వైసీపీలోకి ఆ ఇద్దరు... ఎవరబ్బా? | undavalli arun kumar and harshvardhan join YSRCP

Undavalli arun kumar and harshvardhan join ysrcp

Undavalli join in YSRCP, Harshavardhan join YSRCP, Jagan Undavalli and Harshavardhan

Ex Congress MPs Undavalli Arun Kumar and Harshvardhan join YSRCP soon.

వైసీపీలోకి ఆ ఇద్దరు... ఎవరబ్బా?

Posted: 07/12/2016 04:28 PM IST
Undavalli arun kumar and harshvardhan join ysrcp

ఓవైపు తమ పార్టీ నుంచి అధికార పక్షంలోకి వలసలు కొనసాగుతున్న తరుణంలో ఓ ఇద్దరు కీలక నేతలు తమ వైపు చూడటం వైసీపీ శిబిరంలో ఆనందం నింపుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన ఆ ఇద్దరు కీలక నేతలు త్వరలో ప్రతిపక్ష తీర్థం పుచ్చుకోనున్నారంట. అంతేకాదు వీరి చేరికకు అధనేత జగన్ కు కూడా క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ పార్టీలో లేని వీరు గత కొంతకాలంగా క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఈ క్రమంలో వీరిద్దరిని చేర్చుకోవటం వల్ల ఆయా ప్రాంతాల్లో పార్టీ బలపడటంతోపాటు, వారి రాజకీయానుభవం కూడా పనికి వస్తుందని జగన్ ఆలోచనలో ఉన్నాడంట.  వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2004, 2009 ఎన్నికల్లో వీరు ఎంపీలుగా పదవులు చేపట్టారు. ఆ సమయంలో పార్టీలో వీరిద్దరూ కీలకంగా వ్యహరించటంతోపాటు వైఎస్ ను అంటిపెట్టుకునే ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఒకరు లెక్కలతో చివరి దాకా పోరాటం చేయగా, మరోకరు రాజీనామా తప్పించి ఏమంత యాక్టివ్ గా పాల్గొనలేదు. విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ తరుపున పోటీ చేసి దారుణంగా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి సమైక్యాంధ్ర పార్టీకే కాదు, రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు.

ఇక ఆ ఇద్దరిలో ఒకరు దళిత వర్గానికి చెందిన ఎంపీకాగా, మరోకరు కాంగ్రెస్ ఆప్తుడుగా, ఉత్తమ అనువాదకుడిగా పేరొందిన వ్యక్తి. ఆ మధ్య బహిరంగంగానే జగన్ కి వీరిద్దరు మద్ధతు కూడా ఇచ్చారు. వీరి చేరిక కోసం ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా వ్యవహరించి నేడు వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న నాయకుడి ద్వారానే మంతనాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు వైసీపీలోకి చేరేందుకు వారు కూడా సుముఖత తోనే ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మాజీ లిద్దరూ వైసిపి గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Undavalli Arun Kumar  Harshavardhan  Congress  Ex MPs  YSRCP  Jagan  

Other Articles