరు. కానీ, సెల్వం అందుకు సిద్ధంగా లేడు. పైగా మాటి మాటికీ ప్ర‌ధాని మోదీ ని కలుస్తూ పైకి విన్నపాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నట్లు లోపాయి కారిగా బీజేపీతో పార్టీ అంతర్గత వ్యవహారాలను లీక్ చేస్తున్నాడని శశి భావిస్తోందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరిపై ఉన్నఆగ్ర‌హం, అదే సమయంలో జ‌ల్లికట్టు అంశం వెలుగులోకి రావటంతో ఎలాగైనా తానేంటో నిరూపించుకోవాలన్న క‌సితోనే ఆమె పక్కా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో ఉద్య‌మాన్ని తారస్థాయికి తీసుకెళ్ల‌డంలోనూ ఆమె పాత్ర ఉందంటున్నారు. మాంచి ఊపు మీదకు చేరుకోగానే తాను సీన్ లోకి ఎంటర్ అయ్యి ఆందోళ‌న‌ను విర‌మింప‌జేసి ఆ క్రెడిట్‌ను అంతా కొట్టేయాలని భావించిందంట. కానీ,సీన్ టోటల్ గా రివర్స్ అయ్యింది. శాశ్వత పరిష్కారం అంటూ ఆందోళనలు మరింత ఉదృతమయ్యాయి. అదే సమయంలో ఆందోళ‌న‌కారుల సంఖ్య ఒక్క‌సారిగా పెర‌గ‌డంతో ప‌రిస్థితి శ‌శిక‌ళ చేయి దాటిపోయింది.

మరోవైపు జ‌ల్లిక‌ట్టు క్రీడ నిర్వ‌హ‌ణ‌కు వీలుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చాం కాబ‌ట్టి ఆందోళ‌న‌ను విర‌మించాలంటూ ఆమె పంపిన సందేశాన్ని నిర‌స‌న‌కారులు ప‌ట్టించుకోలేదు. దీంతో ఆగ్ర‌హంచిన శ‌శిక‌ళ, అప్ప‌టి వ‌ర‌కు వారికి అందించిన అన్న‌పానీయాల స‌ర‌ఫ‌రాను నిలిపివేసిందని విశ్లేషిస్తున్నారు. ఇంకోవైపు సెల్వం కూడా చిన్నమ్మకు చెప్పకుండానే ఖాకీలను రంగంలోకి దించి ఉద్యమాన్ని ఒక్కసారిగా అణచివేయాలని చూడటంతోనే గొడవకు కారణమై ఉంటుందన్నది వారి అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jallikattu  Protest  AIADMK  Sasikala Natarajan  

Other Articles