Vijay Mallya leaves Diageo: Sweet Rs 500 crore deal shames banks, politicians

Vijay mallya walks away with 75mn

Vijay Mallya, United Spirits, Shriram Subramanian, diageo, Kingfisher Airlines, IPL, UB Group, Siddharth Mallya

United Spirits shares surged as much as 6 per cent on Friday following the resignation of its Chairman Vijay Mallya from the company's board.

రెక్కల గుర్రం ఎగిరిపోతుందా..? లేక జారుకుంటుందా.?

Posted: 02/26/2016 03:18 PM IST
Vijay mallya walks away with 75mn

తాను నిర్మించుకున్న సామ్రాజ్యం వర్ధిల్లి తన తరాలతరాల వరకు నిలిచివుండాలని అందరూ భావిస్తుంటారు. ఇందుకోసం ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారు. ఏదైనా సాధించడం సులభమే కానీ సాధించిన స్థానంలో కొనసాగడమే క్లిష్టమని, అందుకనే ప్రతీ అడుగు అచితూచి వేస్తూ నిలదొక్కకుంటారు. తాను స్థాపించిన సామ్రాజ్యం తానే తన చేతులతో కూల్చుకున్న వ్యక్తిగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, యూబి గ్రూప్ అధినేత విజయ్ మాల్యా నేటి సమాజానికి నిలువెత్తు ఉదాహరణగా వుండిపోయాడు.

తన ఎయిర్‌లైన్స్ కోసం పలు బ్యాంకుల నుంచి రుణాలను పోంది ఉద్దేశపూర్వక ఎగవేతదారు ఆరోపణలు ఎదర్కోంటున్న విజయ్ మాల్యా యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. బ్యాంకులను ముంచేసి ఎంచక్కా విదేశాలలో సెటిల్ అవుతున్న కార్పోరేట్ దిగ్గజం మాల్యా. వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకుల నుంచి తీసుకుని, ఆపై వాటిని చెల్లించకుండా, ఇప్పుడు కంపెనీనే కాదు... దేశాన్ని కూడా వదిలి వెళ్లిపోతున్నాడు. కంపెనీలో తన వాటాను 75 మిలియన్ డాలర్లకు (అంటే దాదాపు రూ. 515 కోట్లుకు) అమ్ముకుని బ్రిటన్ కు వెళ్లిపోతున్నాడు.

ఇంతవరకు బాగానే వున్నా అసలు ప్రశ్న ఇక్కడే మొదలైంది. మాల్యా ఆయన సంస్థలకు రుణాలుగా వేల కోట్ల రూపాయలు ఎవరు చెల్లిస్తారు. మాల్యాను, ఆయన వ్యాపారాన్ని నమ్మి.. వేల కోట్ల రూపాయల ప్రజాదనాన్ని ఇచ్చిన బాంకులకు అప్పులను తిరిగి చెల్లించేదెవరు. భారత్ లో వుండగానే ఆయనను సునాయాసంగా వదిలేశారు. ఇక ఆయన బ్రిటెన్ కి వెళ్లి అక్కడే స్థిరపడితే.. ఆయనను ఎవరు తీసుకురాగలరూ..? ఆయన చేత రుణాలను ఎలా కట్టించగలరన్న ప్రశ్నలు వినబడుతున్నాయి.

ఆయన తాకట్టు పెట్టుకున్న ఆస్తులను వేలం వేసినా రికవరీ 10 శాతం కూడా రాదన్నది ఓ అంచనా. ఈ నేపథ్యంలో రూ. 500 కోట్లు తీసుకుని మరీ దేశం దాటుతున్న మాల్యాను ఆపేదెవరు? ఆయన్ను దేశం దాటనీయవద్దని ఒక్క బ్యాంకు కూడా ఫిర్యాదు చేయదేం? సామాన్యులు వేల సంఖ్యలో, లక్షల్లో తీసుకున్న రుణాలకు రికవరీ ఏజెంట్లను పంపి.. ముక్కు పిండి వసూలు చేయించడం, మరీ మొండికాయిలు అయితే బ్యాంకులు రౌడీ ముకలను కూడా పంపించి మరీ వసూళ్లు చేస్తున్నారు. మరీ మాల్యా లాంటి కార్పోరేట్ దిగ్గజాన్ని ఏ బ్యాంకు ఏమనకపోవడంలో అంతర్యమేమిటో..?

విలాసవంతమైన జీవితాన్ని, వయస్సు పెరిగే కొద్ది చిన్న చిన్న మోడళ్లతో క్యాలెండర్ లు తీయడం.. వారితో లగ్జరీ జీవితాన్నే అనుభవించిన మాల్యాను ఎవరు నిలువరించాలి..? నెలల తరబడి వేతనాలు అందక ఆత్మహత్యలు చేసుకున్న మాల్యా కంపెనీ కార్మికులకు పరిహారం ఎవరివ్వాలి.? మూతపడ్డ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లో అయితే, ఇప్పటికీ ఉద్యోగులకు జీతాల బకాయిలు అందాల్సి వుంది..? తన మోసపూరిత చర్యలతో భారత బ్యాంకింగ్ వ్యవస్థను, ఉద్యోగులను మోసం చేసిన మాల్యా దేశం నుంచి ఎగిరిపోతున్నారా..? లేక జారుకుంటున్నారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kingfisher Airlines  Vijay Mallya  IPL  UB Group  

Other Articles