Polavaram pattiseema which benefits ap

pattiseema project, polavaram project, chandrababu on pattiseema project,chandrababu on polavaram project, TDP on on pattiseema project, TDP on polavaram project, YCP, TDP, Jagan on pattiseema project, jagan on polavaram project,

polavaram, pattiseema which benefits AP

పోలవరమా..? పట్టిసీమ..? ఏది లాభం..?

Posted: 03/18/2015 11:20 PM IST
Polavaram pattiseema which benefits ap

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు.. ఇరు పార్టీల నేతల వాగ్వాదాలకు వేదికగా నిలుస్తున్నాయన్న సందేహం ప్రజలకు కలగక మానదు. ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి వారిరువురు వెచ్చిస్తున్న సమయం కన్నా.. ఒకరినోకరు దూషించుకోవడానికే అధిక సమాయాన్ని కేటాయిస్తున్నట్లు కనబడుతోంది. అధికార, విఫక్ష సభ్యులు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటూ ప్రజాధనాన్ని వృధా చేయడం ఎంత వరకు సమంజసమో ప్రజాప్రతినిదులకే తెలియాలి. ఇక ఫైపెచ్చు బుధవారం జరిగిన అసెంబ్లీలో మరింత ఘాటు వాగ్వాధం చోటుచేసుకుంది. విపక్షానికి చెందిన సభ్యుడు కోడాలి నానిని ఉద్దేశించి ప్రసంగించిన అధికార పక్ష సభ్యుడు బోండా ఉమా ఏంట్రా, ఏంట్రా.. ఏంట్రారేయ్ అనే వ్యాఖ్యాలు  ప్రజల నుంచి విమర్శలను ఎదుర్కోనేలా చేస్తున్నాయి.

అసలు ఇంతకీ ఈ ఇదంగా ఎందుకు జరిగిందంటే.. రాష్ట్రంలో పోలవరం స్రాజెక్టును నిర్మించడమా లేక పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించడమా అన్న అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో చర్చ సందర్బంగా అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న తరుణంలో ఈ ఘాటు ఏకవచన సంబోధనలు వినబడ్డాయి. రాయలసీమ ప్రయోజనాలు కాపాడేందుకు పట్టిసీమ ప్రాజెక్టు అవసరమని అధికార పక్షం నోక్కి చెబుతుండగా, పోలవరం ప్రాజెక్టు అంతకన్నా ముఖ్యమని విపక్షం డిమాండ్ చేస్తుంది.

అయితే ఈ రెండు ప్రాజెక్టులపై ప్రజల్లో మాత్రం మరో భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే.. ఆ క్రెడిట్ అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికే చెందుతుందని.. అందుకే దానిని నిర్మాణ పనులను నత్తనడక కొనసాగిస్తూనే.. అంతకన్నా ముంగుగా పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించాలని అధికార పక్షం బావిస్తుందని కథనాలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు తమకు రావాల్సిన క్రెడిట్ అడ్డకుంటున్నారని విపక్షం పట్టిసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందన్న పుకార్లు వినబడుతున్నాయి. కాగా జలయజ్ఞాన్ని ఎట్టి పరిస్థితులలో ధనయజ్ఞంగా మర్చనని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. విపక్ష సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు బదులివ్వడంలో ఎందుకు విఫలం చెందుతున్నారు..? విపక్ష నేతపై అధికార సభ్యుల చేత విమర్శల వాగ్వాదాలు తప్ప.. సంయమనంగా సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు..? అన్న ప్రశ్నలు కూడా ప్రజల్లో వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pattiseema  polavaram  YCP  TDP  

Other Articles