రావెల కేసులో ‘పవర్ ప్లే’ | Ravela Kishor Babu power play in his sons case

Ravela kishor babu power play in his sons case

Ravela Kishore Babu, Ravela Sushil, Ravela Son, Ravela Sushil Case, రావెల కిషోర్ బాబు, రావెల సుశీల్, రావెల సుశీల్

AP Minister Ravela Kishore Babu used his influence for his son Ravela Sushil case. High Court Judgement cleared that there id no proper proofs in this case.

రావెల కేసులో ‘పవర్ ప్లే’

Posted: 04/27/2016 11:56 AM IST
Ravela kishor babu power play in his sons case

పవర్ ఉండాలే కానీ ఏ పనైనా చకచకాల జరిగిపోతుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. మన ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు ఇంకా బాగా తెలిసిన సిద్దాంతం. మంత్రిగారి కొడుకు రావెల్ సుశీల్. అంతకుముందు ఈయన గురించి ఎవ్వరికీ తెలియదు. కానీ బంజారాహిల్స్‌లో ఓ మహిళను ఈవ్ టీజ్ చేసి, ఆ తర్వాత అదే మహిళను లాగి తన కారులో ఎక్కించుకోవాలని ట్రై చేసిన ఇష్యూలో తెలుగు వాళ్ళందరికీ తెలిశాడు. కట్ చేస్తే హైకోర్ట్‌లో దిమ్మతిరిగే జడ్జ్‌మెంట్ వచ్చింది. సాక్ష్యాలు సరిగా లేనందున సుశీల్‌ ని నిర్ధోషిగా విడుదల చేస్తున్నామని హైకోర్ట్ స్పష్టం చేసింది. గమనించాల్సిన విషయం ఏంటంటే సుశీల్ తప్పు చేయలేదు అని కోర్ట్ చెప్పలేదు. సాక్ష్యాలు లేనందున విడుదల చేస్తున్నాం అని చెప్పింది. ఇక్కడే మంత్రిగారు తన బలం, బలగాన్ని ఎలా వాడారో తెలియచెప్పే విషయాలు కనిపిస్తున్నాయి.

తన, మన బేధం లేకుండా నిస్వార్ధంగా, నిజాయితీగా, రాజ్యాంగం ప్రకారం అని బోల్డన్ని ప్రమాణాలు చేసిన మంత్రిగారు కొడుకు కోసం తన పలుకుబడిని అడ్డేశాడాని చాలా మంది అనుకుంటున్నారు. అందులో మొదటగా బాధితురాలిని మేనేజ్ చేశాడు. మీడియా ముందు…సుశీల్ తప్పు చేశాడు, సుశీల్‌కి శిక్షపడాలి అని నినదంచిన ఆ మహిళ…హైకోర్ట్‌లో మాత్రం సుశీల్ ఎవరో నాకు తెలియదంది. తెరవెనుక ఏం జరిగి ఉంటుందో మీరూ ఊహించగలరు. బలం, బలగం లేని మహిళ కాబట్టి మంత్రిగారికి ఎదురునిలబడలేకోపోయింది అనుకోవచ్చు. మరి పోలీసులు ఏం చేశారు? సిసి టివి ఫుటేజ్‌లో స్పష్టమైన ఆధారం ఉందిగా అంటారా? అవన్నీ తారుమారు కావడానికి ఎంతటైం పడుతుందో చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ఇలా మంత్రిగారి గురించి, మంత్రిగారి కొడుకు గురించి పుకార్లు షికారు చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles