Will Damodara Rajanarasimha join into TRS

Will damodara rajanarasimha join into trs

Congress, Damodara Rajanarasimha, TRS, KCR, Kiran Kumar reddy, Harish Rao, Medak

Congress senior leader, Former Deputy cm Damodara Rajanarasimha may join into TRS Soon. a hot gossip trending in political sector.

గులాబీ గూటికి దామోదర రాజనర్సింహ?

Posted: 12/08/2015 11:35 AM IST
Will damodara rajanarasimha join into trs

నిన్న అన్నది.. ఎందుకంటే గడిచింది. గతంలో మేం అధికారంలో ఉన్నాం అన్నా ఎవ్వురూ లెక్కచెయ్యరు ఎందుకంటే ప్రస్తుతం లేరు కాబట్టి. అయితే అధికారపార్టీలో ఎలాగైనా స్థానం సంపాదించి పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని రాజకీయాలు చేస్తుండటం మామూలే. అయితే తాజాగా ఓ పెద్దాయన పేరు కూడా ఇందులో ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన.. ఒక్క వివాదం కూడా లేని దళిత నేత దామోదర రాజనర్సింహ. అవును ఈయన కూడా తాజాగా రాజకీయాలు చేస్తున్నారట అందులో భాగంగా పార్టీ మార్చి.. మరోసారి పవర్ కు దగ్గరవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కిరణ్ కుమార్ రెడ్డికి డిప్యూటీగా పనిచేసిన దామోదర రాజనర్సింహ కారెక్కుతారని వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ లో క్రియాశీలంగా లేరు. పార్టీ కూడా ఆయన్ను పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలంగాణ పీసీసీగా పనిచేసిన పొన్నం కానీ ప్రస్తుత చీఫ్ ఉత్తమ్ కానీ దామోదరను ఏమాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు. దీంతో ఆయన పార్టీని వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దామోదర రాజనర్సింహను టీఆర్ ఎస్ లోకి తీసుకురావడానికి మంత్రి హరీశ్ రావు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట.

 మెదక్ జిల్లాకు చెందిన రాజనర్సింహతో మంత్రి హరీశ్ రావుకు మొదటి నుంచి మంచి సంబంధాలే ఉన్నాయి. టీఆర్ ఎస్ విపక్షంగా ఉన్నప్పుడు సిద్దిపేటకు చెందిన పనులను రాజనర్సింహ ద్వారానే హరీశ్ చక్కబెట్టుకునే వారని… ఆయన నుంచి వచ్చిన ఏ ప్రతిపాదనకైనా అప్పట్లో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఓకే చెప్పేవారని కొందరు నేతలు అంటుంటారు. అదేవిధంగా ఇప్పుడు రాజనర్సింహకు సంబంధించిన పనులను టీఆరెస్ ప్రభుత్వంలో పూర్తిచేయించడంలోనూ హరీశ్ సహకారం ఉంటోంది. ఈ కారణంగానే ఆయనను పార్టీలోకి రప్పించే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్… హరీశ్ రావుకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే రాజనర్సింహ గులాబీ కండువా కప్పుకోవడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  Damodara Rajanarasimha  TRS  KCR  Kiran Kumar reddy  Harish Rao  Medak  

Other Articles