Telanagna cm k chandrashekar rao afraid of students

kcr, osmania students, students, notifications, jobs, telanagana

telanagna cm k.chandrashekar rao afraid of students. in the campaign of telanagana osmania students maintain key roal. from that onwards students efforts for telanagana. kcr is fearing about the students strikes.

వాళ్ల దెబ్బకు కెసిఆర్ అబ్బా అనాల్సిందేనా..?

Posted: 03/18/2015 04:47 PM IST
Telanagna cm k chandrashekar rao afraid of students

తెలంగాణ ఉద్యమంలొ ఎంతో కీలకంగా వ్యవహరించిన ఉస్మానియా యూనివర్సిటి విద్యార్థులు మరో సారి తమ ప్రతాపాన్ని చూపుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ మొండి చెయ్య చూపుతోంది. దాంతో ఓయు విద్యార్థులు మరో సారి యుద్దానికి సిద్దమయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో కీలకంగా ఉద్యమాన్ని నడిపించిన ఓయు విద్యార్థులు ఇప్పుడు తెలంగాణ సర్కార్ కు వ్యతిరేకంగా చేసే ఉద్యమం ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.జ

తెలంగాణ సాధన కోసం ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన నిరాహార దీక్ష కీలక సమయంలొ విరమించినపుడు ఓయు విద్యార్థులు కెసిఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తారు. దాంతో కంగారు తిన్న కెసిఆర్ నిరాహార దీక్ష ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అలా ఉద్యమంలొ కెసిఆర్ ను ఖంగుతినిపించిన ఓయు విద్యార్థులు మరో సారి కెసిఆర్ కు చుక్కలు చూపిస్తారా అనే అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా, కెసిఆర్ సర్కార్ ఏర్పాటుకు ఎంతో కృషి చేసిన విద్యార్థులు ఇప్పుడు తిరగబడితే పరిస్థితి ఏంటని ప్రశ్న అందరిని తొలుస్తోంది.

తెలంగాణ సర్కార్ తొందరలోనే ఉద్యోగ ప్రకటన చెయ్యకపోతే మాత్రం కెసిఆర్ కు ఆశాభంగం తప్పదని సంకేతాలు వస్తున్నాయి. నిన్నటి దాకా కెసిఆర్ ను అందలం ఎక్కించిన విద్యార్థులు ఒక్క సారిగా తిరగబడితే విపరీతాలు జరుగుతాయని టిఆర్ఎస్ వర్గాలు కూడా అనుకుంటున్నాయని సమాచారం. అయితే వీలైనంత త్వరగా నోటిఫికేషన్లను జారీ చెయ్యడం ద్వారా విద్యార్థుల ఉద్యమాన్ని తగ్గించ వచ్చని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి విద్యార్థులంటే కెసిఆర్ కు వణుకు పడుతోందని సమాచారం. మరి సమీప భవిష్యత్తులోమ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  osmania students  students  notifications  jobs  telanagana  

Other Articles