Janata Parivar Merger Not Possible Before Bihar Elections: Samajwadi Party

Janata parivar formation hindered by technicalities merger unlikely before bihar polls

Janata Parivar, Bihar elections, Ram Gopal Yadav, Samajwadi Party, Bihar Polls, janata parivar, nitish kumar, samajwadi party, mulayam singh, lalu prasad, bihar assembly polls

Another attempt to bring together the parties which were once a part of the previous Janata Dal is not making much headway.

జనతా పరివార్‌ విలీనానికి బ్రేక్‌?

Posted: 05/11/2015 09:00 PM IST
Janata parivar formation hindered by technicalities merger unlikely before bihar polls

జనతా పరివార్‌ విలీనానికి ఆదిలోనే హంసపాదు పడింది. 80వ దశకంలో దేశాన్ని పరిపాలించిన జనతాపార్టీకి పూర్వవైభవం సాధించేందుకు, దాన్నుంచి వేరుపడిన ఆరు ప్రధాన పార్టీలను విలీనం చేయాలన్న ప్రయత్నాలకు తొలి అడ్డంకి ఎదురైంది. ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ విలీనం ప్రక్రియకు మోకాలడ్డుతోంది. బీహార్‌ ఎన్నికల్లోపు జనతా పరివార్‌ విలీనం అసాధ్యమని ఆపార్టీ తేల్చి చెప్పింది. ‘పరివార్‌ విలీనం ప్రక్రియ సాంకేతిక అంశాల కారణంగా ప్రస్తుతానికి నిలిచిపోయింది.

బీహార్‌ ఎన్నికల్లోపు విలీనం దాదాపు అసాధ్యమే. ఒకవేళ అలాంటి ప్రక్రియ ఏదైనా చేపడితే, అది మా పార్టీకి మరణశాసనమే’ అని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఈయన మాటల ద్వారా జనతా పరివార్‌ విలీనం ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నట్లే భావిస్తున్నారు. కొత్త జనతాపార్టీ పతాకం, ఎన్నికల గుర్తు తదితరాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీలో రాంగోపాల్‌ యాదవ్‌ కూడా ఒకరు. ఆయనే, ఇప్పుడు విలీనం సాధ్యం కాదని ప్రకటించడం పరివార్‌లో కలవరాన్ని కలిగిస్తోంది.

ఎస్పీ నేత వ్యాఖ్యలపై స్పందించిన శరద్‌యాదవ్‌, ములాయంను తమ అధినేతగా ఎన్నుకున్నామని, ఏ ప్రకటన అయినా చేసే అధికారం ఆయనదేనని అన్నారు. జనతా పరివార్‌ విలీనానికి, ఎస్పీ మోకాలడ్డడానికి పార్టీలో వ్యతిరేకతే కారణమని భావిస్తున్నారు. బీహార్‌ ఎన్నికల్లోపు విలీనమైతే, ఆర్జేడీ, జేడీయూలకే లాభం తప్ప తమకు ఒరిగే ప్రయోజనమేదీ లేదని పార్టీ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. పైగా, విలీనం వల్ల, దశాబ్దాలుగా ఉత్తరప్రదేశ్‌ ప్రజలందరికీ చిరపరిచితమైన పార్టీ ఎన్నికల గుర్తును కోల్పోయే ప్రమాదం ఉందని, దానివల్ల ఓటర్లు అయోమయానికి గురైతే, సొంత రాష్ట్రంలో తమ ఉనికికే ముప్పు వాటిల్లుతుందని ఎస్పీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఈ ప్రక్రియకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janata parivar  nitish kumar  samajwadi party  mulayam singh  

Other Articles