Pawan Kalyan Protest in Tamilnadu

Pawan kalyan to fight for telugu people rights in tamilnadu

Pawan Kalyan, Pawan Kalyan to fight for Telugu rights in Tamilnadu, Pawan tamilnadu telugu people, Pawan Kalyan latest news, AP news

Pawan Kalyan is getting ready to fight against the Tamilnadu government for the welfare of the Telugu people in Tamilnadu.

తమిళనాట ప్రశ్నించనున్న పవన్ కళ్యాణ్..?!

Posted: 09/16/2015 01:34 PM IST
Pawan kalyan to fight for telugu people rights in tamilnadu

పవర్ కోసం కాదు ప్రశ్నించడానికి అంటూ జనాల గళాలకు సరికొత్త గొంతుకగా వచ్చిన పవన్ కళ్యాణ్ తన విధిని నిర్వర్తించేందుకు సిద్దమవుతున్నారు. తెలుగు వారు ఎక్కడున్నా వారి యోగక్షేమాలు తనకు ఎంతో ముఖ్యమని పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేన పార్టీని స్థాపించేపుడే అన్నారు. అది తెలంగాణ లేదంటే ఏపి లేదంటే దేశంలోని మరే ప్రాంతమైనా కానీ తెలుగు వారు ఎక్కడున్నా కానీ వారి కోసం తాను ముందుంటానని అన్నారు. తెలుగుజాతి ఎక్కడున్నా కానీ వెలుగులు పంచాలని.. అందరికి సంక్షేమాన్ని కోరుతున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పటికే ఏపిలో జరిగిన భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా తన నిరసన గళాన్ని వినిపించి ప్రభుత్వం నొమ్ములు విరిచిన పవన్ తాజాగా తన పరిధిని మరింత విస్రృతం చేసినట్లు కనిపిస్తోంది. ఇక తెలుగునాట మాత్రమే అన్న పదానికి స్వస్తి చెప్పి తమిళనాట పోరాటానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ తమిళనాట పవన్ కళ్యాణ్ ఏం చెయ్యబోతున్నారో తెలుసా..?

తమిళనాడులో తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయంపై జనసేన అదినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించబోతున్నారని కదనాలు వస్తున్నాయి.తమిళనాడులోని హోసూరులో ఆయన ఒక రోజు ధర్నా చేయవచ్చని సమాచారం. నిర్బందంగా తమిళం చదవాలన్న జిఓ కారణంగా మైనార్టీ భాషల విద్యార్ధులు వారి మాతృభాషలో చదువుకునే అవకాశం కోల్పోతున్నారని అక్కడి తెలుగు సంఘాలు వాపోతున్నాయి.దీనిపై తమిళనాడు తెలుగు యువశక్తి ఆద్వర్యంలో హైదరాబాద్ లో దర్నా కూడా జరిగింది.ఈ నేపద్యంలో పవన్ కళ్యాణ్ స్పందించి ధర్నాలో పాల్గొంటారని చెబుతున్నారు. హోసూరు ప్రాంతంలో తెలుగువారు ఎక్కువ ఉంటారు. కాగా ఈ సమస్యపై ముఖ్యమంత్రి జయలలితను కూడా పవన్ కలుసుకునే ప్రయత్నం చేయవచ్చు.ఈ విషయంలో జయను లేదా ప్రభుత్వాన్ని విమర్శించకుండా వ్యవహరిస్తారని తెలుస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇక తమిళనాడు లో కూడా ప్రశ్నిస్తారు అన్నది క్లీయర్ గా అర్థమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  Tamilnadu  AP news  

Other Articles