Will Danam Nagender give hand to congress party

Will danam nagender give hand to congress party

Danam, Danam Nagender, TRS, Congress, KCR, GHMC, GHMC Elections

TRS Party leader trying to inculde Ex Minister danam Nagender into their party. In the GHMC eelctions may TRS will get green singal from Danam.

కాంగ్రెస్ కు దానం హ్యాండిస్తారా..?

Posted: 10/28/2015 04:04 PM IST
Will danam nagender give hand to congress party

దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలని ఓ సామెత ఉంది. అలాగే ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు టిఆర్ఎస్ నాయకులు. తమ పార్టీలోకి ఎంత మందిని వీలైతే అంత మందిని చేర్చుకునేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే రాజ్యసభ పభ్యురాలు గుండు సుధారాణి చేరిక దాదాపు ఖరారైంది. దిల్లీలో కేపీఆర్ ను గుండు సుధారాణి కలవడం కూడా జరిగిపోయింది. కాగా వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్‌కు టీఆర్‌ఎస్ తెర లేపింది. కలిసొచ్చే నేతలను కారెక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. టీఆర్‌ఎస్ ఆకర్ష్‌కు టీడీపీ ఎంపీ గుండు సుధారాణి కారెక్కేందుకు నిర్ణయించుకోగా, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, పుల్లా పద్మావతితో పాటు మరికొందరు నేతలు కారెక్కడానికి క్యూలో నిల్చున్నట్లు సమాచారం.

వరంగల్ బరితో ఎన్డీయే కూటమి తరఫున అభ్యర్థిని పోటీలో నిలుపుతున్నట్లు తెలుగుదేశం పార్టీ, బిజెపి పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. దాంతో టిఆర్ఎస్ కొత్త ప్లాన్ వేసింది. అందులో భాగంగా వేరే పార్టీల్లో కాస్త పేరున్న నాయకులతోనే కాకుండా, సెకండ్ క్యాడర్ నేతలకు కూడా టీఆర్‌ఎస్ గాలం వేస్తోంది. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే దానం నాగేందర్‌ను తమలో కలుపుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు దానంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నిన్నామొన్న వరకు హరీష్‌రావు ఈ ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతను నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం మంత్రులు కూడా ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. ప్రధాన పార్టీలలో పేరున్న నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఎదుటి పార్టీల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి టీఆర్‌ఎస్ జోరుగా పావులు కదుపుతోంది. మరి చూడాలి దానం కారెక్కుతారో లేదో..?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Danam  Danam Nagender  TRS  Congress  KCR  GHMC  GHMC Elections  

Other Articles