is this chandrababu naidus another Historical mistake..?

Centre downplays ap speccial status is this tdp historical mistake

Tdp chief and andhra pradesh chief minister chandrababu naidu done another historical mistake by joining hands with bjp as centre clears no special status for AP.

చాళుక్య రాజనీతా..? చారిత్రక తప్పిదమా..?

Posted: 05/05/2016 01:06 PM IST
Centre downplays ap speccial status is this tdp historical mistake

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసిన యూపీఏ ప్రభుత్వం, దానికి నేతృత్వం వహించిన కాంగ్రెస్ ను సార్వత్రిక ఎన్నికలకు ముందు తూర్పారబట్టి.. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ స్థానంలో కాంగ్రెస్ గెలుపోందకుండా చేసిన టీడీపీ.. ఆ ఎన్నికలలో బీజేపితో చేతులు కలసి మిత్రపక్షంగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లడంతో మరోమారు చారిత్రక తప్పిదానికి తెరలేపిందా..? అంటే అప్పట్లో కాదని ఆయన పార్టీలు మొండిగా వాదించినప్పటికీ.. ఇప్పుడు ఏపీ ప్రజలు మాత్రం అవును టీడీపీ చేసింది చారిత్రక తప్పిదమనే అంటున్నారు.

గతంలో అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రధానిగా వున్న హాయాంలో ఆ పార్టీకి మిత్రపక్షంగా వుండి కేంద్రంలో చక్రం తప్పిడంలో క్రియాశీలక పాత్ర పోషించిన టీడీపీ.. ఆ తరువాత వచ్చిన  సార్వత్రిక ఎన్నికలలో తాము చారిత్రక తప్పిదం చేశామని, తమ పార్టీకి మైనారిటీలు దూరమైయ్యారని ఇక మరెప్పుడూ అలాంటి పోరబాటు చేయనని చెప్పిన చంద్రబాబు..
దేశవ్యాప్తంగా నమో సమ్మెహన మంత్రంతో ఊగిపోయేసరికి తాను కూడా బీజేపితో చేతులు కలిపి ఎన్నికలలో పోటీ చేశారు. అంతకు ముందు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన అరవింద్ కేజ్రీవాల్ తో చర్చలు జరిపి.. కూడా వారితో కలసివెళ్లేందుకు విముఖత వ్యక్తం చేసిన టీడీపీ బీజేపితో జతకట్టింది.

ఇందుకు యోగా గురు బాబా రాందేవ్ కూడా దోహదం చేసినట్లు అప్పట్లో వారు పలు పర్యాయాలు భేటీ కావడం వెనుక ఇదే అంశం దాగిందన్న అరోపణలు కూడా వినబడ్డాయి. అయితే అప్పటివరకు టీడీపికి కొంత దూరంగా వున్న వెంకయ్యనాయుడు కూడా ఈ విషయంలో చోరవ తీసుకున్నారని, అందువల్లే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ పలుమార్లు పర్యటించారని దీంతోనే టీడీపీ గ్రాఫ్ మారిందని, కాగా దీనికి తోడు పవన్ కల్యాణ్ మద్దతును ప్రకటించడంతో ఇంక ఆ పార్టీకి తిరుగులేకుండా పోయిందన్న వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి.

అయితే పవన్ కల్యాన్ గతంలోనే కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకు ఉద్యమించాలని, పార్లమెంటులో ఏపీ ఎంపీలు ఎందుకు హోదా కోసం నినదించలేకపోతున్నారని పలుమార్లు ప్రశ్నించారు. ఈ విషయంలో రెచ్చిపోయిన ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్రం మాకు ఇది చేస్తుంది, అది చేస్తుందని, పవన్ కల్యాన్ అన్నగారు వ్యాపారం చేయడం లేదా..? మేము వ్యాపారాలు చేస్తే తప్పేంటని ఎదురుదాడికి దిగి.. కేంద్రం ఏపీకి ఎప్పటికీ అన్యాయం చేయదని, ప్రత్యేక హోదా ఇస్తుందని నమ్మబలికారు. ఒకవేళ హోదాను కేంద్రం ఇవ్వని పక్షంలో తామేం చేయాలో తమకు తెలుసునన్నారు.

వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. అనుమానాలను నిజం చేస్తూనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భారీ షాకిచ్చింది. ఏపికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. అంతేకాదు, ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం కోసం నిబంధనలు సడలించలేమని కూడా కేంద్రఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో ప్రశ్నించిన ఎంపీ అవంతి శ్రీనివాస్‌ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి సిన్హా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టంలో లేదని, రెవెన్యూ లోటు అంశంకూడా విభజన చట్టంలో లేదని చెప్పుకొచ్చారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన లేదని కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా స్పష్టం చేశారు.

