bihar polls: questions raise on bjp poll promise, scooty with petrol free for girl students..?

Is this the secret beyound bjp election promise

Bihar Polls 2015, questions on driving licence age, riding scooty without licence, driving licence age of the girl students, bjp bihar polls promise raises questions, BJP free petrol for scooty, Free petrol for girls in Bihar, bihar elections, scooty with petrol free, students in bihar, BJP election promise, bihar elections Latest news

BJP Bihar poll promise to give scooty and provide free petrol to 5,000 meritorious girls passing class X and XII examinations raises questions on driving licence age of the girl students

బీజేపీ ఫ్రీ ప్రకటన వెనుక రహస్యం ఇదేనా..?

Posted: 10/07/2015 03:30 PM IST
Is this the secret beyound bjp election promise

బిహార్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో విజయాన్ని అందుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఎన్డీయే కూటమి.. మరో ప్రజాకర్షక హామీని ప్రకటించి.. ఇరాకాటంలో పడిందా..? లేక వ్యూహాత్మకంగానే దీనిని ప్రకటించిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ ఎన్నికలల పోరులో గెలుపు కోసం హామీలను గుప్పించడం తప్పులేదని భావిస్తున్న పార్టీలు.. తాము అధికారంలోకి వస్తే అరచేతిలో వైకుంఠాన్ని చూపెడతామని హామీలు గుప్పించడం మామూలే.

అయితే కేంద్రంలో కోలువుదీరిన నరేంద్రమోడీ ప్రభుత్వం ఈ తరహా హామీలను గుప్పించడం.. షరామామూలుగానే మారిందన్న విమర్శలు వినబడుతున్న తరుణంలో విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను టార్గెట్ గా చేసుకుని హామీలను గుప్పించింది. బీహార్ లో తాము అధికారంలోకి వస్తే పది, పన్నెండో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5,000 మంది విద్యార్థినులకు స్కూటీలను ఇస్తామని ఇదివరకే ప్రకటించిన ఎన్డీయే కూటమి.. ఇప్పుడు వారికి రెండేళ్ల వరకు ఉచితంగా పెట్రోల్ సౌకర్యాన్ని కూడా కల్పించనుంది.

గతంలో ఢిల్లీ ఎన్నికలలో తాము అధికారంలోకి వస్తే దేశరాజధానికి రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పిన బిజేపీ.. తాము ఓటమి పాలవ్వడంతో ఆ హామీ గురించి పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఇక ఆంధ్రప్రదేశ్, బీహార్ లకు ప్రత్యేక హాదా కల్పిస్తామని చెప్పిన బిజేపీ.. సరిగ్గా ఎన్నికల ముందర ప్యాకేజీని ప్రకటించి.. ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాన్ని చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పన హామీపై ఏడాదిన్నరగా మీనమేషాలు లెక్కిస్తూ.. తప్పిదాన్ని అంతకుముందు అధికారంలో వున్న యూపీఏ ప్రభుత్వం వేసింది. యూపీఏ ప్రభుత్వం ప్రత్యకహోదా అంశాన్ని పునర్విభజన బిల్లులో జోడించలేదని చేతులెత్తెసింది. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో కమిటీని వేసి పరిశీలిస్తుంది..

ఇక బీహార్ ఎన్నికలలో విద్యార్థినులకు ఇచ్చిన హామీ కూడా రమారమి ఇలాంటి అనుమానాలనే రేకెత్తిస్తుంది. అత్యత్తమ ప్రతిభ కనబర్చిన పది, పన్నెండు విద్యార్థినులకు స్కూటీలను బహుమతిగా ఇస్తామని చెప్పిన బీజేపి వారికి రెండేళ్ల పాటు పెట్రోలును కూడా ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అయితే విద్యార్థినులు పదో తరగతి ఉత్తీర్ణుత సాధించే విద్యార్థినులు అవరేజ్ గా 14 ఏళ్ల వయస్సుంటారు. లేదంటే పదిహేనేళ్ల వయస్కులై వుంటారు. ఇక పన్నెండో తరగతి ఉత్తీర్ణత సాధించే వారు 16 నుంచి 17 వయస్సువారై వుంటారు. అంటే వీరు స్కూటీలు నడపేందుకు అనర్హులు. అదెలా అంటారా..?

పద్దెనిమిదేళ్లు నిండితే కానీ విద్యార్థినీ విద్యార్థులకు టూవీలర్ డ్రైవింగ్ లైన్సెన్సు తీసుకునేందుకు అర్హులు కాదు. అంటే.. ఇక పది, పన్నెండు ఉత్తీర్ణులైన విద్యార్థినులకు స్కూటీలు.. రెండేళ్ల పాటు పెట్రోల్ ఉచితంగా ఇవ్వడానికి ఆ రాష్ట్ర రవాణ శాఖ అనుమతి నిరాకరిస్తుంది. దీంతో రవాణా శాఖను అడ్డుగా పెట్టుకుని.. రేపటి నాటికి ఎన్నికలలో విజయాన్ని సాధించినా.. బీజేపి స్కూటీ, పెట్రోల్ హామీగానే మిగులుతుంది తప్ప.. ఆచరణకు నోచుకోదన్నది వాస్తవం. లేక అధికారంలో వున్న కేంద్రం ద్విచక్ర వాహనాలను నడిపేందుకు వయస్సును రెండు నుంచి మూడేళ్లు తగ్గిస్తే మాత్రం ఇది అమలు అవుతుంది. మరి ఈ హామీని బీజేపి పార్టీ ఎలా అమలుపరుస్తుందన్నది వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar elections  scooty with petrol free  students in bihar  BJP election promise  

Other Articles