negitive influence on danam political career

Danam nagenders political career in dilemma

Danam Nagendar, Danam TRS, Danam joins TRS, Danam dilemma, Danam congress, Danam PJR, Danam keshava Rao, Danam P.Janardhan Reddy, Danam KK, Danam uttam kumar reddy, KCR condition to Danam to join TRS, Telangana news

Danam Nagendar in dilemma on whether to join TRS or to continue in congress even after officially declaring that he is going to join TRS as KCR had put a rare condition on the leader

దానం రాజకీయ భవిష్యత్ పై ‘కారు’మబ్బులు..?

Posted: 12/07/2015 10:56 AM IST
Danam nagenders political career in dilemma

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్ పై ‘కారు’మబ్బులు అలుముకోనున్నాయా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా వుంటున్నా ఆయన ఫార్టీల ఫిరాయింపులతో తన రాజకీయ భవిష్యత్ పై ‘కారు’ మేఘాలు అలుముకునేలా చేసుకుంటున్నారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పలుమార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన తరువాత అమాత్యులుగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అలాంటి మరోమారు పార్టీ మారి.. అపఖ్యాతిని మూటగట్టుకుంటారా..? అని ఆయన అనుచరగణం అందోళన చెందుతున్నారు.

ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలైన దానం.. ఒకనాటి తన రాజకీయ గురువైన స్వర్గీయ పి.జనార్థన్ రెడ్డి తరహాలోనే మంచి మాస్ లీడర్ గా ఎదిగారు. ఇప్పటికీ అయనకు ఫిల్మనగర్, దేవరకోండ బస్తీ, ఖైరతాబాద్, ఎన్ బి టీ నగర్ బస్తీ సహా పలు బస్తీలలో తనకు పట్టువుంది. అయితే ఎన్నికలంటేట గెలుపోటములు సహజం. దీనికి తోడు అధికారంలో వుండగా, అందులోనూ మంత్రిగా వుండగా చేసిన పలు తప్పిదాలు ఆయనకు ఏకు మేకుగా తయారవుతున్నాయి. అదే ఇప్పుడు అయనను అధికార పార్టీలోకి వెళ్లనీయకుండా చేస్తుందని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న క్రమంలో.. అప్పట్లో మంత్రిగా వ్యవహరిస్తున్న దానం నాగేందర్ నివాసాన్ని ముట్టడించేందుకు వచ్చిన తెలంగాణ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా వారికి కర్రలతో కొట్టి మరి తరిమివేశారు. కాగా ఇప్పుడు అధికారం కోసం ఆ పార్టీలోకి చేరుతానంటే.. అంగీకరించిన టీఆర్ఎస్.. ఆ కార్యక్రమానికి మాత్రం తాను హాజరుకానంటూ కేసీఆర్ తేల్చిచెప్పినట్లు సమాచారం. తెలంగాన వాదులను, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలను తరిమికోట్టిన దానంను టీఆర్ఎస్ ఎలా చేర్చుకున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని ఆయన ముఖం చాటేవేశారని తెలుస్తుంది.

దీనికి తోడు కాంగ్రెస్ లో వుండగా తనతో పోసగని నేత కే కేశవరావు సమక్షంలో దానంను పార్టీలో చేరమని కేసీఆర్ సూచించారు. అంతేకాదు.. తన రాజకీయ గురువైన స్వర్గీయ పిజేఆర్ పైన కూడా బీజి బలంలో విమర్శలు చేసి హాట్ టాపిక్ గా మారాడు దానం. అయితే పీజేఆర్ కేసీఆర్ కు అప్తుడు. ఇలా అన్ని ఏకమై దానం వస్తే పార్టీలోకి ఒక సాధారణ నేతగా రావాల్సిందే తప్ప, గతంలో కాంగ్రెస్ లో వెలగబోట్టిన వైభోగం మాత్రం లేదని సుస్పష్టం అయ్యింది, దీంతో ఎటూ తేల్చుకోలేని దానం మళ్లీ కాంగ్రెస్ గూటిలోనే కొనసాగేందుకు మార్గం సుమగం చేసుకుంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Danam Nagendar  TRS  KCR  Telangana news  

Other Articles