TDP silently permiting recreation clubs

Tdp planning to re open clubs in andrapradesh

TDP silently permiting recreation clubs, tdp planning to re open clubs in andrapradesh, TDP second grade leaders, force on top leaders, permiting recreation clubs, silently, re open, clubs, andrapradesh

TDP second grade leaders bringing force on top leaders to permit recreation clubs

గుట్టుచప్పుడు కాకుండా ‘రిక్రియేషన్’కు సై..?

Posted: 04/29/2015 05:00 PM IST
Tdp planning to re open clubs in andrapradesh

సమైక్య రాష్ట్రంలో మూతబడిన రిక్రియేషన్ కేంద్రాలను నవ్యాంధ్రలో మళ్లీ తెరిచేందుకు తెరచాటు వ్యవహారాలు కొనసాగుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కోనసాగిన సమయంలో రిక్రియేషన్ కేంద్రాలపై కొరడా ఝుళిపించారు. అప్పటి నుంచి అమల్లోకి వచ్చిన అదేశాలను రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇరు రాష్ట్రాలలో కోనసాగుతున్నాయి. రిక్రియేషన్ కేంద్రాల పేరిట పేకాట క్లబ్బులను నడుపుతూ.. క్లబ్ యాజమాన్యాలు..డబ్బులు సంపాదిస్తుండగా, వాటిలో అడి కుదేలైన అనేకులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికోందరు ఇళ్లను గుల్ల చేసుకుంటున్నారన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తడంతో రిక్రియేషన్ క్లబ్ లు మూతపడ్డాయి.

అయితే అప్పడు ప్రతిపక్షంలో వుండి నిమ్మకున్న టీడీపీకి చెందిన పలువురు నేతలు.. ఇప్పుడు తమ పార్టీయే అధికారంలోకి వచ్చేసరికి.. అప్పనంగా వచ్చే ఆదాయంపై దృష్టి సారించారు. వీటిని తెరిపించేందుకు భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారుస్తున్నారు. ఈ విషయాన్ని సీరియన్ గా తీసుకున్న ఓ టీడీపీ నేత ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమకు చెందిన జిల్లా పరిషత్ స్థాయి నేత కన్ను వీటిపై పడింది. తనకు ప్రధాన అనుచరుడు, ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో నేతతో కలసి రంగంలోకి దిగారు. రాష్ట్రంలో మూతపడిన పేకాట క్లబ్బులను తెరిపించేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. క్లబ్బుల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్న ఆ నేత, లోకల్ నుంచి హైదరాబాద్ వరకూ భారీ స్థాయిలో ముడుపులు ముట్టజెపుతున్నారని సమాచారం.

రెండు నెలల క్రితం కృష్ణా జిల్లాలో రెండు క్లబ్బులు పునఃప్రారంభం కాగా, పోలీసులు ఒకదాన్ని మూయించారు. రాజకీయ నేతల ఒత్తిడి అధికమవ్వడంతో.. అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది. కాగా, ఒక్కసారిగా కాకుండా గుట్టుచప్పుడు కాకుండా మెల్లిగా ఒక్కో క్లబ్ ఏర్పాటు చేసుకుంటామని టీడీపీ నేతలు అధికారులకు, పోలీసులకు హామి ఇస్తున్నారు. తీవ్రస్థాయి రాజకీయ ఒత్తిడిల నేపథ్యంలో స్థానిక అధికారులు కొన్ని క్లబ్బుల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : re open  clubs  andrapradesh  

Other Articles