రాహుల్ పెళ్లి కబురు | wedding bells for rahul gandhi in august second week

Wedding bells for rahul gandhi in august second week

Congress vice president rahul, rahul Marriage, rahul gandhi marriage, Rahul marriage 2016, Rahul UP brahmin girl, Rahul gandhi fiancy

Congress vice president rahul gandhi may ties the knot with UP brahmin girl.

రాహుల్ పెళ్లి కబురు

Posted: 07/05/2016 11:45 AM IST
Wedding bells for rahul gandhi in august second week

ఐదు పదుల వయసు దగ్గర పడుతున్నా ఇంకా మోస్ట్ ఎలిబిబుల్ బ్యాచ్ లర్ జాబితాలోనే ఊగిసలాడుతున్నాడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఎప్పటి నుంచో తన కొడుక్కును ఓ ఇంటి వాడిని చేద్దామని ప్రయత్నిస్తున్న సోనియాగాంధీకి ఏదో ఒక కారణంతో భంగపాటే ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో  గుట్టుచప్పుడు కాకుండా ఈ యేడాదిలోనే ఆ తంతు పూర్తి చేస్తారని వార్తలు అందుతున్నాయి.

గత నెలలో యూపీ అలహాబాద్ లోని ఆనంద్ భవన్ ను సోనియాగాంధీ సందర్శించింది. అయితే రాజకీయ పర్యటనలో భాగంగానే ఆమె వెళ్లిందని చెప్పినప్పటికీ  పెళ్లి ఏర్పాట్ల కోసమే ఆమె వెళ్లిందని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన బ్రహ్మణ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని వధువుగా ఎంపిక చేశారంట. రాజీవ్ గాంధీకి ఆత్మీయుడైన ఓ వ్యక్తి ఈ వ్యవహారం వెనక ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. యువరాజుకు వివాహం చేయటంతోపాటు అక్కడ అధికంగా ఉన్న బ్రహ్మణ వర్గాల ఓట్లను టార్గెట్ చేయటం, తద్వారా పాగా వేయాలన్నదే కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ ఈ పెళ్లి వార్తలు గనక నిజంగా నిజమైతే ఆగష్టు రెండో వారంలోనే రాహుల్ గాంధీ బ్రహ్మచర్యం ముగిసే ఛాన్స్ ఉంద్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  Vice President  Rahul Gandhi  Sonia  UP  Brahmin  Anand Bhavan  

Other Articles