హిల్లరీ తలరాత మారేనా..? ట్రంప్ అలా చేసేనా..? Wisconsin to recount presidential election votes

Wisconsin to recount presidential election votes

wisconsin, votes recounting, donald trump, hillary clinton, hill stein, green party candidate, us presidential elections , Wisconsin to recount presidential election votes,news, India news,International News,International News in India ,Washington ,Washington news

Wisconsin, one of three battleground US states won by President-elect Donald Trump will undergo votes recounting after it received two petitions in this regard from a third-party candidate.

హిల్లరీ తలరాత మారేనా..? ట్రంప్ అలా చేసేనా..?

Posted: 11/26/2016 01:41 PM IST
Wisconsin to recount presidential election votes

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా గెలుపొంది త్వరలో పదవీ బాధ్యతలను అందుకోనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యర్థులపై పైచేయి సాధించిన అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించడానికి సన్నధం అవుతున్న మూడు రాష్ట్రాలలో ఒకటైన విస్కాన్సిన్‌ లో రీకౌంటింగ్ జరిపేందుకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సుముఖత వ్యక్తం చేసింది. ట్రంప్ కు మెజారిటీ సాధించిపెట్టిన మూడు రాష్ట్రాల్లోనూ రీకౌంటింగ్‌ జరుపాలన్న డిమాండ్‌ వెల్లువెత్తిన నేపథ్యంలో విస్కాన్సిన్‌ అధికారులు అందుకు అంగీకరించారు. గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టిన్ తో పాటు మరో పార్టీ నుంచి కూడా రీ కౌంటింగ్ జరపాలని అభ్యర్థనలు రావడంతో విస్కాన్నిస్ అధికారులు రాష్ట్రవ్యాప్త రీకౌంటింగ్‌కు అంగీకరించింది.

ఓటింగ్‌లో పెద్ద ఎత్తున హ్యాకింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ గ్రీన్‌ పార్టీ అభ్యర్థి జిల్‌ స్టీన్‌ రీకౌంటింగ్‌ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. రష్యాకు చెందిన కొందరు రిపబ్లికన్లు ఇక్కడి ఓటింగ్ మిషన్లను హ్యాక్ చేసి ఓటింగ్ ఫలితాలపై ప్రభావాన్ని చూపారని అమె అరోపిస్తూ రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేసింది. అయితే ట్రంప్ కు అథ్యధికంగా ఓట్లు పోలైన మూడు రాష్ట్రాలు విస్కాన్సిన్‌, మిచిగన్‌, పెన్సిల్వేనియాలలో ఇలా హ్యకింగ్ జరిగివుండవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేయగా, ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఒక్క రాష్ట్రంలో రీ కౌంటింగ్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

విస్కాన్సిన్‌ రాష్ట్రంలో రీకౌంటింగ్‌లో భాగంగా 30లక్షల బ్యాలెట్‌ ఓట్లను కూడా మళ్లీ లెక్కించనున్నారు. వచ్చేవారం ఈ రీకౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతోంది. అయితే ఇందుకు మొత్తంగా 5.1 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారుగా ఏడున్నర కోట్ల రూపాయలు) ఖర్చయ్యే అవకాశం వుండగా, ఆ మొత్తాన్ని గ్రీన్‌ పార్టీ కాంపెయినే భరించాల్సి వుంటంది. ఫెడరల్‌ అధికారులు విధించిన నిబంధన మేరకు ఈ రీకౌంటింగ్ ప్రక్రికయను డిసెంబర్‌ 13లోపు పూర్తిచేయాల్సి వుంటుంది. అయితే విస్కాన్సిన్‌లోని 72 కౌంటీల్లో మొత్తం రీకౌంటింగ్‌ కేంద్రాల ఓట్లను లెక్కించడానికి అధికారులు చాలానే శ్రమించాల్సి వుంటుంది. పగటి పూటతో పాటు సాయంత్రాలు. వీకెండ్ లు కూడా వారు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లోనే గడపాల్సి వుంటంది.

అయితే అగ్రరాజ్య పగ్గాలను అందుకోబోతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ రష్యాకు చెందిన హ్యాకింగ్ నిపుణులతో ఎన్నికల యంత్రాలను హ్యాక్ చేయించారా..? నిజంగా ఆయన ఇలాంటి చర్యలకు పూనుకున్నారా..? నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా తాను ఓ వ్యక్తిని చంపినా..తనను అమెరికా అధ్యక్షుడిని కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్న ప్రకటనకు కారణంగా హ్యాకింగేనా..? ఎన్నికలకు ముందు రిగ్గింగ్ జరగవచ్చునంటూ హిల్లరీపై అరోపణలు గుప్పించి.. తాను మాత్రం సైలెంటుగా హ్యాకింగ్ కు పాల్పడ్డారా..? అన్న అనుమానాలు కూడా అమెరికా వాసుల్లో తాజాగా ఉత్పన్నమవుతున్నాయి. అయితే నిజానిజాలను రీకౌంటింగ్ ఫలితాలు తేల్చాల్సిందే.

ఈ విషయాన్ని పక్కనబెడితే.. అనేక వ్యయప్రయాసలకు ఓర్చి గ్రీన్‌ పార్టీ అభ్యర్థి చేపడుతున్న ఈ రీకౌంటింగ్‌ ప్రక్రియ వల్ల ఓడిపోయిన హిల్లరీ వర్గీయుల్లో కొంత ఆశాభావం వ్యక్తమవుతున్నా.. అగ్రరాజ్యం అధ్యక్షురాలు కావాలన్న అమె తలరాతను మర్చగలదా అన్న విషయంలో మాత్రం సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రీకౌటింగ్‌ వల్ల ఈ నెల 8న జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు చాలా తక్కువని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మూడు రాష్ట్రాల్లో రీకౌంటింగ్ జరిగి ట్రంప్ పై హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తే మాత్రం హిల్లరీ అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు కూడా నిపుణులు వినిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US Presidential elections  donald trump  hillary clinton  wisconsin  Jill Stein  Green Party  

Other Articles