bjp mp ticket for ex trs member in by election

Bjp focuses on other party leader to contest in warangal by elections

bjp focuses on other party leader, warangal by elections, chintha swamy, bjp, by election, jagga reddy, jaya prakash reddy, medak by election, narendra modi, kishan reddy, amit shah,

bjp again focusing on other party leader, instead of own party leaders to contest in warangal by elections, willing to give ticket for ex trs member

అరువు అభ్యర్థులకే బీజేపి వరంగల్ టిక్కెట్..?

Posted: 11/02/2015 04:44 PM IST
Bjp focuses on other party leader to contest in warangal by elections

కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ.. బీజేపికి తెలంగాణలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో నేతలు కరువయ్యారా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. మిత్రపక్షం టీడీపీతో సయోధ్య కుదర్చుకుని వరంగల్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపి.. తమ అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. ఇటీవల జరిగిన మెదక్ జిల్లా ఎన్నికలలో అవలంభించిన దోరణినే రానున్న వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలోనూ అచరించాలని బిజేపి భావిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

వరంగల్ ఉపఎన్నికల. బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థి విషయమై సస్పెన్స్ కొనసాగిస్తున్న బీజేపి... ఈ వ్యవహారం ఇప్పటి వరకు ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. పరాయి పార్టీలో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న అభ్యర్థులకు గాలం వేసే పనిలో నిమగ్నమైన రాష్ట్ర బిజేపీ నేతలు.. ఇంకా తమ అభ్యర్థి ఎవరన్నది మాత్రం స్పష్టం చేయలేదు. ఓ వైపు ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియను చేపట్టి.. ప్రచారంలో నిమగ్నం అవుతున్నా.. ఇంకా బీజేపి మాత్రం అభ్యర్థి పేరు ప్రకటనపై మీనమేషాలు లెక్కిస్తుంది.

ఇటీవల జరిగిన మెదక్ పార్లమెంటరీ నియోజవర్గ ఉప ఎన్నికలో పరాయి పార్టీలకు చెందిన నేతలకు టిక్కెట్ ఇచ్చి చేతులు కాల్చుకున్న బిజేపి.. మరో సారి కూడా అదే పంథాను అనుసరించనుంది. ఇప్పుడు కూడా ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ దేవయ్య, మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్, స్థానికంగా ప్రముఖుడైన డాక్టర్ రాజమౌళి పేర్లపై పార్టీలో ఓవైపు చర్చ జరుగుతుండగానే తాజాగా మరో ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. టీఆర్‌ఎస్‌లో వివిధ స్థాయిల్లో పనిచేసి గతంలోనే ఆ పార్టీని వీడిన చింతా స్వామి, పోలీసు అధికారి నాగరాజునూ అభ్యర్థిగా ప్రకటించే అంశంపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు.  కాగా దీంతో దేవయ్య లేదా స్వామిలలో ఒకరిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మెదక్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని అహ్వానించి.. టిక్కెట్ ఇచ్చినా.. ఆయన మూడో స్థానానికి మాత్రమే పరిమితం కావడం.. దీంతో ఇక్కడ కూడా బిజేపి అభ్యర్థి గెలుపుపై సందేహాలు వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chintha swamy  bjp  by election  

Other Articles