Rahul gandhi | Congress | Media | News | Leave | Modi

Rahul gandhi very happy on his coverage in national media

Rahul gandhi, Congress, Media, News, Leave, Modi, Land bill, Coverage

Rahul gandhi very happy on his coverage in national media. After laong leave rahul gandhi got too much publicity in media. Rahul gandhi getting more media coverage than pm modi.

ఓపెన్ రాహుల్ డ్యాన్స్.. జంపింగ్... జంపాంగ్

Posted: 04/29/2015 04:15 PM IST
Rahul gandhi very happy on his coverage in national media

రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధినేత్రి కుమార రత్నం, కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టబోయే భావినేత. ఇంకా బాగా కలిసి వస్తే భారత్ కు కాబోయే ప్రధాన మంత్రి. అయితే పార్లమెంట్ సమావేశాల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన రాహుల్ గాంధీ బూస్టు, హార్లిక్స్ వీలైతే సెరిలాక్ కూడా తాగాడా అన్నట్లు తెగ దూకుడు మీదున్నారు. అవును లాంగ్ టూర్ తర్వాత మాటల తూటాలతో బిజెపి నాయకత్వాన్ని ఇబ్బంది పెడుతున్న రాహుల్ ఇప్పుడు తెగ సంబర పడుతున్నారట. వీలుదొరికితే జంపింగ్ జపాంగ్ .. జంపక్ జంపక్.. గిలిగిలిగా.. అంటూ మాస్ స్టెప్పులు కూడా వేస్తున్నారట. మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలతో లోలోపల గంగ్నమ్ డ్యాన్స్ కూడా చేసేస్తున్నాడట. ఇంతకీ రాహుల్ గాంధీని మరీ అంతలా సంతోష పెడుతున్న వార్త ఏంటో అని ఆలోచిస్తున్నారా.. ఆలొచించకండి కింది ప్యారా చదవండి చాలు తెలిసిపోతుంది.

రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలకు ముందు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. కొన్ని వార్తా ఛానళ్లు అయితే అత్యుత్సాహం చూపించి.. రాహుల్ గురించి కొన్ని ఎక్స్ క్లూజివ్ కథనాలు, ఫోటోలు ప్రసారం చేశాయి. అంతేనా రాహుల్ ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు అని తెగ వార్తలు వచ్చాయి. ఇలా రాహుల్ సెలవు కావలసినంత ప్రచారాన్ని చేసింది. మరి తిరిగి వచ్చాక మాత్రం తక్కువ చేసిందా.. అబ్బో హడావిడే హడావిడి. మీడియా వాళ్లు రాహుల్ అక్కడ ఉన్నాడు.. అది చేస్తున్నాడు అంటూ కథనాలు ప్రసారం చేసాయి. ఇప్పుడు మీడియాలో ప్రతి గంట గంటకు రాహుల్ గురించి ఏదో వార్త వస్తోంది. ఇప్పుడు ఇదే రాహుల్ ను తెగ సంతోష పెడుతోందట. ప్రస్తుతం ప్రధాని మోదీ కన్నా మీడియాకు రాహుల్ తన వైపుకు తిప్పుకోడంతో ఆనందానికి అవధులు లేవంట. మొత్తానికి మనోడు గాల్లో తేలినట్లుందే అంటూ ఊహా లోకంలో విహరిస్తున్నారట. మరి ఊహాలొకంలోనే గడుపుతాడా లేదంటే ఏదైనా చేస్తాడా చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  Congress  Media  News  Leave  Modi  Land bill  Coverage  

Other Articles