అమాయక రైతులను అవమానించి ఆర్బీఐ..? RBI restiction taxes innocents in black money drive

Rbi restiction taxes innocents in black money drive

PM Modi, Pradhan Mantri Jan-Dhan Yojana, RBI, Specified Bank Notes, Cash withdrawal, RBI, Jan Dhan accounts, demonetisation, withdrawal limit, KYC norms, Reserve Bank of India, banknotes, currency

RBI restiction taxes innocents with alleged benami deposits by black money hoarders, has made the life of poor vulnerable.

అమాయక రైతులను అవమానించిన ఆర్బీఐ..?

Posted: 11/30/2016 01:26 PM IST
Rbi restiction taxes innocents in black money drive

అవినీతి, నల్లధనాన్ని దేశం నుంచి పారద్రోలుతామని పెద్దనోట్లను రద్దు చేసిన కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్.. దేశ ప్రజలందరికీ ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని అందుకు కోంత సమయం, సంయమనం అవసరమని కూడా చెప్పారు. ప్రధాని పిలుపుతో దేశ ప్రజలు గత ఇరవై రోజులుగా అనేక ఇబ్బందులకు గురవుతున్నా.. మంచి రోజుల కోసం భరిస్తున్నారు.

ఇప్పటికే అవసరాలకు డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ఏటీయం కేంద్రాలు, బ్యాంకులకు వెళ్లి బారెడు క్యూ లైన్లలో నిల్చంటున్న ప్రజలకు డబ్బు చేతికి రావాలంటూ అదృష్టం కూడా వుండాలని లేకపోతే ఎంత సేపు నిల్చున్నా.. అదంతా వృధా ప్రయాసగానే మారుతుంది. అయినా భవిష్యత్, దేశ ఉజ్వల ప్రగతి కోసం అని కేంద్రం చెబుతున్న మాటలతో కొంత కష్టమైనా ఇష్టంగా భరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్  బ్యాంక్ పుండు మీద కారం చల్లినట్లుగా దేశ రైతులను అవమానించే విధంగా తీసుకున్న చర్యలపై విమర్శలు వస్తున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆపరేషన్ బ్లాక్ మనీ పథకంలో భాగంగా అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు రిజర్వు బ్యాంకు తీసుకున్న కీలక నిర్ణయంలో రైతులకు పరాభవం ఎదురైందన్న విమర్శలు వినబడుతున్నాయి. అమాయక రైతులు నల్లకుబేరుల వలలో చిక్కుకోకుండా.. అర్బీఐ ఇప్పటివరకు వున్న నగదు విత్ డ్రా పరిమితులను అమాంతంగా తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు రైతులను అమాయకులు అంటూనే ఆర్బీఐ దేశ రైతులందరినీ నల్లకుబేరులకు లోంగిపోయేవారిగా చిత్రీకరించడం.. ఈ మేరకు తమ నగదు ఉపసంహరణలను కుదించడం అవమానం కాక మరేమిటని కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

దేశంలో అర్థిక ఎమర్జెన్సీ వచ్చిందని విపక్షాలు అరోపిస్తున్నా.. తాము ఎంతో సంయమనం పాటించి కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తుండగా, ఆర్బీఐ మాత్రం తమను అవమానిస్తూ.. తమను కూడా పరోక్షంగా నల్లకుబేరులకు లొంగిపోయేవారిగా చిత్రీకరించడం ఎంతవరకు సహేతుకమని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దేశానికి జవాన్లు.. కిసాన్లు వెన్కుముక్కలని భావించే ప్రభుత్వాలు ఆర్బీఐ తమను ఇంతలా అవమానిస్తున్నా ఏం చేస్తున్నాయని నిలదీస్తున్నాయి.

గ్రామీణ ఖాతాదారుల విత్ డ్రా పరిమితిని పదివేలకు కుదిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించడం.. నెలకు పది వేల రూపాయలలోనే జీవించాలని అంక్షలు విధించడం ఎలా శుభపరిణామం అని రైతులు నిలదీస్తున్నారు. ఎవరో కొందరు చేసే పనులను అందరికీ అపాదించి.. తమను పరోక్షంగా అవినీతి పరులుగా అర్భీఐ చిత్రీకరిస్తుందని, అందుచేతు తమ విత్ డ్రా పరిమితిని కుదించిందని రైతులు ఆరోపిస్తున్నారు. తమను అర్బీఐ అవమానిస్తుంటే ప్రధాని మోడీ ఎందుకు మౌనం వీడటం లేదని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  PM Modi  cash withdrawl limits  jan dhan accounts  currency  demonetisation  

Other Articles