Revanth Reddy as New TTDP boss

Is it all set for the revanth reddy as the telangana tdp new boss

Revanth Reddy, Errabelli Dayakar Rao, TTDP, TDP, Chnadrababau Naidu

Is it all set for the Revanth Reddy as the telangana TDP new boss. TDP Party did IVRS for the choose TTDP boss.

తెలంగాణ టిడిపి బాస్ గా రేవంత్ రెడ్డి.?

Posted: 09/16/2015 01:36 PM IST
Is it all set for the revanth reddy as the telangana tdp new boss

ఒకర్ని పక్కకు పెట్టాల్నంటె ఏదో ఒకటి ఎత్తు గడవేసి పక్కకు పెట్టాలి.  తెలుగుదేశం పార్టీ ఆంధ్రా అధ్యక్ష్య పదవి గురించి ఎలాంటి సర్వే అనకుండా వదిలేసిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ వరకు వచ్చే సరికి బీసీ నేత అయిన ఎల్.రమణను పక్కన పెట్టేసి.. ఎర్రబెల్లిని తప్పిందచడానికి ఐవీఆర్ఎస్ సర్వే అంటూ కొత్త ఎత్తుగడ వేశారని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.  రేవంత్ కు అధ్యక్ష్య పదవి అంటే ఎర్రబెల్లి వర్గం ఊరుకోకపోవడంతో పాటు బీసీని అధ్యక్షుడుగా తప్పించి ఓసికి ఇవ్వడం కూడా వివాదం అవుతుందని ఐవీఆర్ఎస్ అంటూ బీసీల చెవిలే పువ్వు పెట్టేస్తున్నాడంటూ బిసి సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు అంటూ తెలంగాణ టిడిపి శ్రేణుల్లో గుసగుసలు వినిసిస్తున్నాయి. ఎంతో కాలంగా రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లిల మధ్య నడుస్తున్న ఆదిపత్య పోరులొ సీనియారిటి కోటా కింద ఎర్రబెల్లి మాటకు అధినేత ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వారని కానీ పరిస్థితి మారిందని తెలుస్తోంది.

అయితే ఇందులో మరో వాదన కూడా వినిపిస్తోంది. ఓటుకునోటు కేసులో రేవంత్ తో పాటు చంద్రబాబు ఇరుక్కున్నాడు. ఇప్పుడు రేవంత్ ఎంత సంతృప్తిగా ఉంటే బాబు అంత సేఫ్ గా ఉంటాడు అంటూ మరికొందరు అనుకుంటున్నారట.  అందుకే రేవంత్ కు పగ్గాలు అప్పగించడానికి 4.5 లక్షల మంది క్రియాశీల సభ్యుల అభిప్రాయ సేకరణ అంటూ డ్రామా మొదలు పెట్టాడని అంటున్నారు. అయితే ఇప్పటికే జాబితా అంతా సిద్దమయిందని 60 మందితో కమిటీని చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడమే తరువాయి అని తెలుస్తోంది. ఆంధ్రా మీడియా అండ ఉందని సమాచారం.  మరి చంద్రబాబు ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి. అయితే పార్టీలో ఎర్రబెల్లి లాంటి సీనియర్ నేతను పక్కకు పెడితే పార్టీ శ్రేణులకు ఎలాంటి సంకేతాలు అందుతాయి అన్న విషయాన్ని బాబుగారు పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Errabelli Dayakar Rao  TTDP  TDP  Chnadrababau Naidu  

Other Articles