ఇరానీ ఎందుకూ పనికి రాదు | PM Modi rejects Smriti Irani's choice of CBSE chief

Pm modi rejects smriti irani s choice of cbse chief

PM Modi Smriti Irani, Irani insult by modi again, CBSE chief position Irani insult

PM Modi rejects Smriti Irani's proposal names for CBSE chief position

ఇరానీ ఎందుకూ పనికి రాదు

Posted: 07/13/2016 12:32 PM IST
Pm modi rejects smriti irani s choice of cbse chief

వారం క్రితం అవమానకరమైన రీతిలో కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన స్మృతి ఇరానీ టైం అస్సలు బాగోలేదు. కీలకమైన మానవ వనరుల శాఖ నుంచి జౌళి శాఖకు మార్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ... ఆ శాఖ బాధ్యతలను ‘మిస్లర్ క్లీన్’ ప్రకాశ్ జవదేకర్ కు అప్పగించారు. దీంతో బాధలో కూరుకుపోయిన ఆమెకు వెంటనే మరో షాక్ తగిలింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చైర్మన్ పదవి కోసం ఆమె ప్రతిపాదించిన వ్యక్తి పేరును మోదీ సర్కార్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

పైగా సీబీఎస్ఈ చైర్మన్ లాంటి కీలక పదవుల భర్తీ ప్రక్రియతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధమేమీ లేదని అపాయింట్ మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ (ఏసీసీ) తేల్చిచెప్పింది. 2014 డిసెంబర్ నుంచి ఖాళీగా ఉన్న సీబీఎస్ఈ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని హెచ్ ఆర్డీ మినిస్టర్ హోదాలో గతంలో ఇరానీ... కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల కమిటీ (డీఓపీటీ)కి లేఖ రాసింది. సదరు పదవికి ముగ్గురు విద్యావేత్తల పేర్లను ప్రతిపాదిస్తూ ఇరానీ ఆ లేఖ రాశారు కూడా.

ఉత్తరప్రదేశ్ ఎస్ఈఆర్టీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సర్వేంద్ర బహదూర్ విక్రమ్ బహదూర్ సింగ్ తో పాటు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కమలకాంత బిశ్వాల్, భారత నావికాదళ విద్యా విభాగానికి అదనపు ప్రిన్సిపల్ డైరెక్టర్ గా ఉన్న ఖుర్రం షెహజాద్ నూర్ ఇందులో ఉన్నారు. వీరిలో విక్రమ్ సింగ్ కే ఎలాగైనా సీబీఎస్ఈ చైర్మన్ పదవి ఇప్పించేందకు స్మృతి తెగ ప్రయత్నాలు చేశారంట.

అయితే ఈ ముగ్గురు పేర్లను తిరస్కరిస్తూ ఏసీసీ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు లేఖను తిప్పి పంపింది. హెచ్ఆర్డీకి ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెబుతున్నప్పటికీ, గతంలో ఈ సాంప్రదాయాన్నే పాటించారు. ఆ శాఖా మంత్రి సూచించినవారినే సీబీఎస్ఈ చైర్మన్ గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది.  కేవలం స్మృతీ ఇరానీ ప్రతిపాదించిన కారణంగానే మోదీ తిరస్కరించారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ఈ కమిటీ ప్రధాని మోదీ అధ్యక్షతననే పనిచేస్తున్న సంగతి తెలిసిందే. మూలిగే నక్కపై తాటి కాయ పడటమంటే ఇదేనేమో.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM narendra modi  Smriti Irani  CBSE chief  

Other Articles

Today on Telugu Wishesh