Salaries of telangana mlas to be hiked to rs 3 lakh

Salaries of Telangana MLAs to be hiked, Telangana MLAs Salaries to be hiked, legislative affairs minister T. Harish Rao, salaries and perks of Telangana legislators to be hiked, TS-Budget-2015, telangana assembly, cm kcr, mlas, salaries, MLA's salaries 1.20 lakh to Rs 3 lakh per month, Salaries of Telangana MLAs

If the efforts of legislative affairs minister T. Harish Rao succeed, salaries and perks of Telangana legislators are set to get a huge hike from the present Rs 1.20 lakh per month.

భారీగా పెరగనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనాలు..?

Posted: 03/14/2015 03:31 PM IST
Salaries of telangana mlas to be hiked to rs 3 lakh

తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వేతనాలను భారీగా పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో.. ఇఫ్పుడు అదే కోవలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతబెత్యాలను కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గుజరాత్ తరువాత దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన కేసీఆర్.. అదే స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలను కూడా భారీగా పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు లక్షా 20 వేల రూపాయల జీతాన్ని మూడు లక్షల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే క్రమంలో ఎమ్మెల్సీలకు ప్రస్తుతం వున్న 95 వేల రూపాయల జీతాన్ని రెండున్నర లక్షల రూపాయల మేర పెంచాలని భావిస్తోందని సమాచారం. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం వెల్లడించే అవకాశముంది.  

 సీఎం, మంత్రులు, కేబినేట్ హోదా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటరీ సెక్రటరీలు మినహాయిస్తే మిగతా 124 మందికీ రూ. 2 లక్షల చొప్పున జీతాలు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్న.. మూడు లక్షల రూపాయలకు మేర పెంచే అవకాశం ముందని కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఏకంగా శాసనసభ్యలు, మండలి సభ్యలు జీతాలను మూడు, రెండున్నర లక్షలకు పెంచితే ప్రజల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతాయన్న సందిగ్ధతలో ప్రభుత్వం వుందని తెలుస్తోంది. మరోవైపు రెండు లక్షల మేర జీతాలను పెంచితే ప్రభుత్వంపై 12.5 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని, ఇక మూడు లక్షల మేర పెంచితే.. ప్రభుత్వ ఖజానాకు మరింత భారం పడుతుందన్న వార్తలు వినబడుతున్నాయి,

ఇక మూడు లక్షల మేర తమ జీతబెత్యాలు పెంచాలని శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల కోరుతున్నారు. తమ జీతం నెలకు రూ.3 లక్షలకు  పెంచాలని తెలంగాణ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీ లాబీలో సంతకాల సేకరణ చేపట్టారు. సంతకాల సేకరణ పత్రాన్ని తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి హరీష్ రావుకు ఇవ్వనున్నారు. అతని అనుమతితో తెలంగాణ ఎమ్మెల్యేలు...ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేయనున్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమన్న కేసీఆర్.. అమరవీరుల విషయంలో లెక్కలను కుదించి.. అమరవీరుల త్యాగఫలంతో గద్దెనెక్కిన ప్రజాప్రతినిధుల జీవీతాలను మాత్రం పెంచుతున్నారని విమర్శలు కూడా వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA salary hike  K. Chandrasekhar Rao  Telangana  

Other Articles