Rahul Gandhi is Following in My Footsteps, Union Minister Smriti Irani Says in Amethi

Smriti irani holds kisan panchayat in rahul gandhi s amethi

Rahul Gandhi following My Footsteps, Union Minister Smriti Irani, Smriti Irani in Amethi, Smriti Irani, Amethi, Smriti Irani Amethi, Rahul Gandhi, Amethi food park, Rahul gandhi food bill, rahul attacks modi govrnment, Congress Vice President Rahul Gandhi, food park, missing in action, Goa, Fab India

In Rahul Gandhi's Amethi, union minister Smriti Irani today declared him M.I.A or Missing in Action. She is in the Congress Vice President's Lok Sabha constituency on a one-day tour designed to underscore that he has not visited Amethi in over three months.

గోవాలో ఎవరిని ఫాలో అయ్యారు.. స్మృతి గారు..?

Posted: 05/12/2015 04:35 PM IST
Smriti irani holds kisan panchayat in rahul gandhi s amethi

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన అడుగు జాడల్లో నడుస్తున్నాడంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ అమె ఉత్తరప్రదేశ్లోని అమేథీ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గత మూడు నెలలుగా సొంత నియోజకవర్గంలో పర్యటించలేదని అన్నారు. రెండు నెలలు అజ్ఞాతంలో ఉండి వచ్చిన రాహుల్ అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికలలో ఎంపీగా గెలుపొందిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే నిమోజకవర్గంలో రాహుల్ పర్యటించారని స్మృతి ఎద్దేవా చేశారు. తాను ఇవాళ అమేధీలో పర్యటిస్తునందునే రాహుల్ రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారని అయన కార్యాలయం తెలిపిందని, అయితే ఈ విషయంలో తనను రాహుల్ ఫాలో అవ్వడం పట్ల సంతోషిస్తున్నానన్నారు.

ఇంతవరకు బాగానే రాహుల్ రెండు నెలలు ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం విషయాన్నే ఇప్పుడు అధికార పక్షం అస్త్రంగా మలుచుకుని ప్రచారం చేయడం పట్ల కాంగ్రెస్ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వున్నన్నాళ్లు రాహుల్ ఎప్పుడైనా సెలవుపై వెళ్లారా..? అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు కేంద్రమంత్రిగా వుంటూ.. బెంగళూరులో జరిగిన పార్టీ పదాదికారులు సమావేశానికి అమె హాజరుకాకపోవడం.. పార్టీ పట్ల అమెకున్న అంకిత బావాన్ని తెలుపుతుందని ఎద్దేవా చేశారు. రెండు నెలల పాటు సెలవులో వెళ్లిన తమ నేత అడుగుజాడాల్లో కేంద్రమంత్రి ఫాలో అయ్యారని.. ప్రధాని నుంచి పార్టీ ముఖ్యనేతలందరూ హాజరైన కార్యక్రమానికి హాజరుకాకుండా.. భర్తతో కలసి రెండు రోజుల పాటు గోవా పర్యటనలో గడిపారని విమర్శిస్తున్నారు. అయితే మరికోందరు యూపీఏ ని ఎన్డీఏ ఫాలో అవుతందని విమర్శిస్తుండగా, ఇంకోదరు మాత్రం ఎవరు ఎవర్నీ ఫాలో అవుతున్నారో ఎవరికి ఎరుక అంటూ.. మీరు మీరూ విమర్శలు చేసుకోవడం మాని.. ప్రజల కోసం పనిచేయాలని హితవు పలుకుతున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Smriti Irani  Amethi  

Other Articles