దీంతో ఇక అంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదని తేలిపోయింది. అయినా అటు కేంద్రంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఎలా కొనసాగుతున్నారు..? రాష్ట్ర ప్రయోజనాల కన్నా టీడీపీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వారి స్వార్థ రాజకీయాలే ముఖ్యమని భావిస్తున్నారా..? అధికారంలోకి వచ్చేంత వరకు హామిలను గుప్పించి.. వచ్చిన తరువాత వాటిని విస్మరించడం నేతలకు వెన్నతో పెట్టిన విద్య అన్న నానుడులను నిజం చేయాలనుకుంటున్నారా..? వాజ్ పాయ్ హాయంలో చక్రం తీప్పానని, కలాంను రాష్ట్రపతికి సిఫార్సు చేసింది కూడా తానేనని చెప్పుకునే చంద్రబాబు.. మరిప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తెచ్చుకోవడంలో ఎందుకు ఆయన వ్యూహాలు ఫలించడం లేదు. చంద్రబాబు ఎందుకు విఫలం అవుతున్నారు.

చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణానికే పూర్తి సమయం కేటాయిస్తున్నారని, ప్రజల కష్టాలను తీర్చడం లేదని, రాష్ట్రంలో పేద, బడుగు వర్గాల ప్రజలను పట్టించుకోవడం లేదని, అసలు ప్రజాహిత కార్యక్రమాలే చేపట్టడం లేదని విపక్షం విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలో అన్నింటికన్నా ముఖ్యమైన ప్రత్యేకహోదాను కూడా టీడీపీ పట్టించుకునే పనిలో లేదు. ప్రత్యేక హోదా కావాలని, అప్పుడే తమ రాష్ట్రం బాగుపడుతుందని తిరుపతిలో కాంగ్రెస్ తలపెట్టిన సభను సాక్షిగా మలుచుకుని స్థానిక కాంగ్రెస్ నేత ఒంటిపై పెట్రోలు పోసుకుని మరణించినా.. ప్రభుత్వాలకు పట్టదా..? ఆ తరువాత రాష్ట్రం నలమూలలా ప్రత్యేక హోదా బడబాగ్ని రగలడం పలువురు  యువకులు ప్రత్యేకహోదా డిమాండ్ ను కేంద్రం తీర్చాలని కొరుతూ ఆత్మార్పణలు చేసినా.. వారి ప్రాణత్యాగాలకు విలువ లేకుండా చేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

అప్పటికప్పుడు ప్రత్యేకహోదా వేడిని చల్లార్చడానికి యువకులు ఆత్మహత్యల దిశగా వెళ్లనీయకుండా ఈ అంశాన్ని నీతి అయోగ్ పరిధికి అప్పగించామని, వారే ఈ అంశంపై పరిశీలించి న్యాయం చేస్తారని కేంద్రమే చెప్పింది. ఇప్పడదే కేంద్రం విభజన చట్టం ప్రకారం ఏపీకి అవసరమైనంత మేరకు ప్రత్యేక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. నీతిఆయోగ్‌ సిఫార్సులకు అనుగుణంగా ఏపీకి నిధులు మంజూరు చేస్తామన్నారు. కానీ ప్రత్యేక హోదా మాత్రం కుదరదని ఏకపక్షంగా చెప్పేసింది.

యూపీఎ హయాంలో పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా నిధులు, కేంద్ర ప్రభుత్వ విద్యా, వైద్య సంస్థలు, యూనివర్శిటీలు, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాలు మాత్రమే ఇవ్వగలమని తేల్చిచెప్పింది. అంటే యూపీఏ చెప్పిందే చేస్తాం కానీ, ప్రత్యేక హోదా విషయంలో తమకంటూ ఒక దిశానిర్ధేశం లేదని తేల్చేసింది కేంద్రం. తమ విపక్ష పార్టీ ప్రభుత్వాని కూల్చేస్తామని సవాల్ చేసిందని విపక్షపార్టీ ఎమ్మేల్యేలను వలసలకు తెరతీసని చంద్రబాబునాయుడు.. మరి కేంద్రంలోని బీజేపి సర్కార్ హోదా ఇవ్వనంటూ చెంపపెట్టులాంటి నిర్ణయాన్ని వెలువరించిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్తారో.. ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి..

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  andhra pradesh  special status  union government  PM modi  BJP  TDP  Pawan Kalyan  

Other Articles