Markandey katju dares lok sabha to book him under lunatics act

Markandey Katju dares Lok Sabha, Katju dares Lok Sabha, Katju dares Lok Sabha to book him under 'Lunatics Act', Katju dares to book him under 'Lunatics Act', Katju dares book him under "Lunatics Act", Katju dares Lok Sabha for punishing him

After Rajya Sabha, former Supreme Court judge Markandey Katju dared Lok Sabha to book him under "Lunatics Act" for punishing him.

మార్కెండేయుడు మహా తెలివైన పిచ్చోడు..!

Posted: 03/13/2015 09:05 PM IST
Markandey katju dares lok sabha to book him under lunatics act

దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తిగా చేసిన అనుభవానికి తోడు.. న్యాయశాస్త్రంలో ప్రావీణ్యం, తలనెరిసిన మేధావి చట్టసభలనే ధిక్కరిస్తూ.. అగుడు ముందుకేసి తనను శిక్షించగలరా..? అని ప్రశ్నిస్తూ.. గత కొంత కాలంగా సంచలన వార్తలకు కేంద్ర బిందువైన మార్కండేయ ఖడ్జూ తనపై కేసు నమోదు చేయడానికి సూచనలు కూడా ఇస్తున్నాడు. జాతిపిత మహాత్మగాంధీ సహా నేతాజీ సుబాష్ చంద్రబోస్ లపై అనుచిత వ్యాఖ్యాలు చేసిన రాజ్యసభ మండిపాటుకు గురైన మార్కండేయ ఖడ్జూ.. అంత ప్రావిణ్యమూ పెట్టుకుని తనకు తానే పిచ్చోడిగా ముద్ర వేసుకుంటున్నాడు. తనపై కేసు పెట్టే దమ్ము లోక్ సభకు వుందా అంటూ కొత్త వివాదానికి తెర తీశాడు. ఈ మేరకు తన బ్లాగ్ లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

తనపై ఓ గౌరవ సభ్యుడు ఎప్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారని, తనపై ఏ కేసు నమోదు చేస్తారో..? చెప్పాలని ఆయన సవాల్ విసిరాడు. ఏ సెక్షన్ల కింద కేసు పెడతారు..? అని పార్లమెంటు సభ్యులను నిలదీశాడు. అంతటితో ఆగకుండా తనపై అభియోగాలు మోపడానికి ఎంపీలు బుర్ర బద్దలు కోట్టుకోవాల్సిందేననంటూ సానుభూతి చూపాడు. తనపై పిచ్చోడి సెక్షన్ కింద మాత్రమే కేసు నమోదు చేయవచ్చునని సూచనలు ఇచ్చాడు. అసలే న్యాయకోవిదుడు.. ఆపై ఎలా..? అని అలోచిస్తున్న ఎంపీలకు ఆయన సలహా రుచించలేదు. కానీ మార్కండేయ ఖడ్జూ ఓ తెలివైన పిచ్చోడని అభివర్ణించినట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Markandey Katju  Lok sabha  Lunatics Act  punish  

Other Articles