trs mla vinay bhaskar discontent over party new joinings

Trs senior leaders revolt against party chief decision in new joinings

trs mla, vinay bhaskar, Discontent, TRS party, new joinings, warangal district, basaraju saraiah, trs snior leaders, revolt against party chief new joinings, trs leaders revolt

telangana ruling party trs face revolt from party senior leaders, as party chief is encouraging new joinigs, discontent over new joinings mla vinay bhasker is hiding from party chief.

టీఆర్ఎస్ లో తిరుగుబాట్లు.. అజ్ఞాతంలోకి సీనియర్ నేతలు

Posted: 02/24/2016 12:38 PM IST
Trs senior leaders revolt against party chief decision in new joinings

తెలంగాణలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇబ్బందులను కొన్నితెచ్చుకుంటుందా అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికలలో విజయదుంధు:భి మ్రోగించిన పార్టీ.. ఇంతకు మునుపెన్నడూ పోటీ చేయని గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక మండలి ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేని మెజారిటీ సాధించిన పార్టీకి ఇబ్బందులా..?. అవును నిజంగా ఇబ్బందులే. అవి కూడా స్వయం కృపారాధాలేనన్న వాదనలు కూడా వినబడుతున్నాయి.

గ్రేటర్ ఎన్నికలలో అనుభవం లేకున్నా ఏ వార్డు నుంచి ఏ అభ్యర్థి విజయం సాధిస్తారన్న అంచనాలతో ఆయా అభ్యర్థులను తమ పార్టీ తరపున టిక్కెట్లను ఇచ్చి ఆ ఎన్నికలలో నల్లేరుపై నడక రీతిలో విజయాన్ని సాధించిన టీఆర్ఎస్ తజాగా వరంగల్ కార్పరేషన్ ఎన్నికలు మాత్రం ఇబ్భందులను తెచ్చిపెడుతున్నాయి. అక్కడ కూడా గ్రేటర్ హైదరాబాద్ తరహా ఫార్ములాతో రాణించాలనుకుంటున్న టీఆర్ఎస్ కు సోంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు తల్లెత్తనున్నాయి. కార్పోరేషన్ ఎన్నికలలో ఇతర పార్టీల నేతలను పార్టీలలోకి ఆహ్వానిస్తూ.. వారికి పెద్దపీట వేయడంతో పార్టీ అవిర్భావం నుంచి వున్న తమను ప్రాధాన్యం నశిస్తుందని పార్టీ సీనియర్ నేతలు అలకూనుతున్నారు.

పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తమను కాదని, ప్రత్యర్థులను ఎందుకు ప్రసన్నం చేసుకుంటున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే పార్టీ ప్రస్తుతం అధికారంలో వుంది కాబట్టి.. ఎవ్వరూ ధైర్యంగా ధిక్కంరించే ధైర్యం చేయలేక పోతున్నారు. అయితే వారిలో అసంతృప్తి మాత్రం రగులుతుంది. కాగా వచ్చే ఎన్నికల నాటికి ఇది తారాస్థాయికి చేరడంతో పాటు అప్పడు టిక్కెట్లు రానీ నేతలు కూడా రెబెల్స్ రాగం అందుకుంటే.. ప్రస్తుతం బలంగా దూసుకెళ్తున్న పార్టీకి బీటాలు వారే ప్రమాదముందన్న వాదనలు వినబడుతున్నాయి.

తాజాగా వరంగల్ వెస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అసంతృఫ్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీలోకి వరుస చేరికలతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని ఆయన ఆవేదన చెందినట్లు సమాచారం. కార్పొరేషన్ టికెట్ల విషయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని వినయ్ భాస్కర్ సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకరరావు, తాజాగా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trs mla  vinay bhaskar  Discontent  TRS party  new joinings  warangal district  basaraju saraiah  

Other Articles