ఎన్నికలకు ముందు ఎన్నో చిత్రాలు జరగుతుంటాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు ఓటర్ల మనోగతాలను మార్చివేస్తుంటాయి. అయితే తాజాగా ఎన్నికలు జరగనున్న బీహార్ లో కూడా అదే జరుగుతోంది. నిన్నటి దాకా అటో.. ఇటో అన్నట్లున్న బీజేపీ పార్టీ భారీ పుంజుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలివిడత పోలింగ్ మొదలు కావడానికి ఇక ఐదురోజులే ఉన్న తరుణంలో కీలక సర్వేసంస్థలు జరిపిన సర్వేలో బీహార్ లో బీజేపీ ప్రభంజనం సాగుతోందని స్పష్టమైంది. లోక్ నీతి- సీఎస్ డీఎస్ చివరి నిముషంలో నిర్వహించిన సర్వే ప్రముఖపత్రిక ప్రచురించింది. బీజేపీ-ఆధ్వర్యంలోని నాలుగు పార్టీల కూటమి ఎన్నికల రేసులో ప్రత్యర్థికన్నా కన్నా నాలుగు శాతం పాయింట్లతో ముందంజలో ఉంది. సర్వేలో బీజేపీ కూటమి 42 పాయింట్లు పొందగా జేడీయూ- ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి 38 పాయింట్లతో వెనుకబడి ఉందట. ఇది బీజేపీ కూటమికి కాస్త పైచేయే కానీ, ప్రారంభదశలో నాలుగు శాతం తదుపరి దశల్లో మారే ప్రమాదమూ ఉంది. అక్టోబర్ 12న 49 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల్లో విజయం పై ఏపార్టీకి ఆపార్టీ ధీమాతో ఉన్నాయి.
ఐదు దశల పోలింగ్ కు ఇది ఆరంభమే అయినా గుర్తించాల్సిన కీలక పరిణామం ‘ప్రభంజనం’. ప్రభంజనంతో వచ్చే ఫలితాలు కచ్చితంగా స్పష్టమైన మెజారిటీని తెచ్చిపెడతాయి. అయితే భవిష్యత్ లో జేడీయూ – ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి కాస్త పరమిత స్థాయిలో ప్రభంజనం సృష్టించే అవకాశాలు లేకపోలేదు. ఆ దశలో ఇప్పటివరకూ ఏ కూటమి పక్షాన నిర్ణయం తీసుకోని ఓటర్లు విజేతను నిర్ణయిస్తారు. యూపీలో 2012లో అఖిలేశ్ యాదవ్ కు ప్రయోజనం కల్గించింది ఈ ఓటర్లే. బీఎస్పీ కన్నా ఓట్లలో 3 శాతం ఎక్కువసాధించి అఖిలేశ్ గద్దెనెక్కాడు. లాలూ- నితిశ్ ప్రభుత్వం మరింత మెరుగ్గా ఉంటుందని చివరి క్షణంలో ఓటర్లు భావిస్తే మాత్రం నితీష్ కుమార్ కు కలిసి వస్తుంది. మొత్తానికి బీజేపీ పార్టీకి ఇది తీపి కబురే. బీహార్ లో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం అందరి కన్నా ఎక్కువ సంతోషించేది మాత్రం నరేంద్ర మోదీనే ఎందుకంటే తనను ముందు నుండి వ్యతిరేకిస్తు వచ్చిన నితీష్ కుమార్ కు చెక్ పడుతుంది కాబట్టి. మరి ఏం జరుగుతుందో.. బీహార్ ఓటర్లు ఏం నిర్ణయిస్తారో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more